...
...
Next Story

Illu Illalu Pillalu July 27 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- తినేచోట రెచ్చగొట్టిన సేనాపతి.. అనాథ కొడుకు, కూలోళ్లు అంటూ!

Illu Illalu Pillalu Serial July 27th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 27వ ఎపిసోడ్‌లో అందరు కలిసిపోయారు కాబట్టి 2 కుటుంబాల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకుందామని ధీరజ్‌తో ప్రేమ అంటుంది. భోజనాలతో అక్కాతమ్ముడు ఆట మొదలుపెడతారు. రామరాజు, ధీరజ్, సాగర్, చందును సేనాపతి సూటిపోటి మాటలతో అవమానిస్తాడు.

Published on: Jul 27, 2026, 08:49:10 IST
Advertisement

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమ ఒకరికొకరు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. ప్రేమ ఇచ్చిన షర్ట్ తీసుకున్న ధీరజ్ తన ఫేవరెట్ కలర్ అని మురిసిపోతాడు. మన రెండు కుటుంబాలు కలిసిపోయాయి కాబట్టి అందరి సమక్షంలో మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం. అందరితో అక్షింతలు వేయించుకుందామని ప్రేమ అంటుంది.

నిన్ను టెస్ట్ చేశాను

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 27వ ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూలై 27వ ఎపిసోడ్

లోపల మురిసిపోయిన ధీరజ్ పైకి మాత్రం సెటైర్లు వేస్తాడు. చీర కట్టుకోవాలని ధీరజ్‌ను పంపిస్తుంది ప్రేమ. నీకు చీర కట్టుకోవడం వచ్చినప్పుడు నన్ను ఉదయం ఎందుకు కట్టమన్నావ్ అని అడుగుతాడు ధీరజ్. దాంతో దొరికిపోయానే అని ప్రేమ అనుకుంటుంది. నీకు వచ్చా రాదా అని టెస్ట్ చేశానని ధీరజ్‌ను పంపిస్తుంది ప్రేమ.

తన పుట్టింటివాళ్లకు ఆకలేస్తుంటుంది అని హడావిడి చేస్తుంది వేదవతి. ఇంట్లో రెండు కుటుంబాలు దిగిన ఫొటోలు వాట్సాప్ స్టేటస్ పెట్టమని కూతురు అమూల్యకు చెబుతుంది వేదవతి. మన రెండు కుటుంబాలు కలిసినట్లు ఊరంతా తెలియాలిగా అని వేదవతి అంటే.. అలా అయితే ఊరందరి నెంబర్లు మీ ఫోన్‌లో ఉండాలిగా అని నర్మద అంటుంది. దాంతో వేదవతి ఫీల్ అవుతుంది. ఊరంతా ఫొటోలు ఫ్లెక్లీలు వేయిద్దామని నర్మద అంటూ వేదవతి భుజంపై చేయి వేస్తుంది.

భుజం మీద చేయి వేసినందుకు వారిస్తుంది వేదవతి. తర్వాత చేసిన వంటలన్నీ పుట్టింటి వాళ్లకోసం తీసుకెళ్తుంది వేదవతి. ఇంకాసేపట్లో ఈ ఇంట్లో భయంకరమైన బీభత్సం జరుగుతుందని తెలియక అత్త సంతోషిస్తుందని శ్రీవల్లి సుకన్యతో అంటుంది. భోజనం చేయమని అందరికి ఇస్తార్లు వేస్తుంది వేదవతి. ఏంటీ కలిసిపోయారా అని, వచ్చిన విషయం మర్చిపోయారా ఏంటీ అని భద్రావతితో అంటుంది శ్రీవల్లి.

