గ్లోబల్ సెన్సేషన్ ఓటీటీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అభిమానులకు మరో అద్భుతమైన విజువల్ ట్రీట్ సిద్ధమైంది. టార్గేరియన్ వంశస్థుల మధ్య సాగే రక్తపాతాన్ని కళ్లకు కట్టే ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ (House of the Dragon) సీజన్ 3 టీజర్ గురువారం (ఫిబ్రవరి 19) విడుదలైంది. కేవలం ఒక నిమిషం 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో యుద్ధం తాలూకు భీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది.
టీజర్‌లో ఏముంది?

గత సీజన్‌లో ఎగన్ వైకల్యం పొందిన తర్వాత ఐరన్ థ్రోన్‌పై ఎమండ్ టార్గేరియన్ ఆసీనుడై ఉండటాన్ని మనం చూడవచ్చు. మరోవైపు, క్వీన్ అలిసెంట్ హైటవర్ తన నగరాన్ని కాపాడుకునేందుకు రహస్యంగా కింగ్స్ ల్యాండింగ్‌ను వీడి తన చిరకాల ప్రత్యర్థి రైనీరా దళాలకు లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్లు టీజర్ సంకేతాలిచ్చింది.
కొత్త డ్రాగన్స్
రైనీరా తన సైన్యంలో కొత్త డ్రాగన్లను చేర్చుకోవడం అలిసెంట్ కుటుంబానికి పెద్ద దెబ్బగా మారబోతోంది. ఈ సీజన్‌లో నవలల్లోనే అత్యంత కీలకమైన 'బ్యాటిల్ ఆఫ్ ది గల్లెట్' (Battle of the Gullet) యుద్ధం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సముద్రంపై వేలేరియన్ నావికాదళానికి, డ్రాగన్లకు మధ్య జరిగే భీకర పోరాట దృశ్యాలు టీజర్‌లో అద్భుతంగా ఉన్నాయి.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జూన్ నెలలో జియో హాట్‌స్టార్‌లో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సిరీస్ హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ రాసిన 'ఫైర్ అండ్ బ్లడ్' నవల ఆధారంగా రూపొందిన ఈ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు సుమారు 200 ఏళ్ల ముందు జరిగిన కథగా సాగుతుంది.
సూపర్ హిట్ ఓటీటీ సిరీస్
మొత్తం నాలుగు సీజన్లతో ఈ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ ముగుస్తుందని హెచ్‌బిఓ ఇప్పటికే ధృవీకరించింది. కాబట్టి ఇది చివరికి ముందు (Penultimate) సీజన్ కానుంది హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ 3.
కొత్తగా రంగంలోకి దిగుతున్న నటీనటులు
{{/usCountry}}మొత్తం నాలుగు సీజన్లతో ఈ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ ముగుస్తుందని హెచ్‌బిఓ ఇప్పటికే ధృవీకరించింది. కాబట్టి ఇది చివరికి ముందు (Penultimate) సీజన్ కానుంది హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ 3.
కొత్తగా రంగంలోకి దిగుతున్న నటీనటులు
{{/usCountry}}ఇక ఈ సీజన్ 3లో కొత్త నటీనటులు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎమ్మా డి ఆర్సీ, మాట్ స్మిత్, ఒలివియా కుక్ వంటి పాత నటీనటులతో పాటు జేమ్స్ నార్టన్ - ఓర్ముండ్ హైటవర్‌గా, టామీ ఫ్లానాగన్ - లార్డ్ రోడెరిక్ డస్టిన్‌గా, డాన్ ఫోగ్లర్ - సర్ టోరెన్ మాండర్లీగా కనిపించనున్నారు.
ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ముగింపు దశలో
వీరితో పాటు మరికొంత మంది ప్రతిభావంతులైన నటులు ఈ భారీ యుద్ధంలో పాలుపంచుకోనున్నారు. అలాగే, ప్రస్తుతం జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్' ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో ఈ టీజర్ రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.