...
...
Next Story

OTT Trending: థియేటర్లో మిస్సైన సీన్లతో తెలుగు హారర్ థ్రిల్లర్ ఓటీటీ హంగామా.. మలయాళ దెయ్యం సినిమాకూ డిజిటల్ ఆడియన్స్ జై

థ్రిల్లర్లకు ఓటీటీలో మామూలు క్రేజ్ ఉండదు. ఒక అందులోనూ హారర్ థ్రిల్లర్లు అయితే వేరే లెవల్. ఇప్పుడు ఓటీటీలో ఇలాంటి తెలుగు, మలయాళం హారర్ థ్రిల్లర్లు అదరగొడుతున్నాయి. ట్రెండింగ్ లో తెలుగు, మలయాళం హారర్ థ్రిల్లర్లు అదుర్స్ అనిపిస్తున్నాయి.

Published on: Feb 10, 2026, 05:48:22 IST
Advertisement

ఓటీటీలో హారర్ థ్రిల్లర్లు అదరగొడుతున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ హారర్ సినిమాలదే డామినెన్స్ నడుస్తోంది. ఓ వైపు తెలుగు సినిమా ‘ది రాజాసాబ్’, మరోవైపు మలయాళం మూవీ ‘సర్వం మాయ’ ఓటీటీని షేక్ చేస్తున్నాయి. డిజిటల్ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.

రాజాసాబ్ ఓటీటీ

ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ జోరు
ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ జోరు

సంక్రాంతి 2026 సందర్బంగా థియేటర్లలో రిలీజైన రాజాసాబ్ డిజాస్టర్ గా నిలిచింది. పెట్టిన బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం ప్రభాస్ హీరోగా నటించిన ఈ రాజాసాబ్ మూవీ అదరగొడుతోంది. ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ కు డిజిటల్ ఆడియన్స్ జై కొడుతున్నారు. జియోహాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రాజాసాబ్ ఇండియాలోనే నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది.

మూడు భాషల్లో

రాజాసాబ్ మూవీ జియోహాట్‌స్టార్‌ లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఫిబ్రవరి 6న రిలీజైంది. ఇప్పుడు మలయాళం మినహాయించి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ట్రెండింగ్ నంబర్ వన్ లో ఉంది ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్. ఈ సినిమాకు మారుతి డైరెక్టర్. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఓటీటీలో ఎక్సటెండెడ్ కట్ తో రన్ అవుతోంది రాజాసాబ్. థియేటర్లో మిస్సైన సీన్లు ఓటీటీలో చూడొచ్చు.

సర్వం మాయ ఓటీటీ

సర్వం మాయ అనేది క్యూట్ దెయ్యం స్టోరీ. ఇందులో నివిన్ పౌలీ, రియా షిబు ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 30 నుంచి జియోహాట్‌స్టార్‌లో సర్వం మాయ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో సర్వం మాయ డిజిటల్ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది.

జియోహాట్‌స్టార్‌లో ప్రతి భాషలోనూ ట్రెండింగ్ టాప్ 10లోపు ఉంది సర్వం మాయ మూవీ. మలయాళంలో అయితే నంబర్ వన్ గా కొనసాగుతోంది. తెలుగు, తమిళంలో సెకండ్ ప్లేస్ లో ఉంది. గతం మర్చిపోయిన ఓ దెయ్యానికి హీరో సాయం చేయడమే సర్వం మాయ మూవీ స్టోరీ.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks