Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 16 ఎపిసోడ్ లో వేదవతి తెగ టెన్షన్ పడుతుంటుంది. మోపిదేవికి వెళ్లిన ధీరజ్, ప్రేమ మర్డర్ చేశారని ఎస్ఐ అంటాడు. అయితే దీని వెనుకాల ఉన్నది భాగ్యం, వల్లి అనే ట్విస్ట్ థ్రిల్ కలిగిస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
వేదవతి టెన్షన్

ఎస్ఐ కాల్ చేయడంతో ధీరజ్, ప్రేమ కలిసి మోపిదేవి పోలీస్ స్టేషన్ కు బయల్దేరుతారు. మరోవైపు నర్మద, వేదవతి కంగారు పడతారు. కళ్యాణ్ తో ప్రేమ వెళ్లిన విషయం, ప్రేమను ఆ కళ్యాణ్ అమ్మబోయిన విషయం, పోలీసులు అరెస్ట్ చేయబోయిన విషయం అన్నీ బయటపడతాయేమోనని వేదవతి తెగ టెన్షన్ పడుతుంది.
వల్లి రివేంజ్
ప్రేమ, ధీరజ్ లది ప్రేమ వివాహం కాదు, నేను బలవంతంగా చేయించిన పెళ్లి అని తెలుస్తుందేమోనని వేదవతి ఇంకా కంగారు పడుతుంది. ఏదైతే అయితే చూసుకోవడానికి ధీరజ్ ఉన్నాడు కదా అని నర్మద ధైర్యం చెప్తుంది. ఇదంతా చాటుగా చూస్తున్న శ్రీవల్లి ఏమో.. వీళ్లను ఎందుకు ప్రశాంతంగా ఉండనిస్తానని అనుకుంటుంది. వెంటనే తన వాళ్లకు కాల్ చేసి ప్రేమ, నర్మద వెళ్తున్నారు. మీరు రంగంలోకి దిగండని చెప్తుంది.
శారదాంబ పుట్టిన రోజు
మరోవైపు అమ్మ 71వ పుట్టిన రోజును గ్రాండ్ గా చేద్దామని భద్రావతి, సేనాపతి అనుకుంటారు. అప్పుడే కాఫీ ఇస్తున్న రేవతిపై శారదాంబ ఫైర్ అవుతుంది. కాఫీ తాగకపోతే ఏం చచ్చిపోనులే. దేవుడు నన్ను ఎందుకు తీసుకుపోవడం లేదా అని శారదాంబ అంటుంది. అమ్మ నీకు ఎందుకంత బాధ వచ్చిందని సేనాపతి, భద్రావతి అడుగుతారు.
చిన్న కూతురు కోసం
నా పుట్టిన రోజును గ్రాండ్ గా చేయడం కాదు. నా చిన్న కూతురు కూడా ఇందులో భాగమైతే అదే నాకు అసలైన సంతోషం. ఇంకా ఎన్నాళ్లు బతుకుతానో తెలియదు. ఈ రెండు కుటుంబాలు కలిస్తే చూడాలని ఉంది. కానీ అది జరగదని అర్థమవుతోంది. కనీసం ఈ రెండు కుటుంబాలు కలిసి నా పుట్టిన రోజును చేయండి. ఓ గ్రూప్ ఫొటో అయినా తీసుకుందామని శారదాంబ ఎమోషనల్ అవుతుంది.
{{/usCountry}}నా పుట్టిన రోజును గ్రాండ్ గా చేయడం కాదు. నా చిన్న కూతురు కూడా ఇందులో భాగమైతే అదే నాకు అసలైన సంతోషం. ఇంకా ఎన్నాళ్లు బతుకుతానో తెలియదు. ఈ రెండు కుటుంబాలు కలిస్తే చూడాలని ఉంది. కానీ అది జరగదని అర్థమవుతోంది. కనీసం ఈ రెండు కుటుంబాలు కలిసి నా పుట్టిన రోజును చేయండి. ఓ గ్రూప్ ఫొటో అయినా తీసుకుందామని శారదాంబ ఎమోషనల్ అవుతుంది.
{{/usCountry}}కానీ భద్రావతి మాత్రం కరగదు. అవసరమైతే నీ పుట్టిన రోజు చేయడమైనా మానేస్తాం. అంతే కానీ దాన్ని (వేదవతి) మాత్రం పిలవం. అది ఎప్పుడో చచ్చిపోయిందని భద్రావతి కోపంతో ఊగిపోతుంది.
