...
...
Next Story

ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 18 ఎపిసోడ్: శ్రీవల్లి కన్నింగ్ ప్లాన్ రివర్స్-రామరాజు దిమ్మతిరిగే కౌంటర్-ఇడ్లీ బాబాయ్ దొంగతనం

Illu Illalu Pillalu June 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 18 ఎపిసోడ్ లో నర్మద స్కూటీపై రామరాజు రావడం చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. వేదవతి ఏమో మురిసిపోయి కోడలికి దిష్టి తీస్తుంది. వల్లి పుల్ల పెట్టాలని చూస్తే, రామరాజు దిమ్మతిరిగే కౌంటర్ వేస్తాడు.

Published on: Jun 18, 2026, 08:26:43 IST
Advertisement

Illu Illalu Pillalu June 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 18 ఎపిసోడ్ లో అత్తమామల మనసు గెలుచుకోవడానికి నర్మద పడిన తపన.. మరోవైపు ఇంట్లో గొడవలు పెట్టాలని చూసిన శ్రీవల్లికి రామరాజు ఇచ్చిన కౌంటర్లు హైలైట్‌గా నిలిచాయి. రైస్ మిల్ లో ఇడ్లీ బాబాయ్ రూ.20లు కొట్టేస్తాడు. ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం.

మామయ్య కోసం నర్మద తపన

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

నర్మద తన స్కూటీపై మామయ్య రామరాజును ఎక్కించుకోవడంతో టుడే ఎపిసోడ్ కథ ప్రారంభమవుతుంది. ఎండ తీవ్రంగా ఉండటాన్ని గమనించిన రామరాజు, కోడలికి ఇబ్బంది కలగకూడదని గొడుగు పడతాడు. అలా మామ, కోడలు ఇద్దరూ కలిసి స్కూటీపై ఇంటికి వస్తుండటం చూసి వేదవతి ఎంతో మురిసిపోతుంది.

"గవర్నమెంట్ కోడలా.. మీ మామయ్యను స్కూటీపై తీసుకొచ్చావా!" అంటూ తెగ సంబరపడిపోతూ నర్మదకు దిష్టి తీస్తుంది వేదవతి. అయితే, మామ-కోడళ్ల అనుబంధాన్ని, అత్తయ్య ప్రేమను చూసి శ్రీవల్లి లోపల కుళ్లుకుంటూ చస్తుంది.

పుల్లలు పెట్టాలని చూసిన శ్రీవల్లి

ఎలాగైనా రామరాజును రెచ్చగొట్టాలని శ్రీవల్లి ప్లాన్ చేస్తుంది. రామరాజు దగ్గరకు వెళ్లి.. "నేను కష్టపడి గీత గీస్తే మీరు నర్మద బండిపై వస్తారా?" అంటూ నోరు జారుతుంది. వెంటనే కంగారుపడి కవర్ చేసుకుంటూ.. గతాన్ని గుర్తుచేసి మళ్లీ మంట పెట్టాలని చూస్తుంది. "సాగర్ మరిది మీ చొక్కా పట్టుకుని నెట్టేసి వేరుపడ్డారు కదా.. ఇప్పుడు నర్మద బండిపై మీరు రావడం సాగర్‌కు తెలిస్తే సిగ్గులేదా అంటారు" అంటూ కన్నింగ్ బుద్ధితో మాట్లాడుతుంది.

రామరాజు దిమ్మతిరిగే కౌంటర్

ఇంతలో వేదవతి కూడా ఎంట్రీ ఇచ్చి.. "నువ్వు కడుపుతో ఉన్నావని వదిలేస్తున్నా. ఇంకోసారి ఇలా పుల్లలు పెడితే నువ్వు, మీ అమ్మానాన్న చేసిన దారుణాలు మీ ఆయనకు చెప్పేస్తా" అని శ్రీవల్లికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

డ్యాన్స్ ప్రోగ్రామ్ రచ్చ.. ఫైనాన్సియర్ షాక్!

మరోవైపు, గ్రామాల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పబ్లిసిటీ ఇవ్వాలంటూ డైరెక్టర్ రాజపుష్పం ఎంట్రీ ఇస్తాడు. అందమైన అమ్మాయిలు కావాలంటూ అతడు సైకోలా బిహేవ్ చేయడం కథలో కొత్త ట్విస్ట్‌ను తెచ్చింది.

ఇక ధీరజ్ కారును ఫైనాన్సియర్ లాక్కెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకుని ప్రేమ బాధపడుతుంది. దేవుడు మరో అవకాశం ఇస్తే బాగుండని అనుకుంటుంది. ఇదే విషయంలో శ్రీవల్లి సంబరపడుతుంది. ఈ విషయాన్ని ప్రేమ చెప్పడంతో.. సన్మాన సభ పెట్టాల్సిందేనంటూ నర్మద సెటైర్ వేయడంతో శ్రీవల్లి కంగుతింటుంది.

రూ.20 వేలు కొట్టేసిన ఇడ్లీ బాబాయ్!

ఇక రైస్ మిల్ ఓనర్ లాగా ఇడ్లీ బాబాయ్ వర్కర్ల ముందు తెగ బిల్డప్ ఇస్తుంటాడు. అక్కడికి చందు రావడంతో ఓవరాక్షన్ చేయడం మొదలుపెడతాడు. అప్పుడే తిరుపతి డబ్బుల బ్యాగ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి, చందుతో మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో ఎవరికీ తెలియకుండా ఇడ్లీ బాబాయ్ సైలెంట్‌గా వచ్చి ఆ బ్యాగులో నుంచి రెండు డబ్బుల కట్టలు (రూ. 20 వేలు) నొక్కేస్తాడు.

ఆ తర్వాత చందు డబ్బులు కౌంట్ చేయగా రూ.20 వేలు తక్కువ వస్తాయి. తిరుపతిని అడగ్గా తేడా వచ్చే ఛాన్స్ లేదంటాడు. ఇంతలో ఇడ్లీ బాబాయ్ కవర్ చేస్తూ.. తిరుపతే తీశాడేమోనని అనుమానం రేకెత్తించి, వర్కర్లను అడుగుదామంటాడు. కానీ వర్కర్లు నమ్మకస్తులని చందు చెప్తాడు. ప్రస్తుతానికి దొంగతనం చేసి దొరకలేదనే ఆనందంతో ఇడ్లీ బాబాయ్ గంతులేయడంతో ఈ రోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగిసింది.

మరి డబ్బులు పోవడానికి కారణం ఇడ్లీ బాబాయ్ అని చందు కనిపెడతాడా? శ్రీవల్లి, నర్మదల మధ్య సాగుతున్న ఈ కోడళ్ల యుద్ధంలో గెలిచేది ఎవరు? అనేది రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే!

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe