OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- 8.4 రేటింగ్- పదేళ్ల తర్వాత హీరోగా రీఎంట్రీ!

Telugu Crime Action Thriller Harudu OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హరుడు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఒకప్పటి కథానాయకుడు వెంకట్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. ఐఎమ్‌డీబీ నుంచి 8.4 రేటింగ్ సాధించిన హరుడు ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 28, 2026, 17:45:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu Crime Action Thriller Harudu OTT Release: ఈ వారం సుమారు 50 వరకు సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. అందులో ఎక్కువగా శుక్రవారం (ఆగస్ట్ 28) నాడే అధిక సంఖ్యలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, వీటిలో ఒక తెలుగు ఇంట్రెస్టింగ్ సినిమా కూడా నేడు ఓటీటీకి వచ్చేసింది.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- 8.4 రేటింగ్- పదేళ్ల తర్వాత హీరోగా రీఎంట్రీ!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- 8.4 రేటింగ్- పదేళ్ల తర్వాత హీరోగా రీఎంట్రీ!

దశాబ్ధం తర్వాత ఎంట్రీ

ఆ సినిమానే హరుడు. ఒకప్పుడు శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘అన్నయ్య’ ‘ఆనందం’ ‘శివరామరాజు’ వంటి హిట్ చిత్రాలతో ఆకట్టుకున్న కథనాయకుడు వెంకట్ సుమారు పదేళ్ల కాలం తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది.

హీరోగా కమ్‌బ్యాక్ మూవీ

అయితే, రీసెంట్‌గా పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో నటుడిగా అలరించిన వెంకట్ హీరోగా మాత్రం కమ్‌బ్యాక్ ఇచ్చిన మూవీ మాత్రం హరుడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహించారు.

ముగ్గురు హీరోయిన్స్

వెంకట్ పోలీస్ రోల్‌లో నటించిన ఈ హరుడు సినిమాలో హీరోయిన్‌గా నటాషా సింగ్ చేసింది. అలాగే, బ్యూటిఫుల్ హీరోయిన్స్ హెబ్బా పటేల్, సలోని కీలక పాత్రలు పోషించారు. వేద్విక సోనీ, సుమన్, అలీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

హరుడు ఐఎమ్‌డీబీ రేటింగ్

మే 15న థియేటర్లలో విడుదలైన హరుడు సినిమా పర్వాలేదనిపించుకుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం 8.4 రేటింగ్‌ను సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. ఇలాంటి హరుడు ఓటీటీలోకి ఇవాళ (ఆగస్టు 28) వచ్చేసింది.

హరుడు ఓటీటీ రిలీజ్

తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో హరుడు ఓటీటీ రిలీజ్ అయింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా 3 నెలల తర్వాత సడెన్‌గా ఆహాలో నేటి నుంచి హరుడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మాఫియా, క్రైమ్, వుమెన్ ట్రాఫికింగ్, మర్డర్, ఇన్వెస్టిగేషన్ వంటి థ్రిల్లింగ్ అంశాలతో సాగే హరుడును నేటి నుంచి ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

హరుడు మూవీ కథ

హరుడు కథలోకి వెళితే.. ముంబై మాఫియాను గడగడలాడించిన డీసీపీ శంకర్ (వెంకట్)కు ఎన్‌కౌంటర్ శంకర్ అని పేరుంది. అతను హైదరాబాద్ సిటీకి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ముఖ్యమంత్రి (సుమన్)నే ప్రశ్నించే ధైర్యవంతుడైన స్వతంత్ర ఎమ్మెల్యే అయిన వరదరాజులు (శ్రీహరి పైలా) శంకర్‌కు ఓ కేసు విషయంలో పరిచయం అవుతాడు.

ఎమ్మెల్యే సీక్రెట్ తెలిసి

మరోవైపు నిరుద్యోగులైన కొందరు విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకునేందుకు కార్ల ఇంజిన్లు దొంగతనం చేసి పట్టుబడతారు. వారిని ఎమ్మెల్యే విడిపించిన వెంటనే ఆ విద్యార్థులపై దాడి జరుగుతుంది. అది చేయించింది కూడా విడిపించిన ఎమ్మెల్యే వరదరాజులు అని శంకర్‌కు తెలుస్తుంది.

ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

ఆ తర్వాత ఏమైంది అసలు వరదరాజులు రాజకీయం ఏంటీ? విద్యార్థులు దొంగతనం చేసిన ఇంజిన్లకు వరదరాజులకు సంబంధం ఏంటీ? ఆ స్టూడెంట్స్ ఎందుకు దొంగతనం చేశారు? ముంబై డాన్ రాజన్ (రవివర్మ) ఈ గొడవలోకి ఎందుకు వచ్చాడు? శంకర్ భార్య ప్రియ (నటాషా సింగ్) ఎలా చనిపోయింది? చివరికి శంకర్ ఈ నేర సామ్రాజ్యాన్ని ఎలా అంతమొందించాడు? అనే విషయాలతో తెరకెక్కిన సినిమానే హరుడు.

ఆహా ఓటీటీలో

ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న హరుడు సినిమాను థియేటర్లలో మిస్ అయినవాళ్లు, క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే తెలుగు ఆడియెన్స్ ఆహా ఓటీటీలో ఇవాళ్టీ నుంచి ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More