డమ్మీ ఎస్ఐ
ఇక కార్లో మోపిదేవికి ధీరజ్, ప్రేమ వెళ్తుంటారు. ప్రేమను టెన్షన్ పడొద్దని ధీరజ్ చెప్తాడు. మోపిదేవి అనేది నా జీవితంలో చెడు గతం. ఇప్పుడు మళ్లీ ఎస్ఐ ఫోన్ చేశాడని ప్రేమ ఫీల్ అవుతుంది. ఆ కారు వెనుకాలే స్కూటీపై ఇడ్లీ బాబాయ్, భాగ్యం వెళ్తారు. అక్కడికి వెళ్లిన భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఏమో ఆల్రెడీ మన డమ్మీ ఎస్ఐ వెయిటింగ్ అని అనుకుంటారు. అంటే ఇదంతా వీళ్లు చేస్తున్న కుట్ర అని అర్థమవుతుంది.
మర్డర్ చేశారని
లాడ్జీ లోపలికి వెళ్లిన ధీరజ్, ప్రేమ అక్కడ రిసెప్షన్ లో ఎస్ఐ గురించి అడుగుతారు. సార్ ఇక్కడికి రాలేదని చెప్పిన అక్కడున్న అమ్మాయి.. ధీరజ్, ప్రేమ పెళ్లి గురించి చెప్తుంది. హోటల్ బయట ఉన్న ఎస్ఐని ప్రేమ, ధీరజ్ వెళ్లి కలుస్తారు. మర్డర్ కేసు గురించి మాట్లాడాలి. మర్డర్ చేసి ఇద్దరు పారిపోయారు కదా అని ఎస్ఐ అనగానే ప్రేమ, ధీరజ్ మైండ్ బ్లాక్ అవుతుంది.
మొత్తం డ్రామానే
ఆ రోజు ఇక్కడ మర్డర్ జరిగింది. అది చేసి మీరు పారిపోయారని ఎస్ఐ అంటాడు. ఆ రోజు మా వదిన, అమ్మ కూడా ఉన్నారు కావాలంటే మాట్లాడండి అని ధీరజ్ చెప్తాడు. వెంటనే ఎస్ఐగా నాటకం ఆడుతున్న వ్యక్తి తన టోన్ మారుస్తాడు. పొరపాటున వేరే రూమ్ లో స్టే చేసిన వాళ్లకు కాల్ చేయబోయి మీకు కాల్ చేశాం. సారీ ఫర్ ది ట్రబుల్ అని చెప్తాడు. దీంతో ప్రేమ, ధీరజ్ కు కొండంత భారం దిగినట్లు అనిపిస్తుంది.
ప్రేమ, ధీరజ్ వెళ్లిపోతారు. డ్రామా ఆడిన ఆ ఎస్ఐకి భాగ్యం రూ.2 లక్షలు ఇస్తుంది. ఆ మేనేజర్ ను పట్టుకుని సాక్ష్యాలు సంపాదిస్తే ఆ ఇంట్లో మన అమ్మడు కుంపటి పెట్టేస్తుందని భర్తతో భాగ్యం చెప్తుంది.
వల్లిపై చందు కోపం
ఇక చందు కోసం శ్రీవల్లి క్యారేజీ తీసుకొని రైస్ మిల్ కు వెళ్తుంది. చందుపై తెగ ప్రేమను ఒలకబోస్తుంది. ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే చందు తీసుకుంటాడు. నేనంటే ప్రేమ అని నాకు తెలుసు బా అని వల్లి మురిసిపోతుంది. కానీ పనివాళ్లకు ఆ క్యారేజీ ఇచ్చి తినమంటాడు చందు. నీ డ్రామాలు ఏంటో నాకు తెలుసని చందు అనేసరికి వల్లి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది.
ఇప్పుడు ప్రశాంతంగా ఉందని ధీరజ్ తో ప్రేమ చెప్తుంది. మన జీవితాలు ముడిపడింది ఇక్కడే. మళ్లీ ఇక్కడికి వస్తామో లేదో. పాత జ్ణాపకాలను ఒకసారి చూద్దామని ఉందని ప్రేమను తీసుకొని ధీరజ్ హోటల్ లోపలికి వెళ్తారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.