...
...
Next Story

Illu Illalu Pillalu August 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-చందును మాయ చేసి డబ్బు కొట్టేసిన భాగ్యం-అత్తతో విశ్వ మంతనాలు

Illu Illalu Pillalu August 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 21 ఎపిసోడ్ లో ధీరజ్ ప్రేమను ప్రేమకు అర్థమయ్యేలా చెప్తారు నర్మద, వేదవతి. రైస్ మిల్ లో చందును మాయ చేసి భాగ్యం అండ్ కో డబ్బు కొట్టేస్తుంది. ఇక విశ్వ ఏమో వేదవతి అత్తతో మంచిగా మాట్లాడతాడు. పూర్తి ఎపిసోడ్ పై ఓ లుక్కేయండి.

Published on: Aug 21, 2026, 08:17:18 IST
Advertisement

Illu Illalu Pillalu August 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 21 ఎపిసోడ్ లో.. ప్రేమ కోసం ధీరజ్ పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలను అర్థమయ్యేలా నర్మద చెప్తుంది. ధీరజ్ ప్రతి క్షణం నీ కోసమే బతుకుతున్నాడు. నీ కోసమే తపన పడుతున్నాడు. అలాంటి భర్త ఒక్క మాట అంటే పడవా? అని ప్రేమను నర్మద అడుగుతుంది.

ప్రేమకు అర్థమయ్యేలా

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

మీ నాన్న నన్ను ఒక మాట అన్నాడని ధీరజ్ అలా మాట్లాడాడు. చేసింది తప్పని కూడా తెలుసుకున్నాడు. అందుకే నీ ముందు తలవంచి అన్నిసార్లు క్షమాపణ చెప్పాడు. వాడి ప్రేమను, మంచితనాన్ని అర్థం చేసుకోకపోతే వాడికంటే పెద్ద తప్పు చేసిన దానివి అవుతావని ప్రేమకు వేదవతి కూడా చెప్తుంది. నీ మీద ప్రేమ అసహ్యంగా మారేదాకా తెచ్చుకోకు అని నర్మద అంటుంది.

భాగ్యం ప్లాన్

మరోవైపు రైస్ మిల్ లో డబ్బులు కొట్టేసేందుకు భాగ్యం అండ్ కో పెద్ద ప్లానే వేస్తారు. భాగ్యం, సుక్కు క్యారేజీ తీసుకొని వస్తారు. ఎందుకు వచ్చారని చందు అడుగుతాడు. క్యారేజీ తీసుకొని వచ్చాం. ఇంటి దగ్గర సరిగ్గా తినడం లేదని భాగ్యం అంటుంది. ఇంత పెద్ద క్యారేజీ ఎందుకని చందు అడిగితే.. డబ్బులు పట్టాలి కదా అని ఇడ్లీ బాబాయ్ నోరు జారతాడు.

డబ్బు మాయం

భాగ్యం ఏదో చెప్పి కవర్ చేస్తుంది. అల్లుడి కోసం కూడా భోజనం తెచ్చానంటుంది. అప్పుడే బైక్ మీద డబ్బు ఉన్న బ్యాగుతో తిరుపతి వస్తాడు. సుక్కును చూసి సంబరపడిపోతాడు. వాట్ ఏ సడెన్ సర్ ప్రైజ్ సుక్కు. ఇది కలా నిజమా? అని తిరుపతి అడుగుతాడు. నీ కోసం నాటుకోడి పులుసు తెచ్చానని సుక్కు వయ్యారాలు పోతుంది.

డబ్బుతో భాగ్యం అండ్ కో వెళ్లిపోతారు. తిరుపతి, సుక్కు మధ్య ఏదో ఉందని చందు డౌట్ పడతాడు. ఆ విషయాన్ని ఇడ్లీ బాబాయ్ కన్ఫామ్ చేస్తాడు. వాళ్లతో జాగ్రత్తగా ఉండమని మామకు చెప్తాడు చందు.

ఆలోచనలో ప్రేమ

మరోవైపు క్లాసులో కూర్చుని వేదవతి, నర్మద మాటలను ప్రేమ గుర్తు చేసుకొని ఫీల్ అవుతుంది. అదే సమయంలో భద్రావతి చెప్పిన మాటలనూ తలుచుకుంటుంది. అవమానించేవాడితో ఎలా కలిసి ఉండగలవని భద్రావతి చెప్పిన మాయ మాటలను గుర్తు చేసుకుంటుంది. ప్రేమ వద్దంటూ ధీరజ్ చెప్పడాన్ని గుర్తు చేసుకొని నో అని అరుస్తుంది ప్రేమ. క్లాస్ లో అందరూ ప్రేమ గురించి మాట్లాడుకుంటారు.

వేదవతి బాధ

ఇటు కూరగాయల బ్యాగులు మోయలేక వేదవతి అమ్మో అయ్యో అనుకుంటూ నడుస్తుంది. నా గవర్నమెంట్ కోడలకి నేనంటే గౌరవం లేకుండా పోయింది. మార్కెట్ దగ్గర దించి ఆఫీస్ కు వెళ్లిపోతుందా? పైగా నడిస్తే మంచిదని డాక్టర్ లా చెప్తుందా? అని వేదవతి అనుకుంటుంది.

విశ్వ సాయం

అప్పుడే బైక్ మీద వచ్చిన విశ్వ.. వేదవతిని చూసి ఆగుతాడు. నేను పాత విశ్వను కాదు. పూర్తిగా మారిపోయా. రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిదే సర్దిచెప్పడానికి ప్రయత్నించానే కానీ గొడవ పడ్డానా? నన్ను నమ్ము అత్తా అని విశ్వ చెప్తాడు. నిజమే అనిపిస్తోంది కానీ అంత త్వరగా నమ్మలేమని వేదవతి అంటాడు. ప్లీజ్ అత్తా డ్రాప్ చేస్తా. లేదంటే బ్యాగులైనా ఇవ్వండని లాక్కుంటాడు విశ్వ.

కాఫీ కోసం

ఆ బ్యాగులు తీసుకొని రామరాజు ఇంట్లోకి వెళ్తాడు. నువ్వు ఎప్పుడు డెలివరీ బాయ్ అయ్యావని అమూల్య అడుగుతుంది. నేను చెప్తున్నా వినిపించుకోకుండా లాక్కొని వచ్చాడని వేదవతి చెప్తుంది. రేయ్.. బండోడా ఇక వెళ్లు అని వేదవతి అంటుంది. కనీసం మంచి నీళ్లు ఇవ్వరా అని విశ్వ అడుగుతాడు. నీ చేతి కాఫీ అమృతంలా ఉంటుందని ప్రేమ చెప్పిందని విశ్వ అనగానే వేదవతి కరిగిపోతుంది.

ఇదంతా ఏంటీ అని అమూల్య అడుగుతుంది. మన రెండు కుటుంబాలను కలపడం కోసమని విశ్వ చెప్తాడు. వేదవతి చేసిన కాఫీని తాగుతూ పొగిడేస్తాడు. ప్రేమ చేతి మీద ఎవరు పేరు రాశారని విశ్వ, వేదవతి మాట్లాడుకుంటారు. ఆ విషయం నేను కనుక్కుంటానని విశ్వ అంటాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe