Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సీరియల్ టీఆర్పీని పెంచడమే టార్గెట్ గా చందు మాజీ లవర్ అంజలిని మేకర్స్ రంగంలోకి దించారు. తాజాగా అంజలి ఈ సీరియల్ లోకి వచ్చింది. ఆమె ఎంట్రీతో కథ మరింత రసవత్తరంగా సాగే అవకాశముంది.
కొత్త క్యారెక్టర్లు

ఏ సీరియల్ లోనైనా కథను మరింత రక్తి కట్టించడానికి, ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచడానికి కొత్త క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. అలా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో అంజలి అనే క్యారెక్టర్ ను ప్రవేశపెట్టారు. చందు మాజీ లవర్ గా ఆమెను చూపించారు. దీంతో చందు, అంజలి మళ్లీ కలుస్తారా? బల్లక్కాయ్ పరిస్థితి ఏంటీ అనేది ఉత్కంఠ పెంచుతోంది.
భర్త నుంచి విడిపోయి
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో బతుకమ్మ సంబరాల్లో భాగంగా అంజలి కనిపించింది. అయితే ఆమె భర్త నుంచి విడిపోయిందని, ఇంటి దగ్గరే ఉంటూ జాబ్ చేసుకుంటుందని పరిచయం చేశారు. ఆమెను భర్త మోసం చేసినట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో తిరిగి చందు కంట మాత్రం పడొద్దని, మళ్లీ గతాన్ని గుర్తు చేసుకోవద్దని అంజలి అనుకుంటుంది.
బల్లక్కాయ్ కు విడాకులు
మరోవైపు చందు ఏమో తన భార్య వల్లికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఆ బల్లక్కాయ్ తన ఫ్యామిలీ మోసం చేయడం, కుట్రలు పన్నడం చందు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే లాయర్ తో నోటీసులు కూడా పంపించాడు. కానీ ఆ నోటీసులు ఏమో భద్రావతి చేతికి చిక్కాయి.
అంజలిని కలుస్తాడా?
అంజలి ఏమో చందు తనను చూడకూడదు అనుకుంటుంది. కానీ గుడిలో అంజలిని ధీరజ్ ఆల్రెడీ చూశాడు. మరి చందు కూడా అంజలిని చూస్తే అప్పుడు పరిస్థితి ఏంటీ? అసలే తన భార్య చేసిన మోసానికి రగిలిపోతున్న చందు మళ్లీ పాత ప్రేయసికి కనెక్ట్ అవుతాడా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
బల్లక్కాయ్ కు షాక్
{{/usCountry}}అంజలి ఏమో చందు తనను చూడకూడదు అనుకుంటుంది. కానీ గుడిలో అంజలిని ధీరజ్ ఆల్రెడీ చూశాడు. మరి చందు కూడా అంజలిని చూస్తే అప్పుడు పరిస్థితి ఏంటీ? అసలే తన భార్య చేసిన మోసానికి రగిలిపోతున్న చందు మళ్లీ పాత ప్రేయసికి కనెక్ట్ అవుతాడా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
బల్లక్కాయ్ కు షాక్
{{/usCountry}}అంజలి ఎంట్రీతో బల్లక్కాయ్ కు షాక్ తప్పేలా లేదు. తన తప్పులు తెలుసుకున్న బల్లక్కాయ్ ఇప్పుడు నిజంగానే మారిపోదామనుకుంటోంది. కానీ ఆమె మాటలను వేదవతి సహా ఆ ఇంట్లో ఎవరూ నమ్మడం లేదు. మరి తన భర్త చందుకు అంజలి మళ్లీ దగ్గరవుతే వల్లి ఏం చేస్తుంది? అసలు ఆమె తట్టుకోగలదా? అసలు ఇంతకీ చందు, అంజలి మధ్య పాత ప్రేమ మళ్లీ చిగురిస్తుందా? అనేది రాబోయే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్లలో చూడాల్సిందే.