Illu Illalu Pillalu Serial: తెలుగు రాష్ట్రాల్లో మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్స్ లో ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ఒకటి. ఈ సీరియల్ లో రామరాజు ముగ్గురు కొడుకులు చందు, సాగర్, ధీరజ్ కథలు ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. ఈ సీరియల్ లో అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ ముగ్గురు బయట కూడా అదే రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నారు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు చందు పెళ్లి

పాపులర్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలులో రామరాజు పెద్ద కొడుకు చందుగా ప్రశాంత్, నడిపోడు సాగర్ గా రఫీక్ షా, చిన్నోడు ధీరజ్ గా నితిన్ నటిస్తున్నారు. తాజాగా పెద్దోడు ప్రశాంత్ పెళ్లి జరిగింది. ఈ నవంబర్ 25న పెద్దోడి వివాహం గ్రాండ్ గా జరిగింది. కానీ షూటింగ్ కారణాల వల్ల సీరియల్ టీమ్ పెళ్లికి వెళ్లలేకపోయింది.
ధీరజ్ రిసెప్షన్
తాజాగా ప్రశాంత్ రిసెప్షన్ కు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ నుంచి రఫీక్ షా, నితిన్, అన్షు రెడ్డి (నర్మద)తో పాటు అన్షు ఫ్రెండ్ శ్రీప్రియ కూడా వెళ్లారు. అయితే ఈ రిసెప్షన్ కు నితిన్ రాడని ముందు ప్రశాంత్ కు చెప్పాడంటా. కానీ సడెన్ గా రిసెప్షన్ రోజున నితిన్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఒక్కసారిగా తన ఇంట్లో నితిన్ ను చూసిన పెద్దోడు ప్రశాంత్ షాక్ అయ్యాడు. సంతోషంతో అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.
వీడియో వైరల్
ప్రశాంత్ కు నితిన్ సర్ ప్రైజ్ ఇచ్చిన వీడియోను, తమ ప్లానింగ్ ను రఫీక్ షా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సీరియల్ లోనే కాదు బయట కూడా వీళ్లు నిజమైన బ్రదర్స్ లా ఉంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నితిన్ ను చూడగానే ప్రశాంత్ కు కన్నీళ్లు రావడమే అందుకు నిదర్శనమని అంటున్నారు.
సీరియల్ లో ఇలా
{{/usCountry}}ప్రశాంత్ కు నితిన్ సర్ ప్రైజ్ ఇచ్చిన వీడియోను, తమ ప్లానింగ్ ను రఫీక్ షా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సీరియల్ లోనే కాదు బయట కూడా వీళ్లు నిజమైన బ్రదర్స్ లా ఉంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నితిన్ ను చూడగానే ప్రశాంత్ కు కన్నీళ్లు రావడమే అందుకు నిదర్శనమని అంటున్నారు.
సీరియల్ లో ఇలా
{{/usCountry}}ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. తన కుటుంబాన్ని మోసం చేసిన వల్లికి విడాకులు ఇవ్వాలనే మొండి పట్టుదలతో చందు ఉన్నాడు. మరోవైపు తన మాజీ లవర్ అంజలికి అతని దగ్గరవుతున్నాడు. ఇక లంచం తీసుకున్నాడనే కారణంతో సాగర్ జాబ్ పోయింది.
మరోవైపు ధీరజ్ ఏమో కొత్తగా ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేశాడు. దాన్ని మూయించేందుకు భద్రావతి కుట్రలు పన్నుతూనే ఉంది. మరి ఈ సీరియల్ ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.