భద్రావతి ఐడియా

కచ్చితంగా ఈ చెల్లి కోసమే వచ్చారని వేదవతి అంటుంది. దాంతో ప్రేమ అలుగుతుంది. ప్రేమను తన రూమ్ చూపించమని అడుగుతుంది భద్రావతి. సేనాపతికి సైగ చేస్తూ భద్రావతి వెళ్తుంది. కామాక్షి భర్త భాస్కర్‌ను ఏం చేస్తుంటావని సేనాపతి అడిగితే.. సివిల్ కాంట్రాక్టర్ అని చెబుతాడు. కూతురుకేమో గొప్ప సంబంధం చేశాడు. కానీ, కొడుకులనే ఎందుకు పనికిరాని కూలోళ్లను చేశాడు అని సేనాపతి రామరాజును అవమానిస్తాడు.

మర్యాదగా మాట్లాడండి అని చందు అంటే.. ఆగమని రామరాజు అంటాడు. ఎవరికి నచ్చిన పనుల్లో సంతోషంగా ఉన్నారని రామరాజు అంటాడు. ఒకడు రైస్ మిల్లులో కూలోడు, మరొకడు డ్రైవర్, ఇంకొకడు పెళ్లాం నగలు తాకట్టు పెట్టి దొంగదారిలో ఉద్యోగం సంపాదించాడని సేనాపతి వెటకారంగా అంటాడు. మాటలు లిమిట్స్ దాటితే ఆరోగ్యానికి హానికరం, వచ్చి తిన్నామా వెళ్లామా అన్నట్లు ఉండాలని ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు.

డ్రైవర్ భార్యగా మిగిలిపోయింది

కారు కొనుక్కోడానికి గతి లేనోడివి పౌరుషానికి మాత్రం తక్కువ లేదు అని మరింత తీసేస్తాడు సేనాపతి. తల్లి శారద వారిస్తుంది. నేను మాట్లాడింది నిజమేగా. నా కాలి గోటికకి కూడా పనికిరాని వీన్ని చేసుకుని డ్రైవర్ భార్యగా మిగిలిపోయిందని సేనాపతి మరింత ఆజ్యం పోస్తాడు. ఎందుకు అన్నయ్య మనసు బాధపడే మాటలు మాట్లాడుతున్నావ్, నా కొడుకు ప్రేమను కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నాడు అని వేదవతి కన్నీళ్లతో అంటుంది.

మరోవైపు ధీరజ్ చాలా ప్రేమగా చూసుకుంటున్నాడని, యువరాణిలా ఉన్నానని భద్రావతితో అంటుంది ప్రేమ. ధీరజ్ మాయలో పూర్తిగా మునిగిపోయిందని భద్రావతి అనుకుంటుంది. సేనాపతి అలాగే మాటలు జారుతుంటాడు. విశ్వ వద్దని చెప్పిన వినడు. నా ప్రేమ పెళ్లి విషయంలో తప్పటడుగు వేయదు. నువ్వేరా మాయ చేసి పెళ్లి చేసుకున్నావ్ అని సేనాపతి నిందిస్తాడు.

మా అమ్మనాన్న కోసం ఆగుతున్నా. ఇంకా మాటలు దాటితే ఊరుకోను, తినేసి మర్యాదగా వెళ్లు అని ధీరజ్ మరోసారి వార్నింగ్ ఇస్తాడు. నా కూతురుని నువ్వే ఏదో చేశావ్. లేకుంటే దిక్కుమొక్కు లేని ఓ అనాథ కొడుకుని నా కూతురు పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని సేనాపతి అంటాడు. అన్నయ్య ఇక ఆపుతావా అని వేదవతి అంటుంది.

వేదవతి నిజం చెబుతుందా?

మన ఆస్తికోసం నిన్ను ఎలా వీడు ట్రాప్ చేశాడో వాడి కొడుకు కూడా నా కూతురుని ట్రాప్ చేశాడని సేనాపతి అంటాడు. అన్నయ్య నిజానిజాలు తెలియకుండా మాట్లాడకు అని వేదవతి అరుస్తుంది. అలా అక్కాతమ్ముడు ఆట మొదలుపెడతారు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe