...
...
Next Story

Illu Illalu Pillalu May 13 Episode: సుక్కు ప్లాన్ ఫెయిల్.. పాలు తాగి భర్తలతో నర్మద, ప్రేమ రచ్చ.. వల్లిపై నర్మదకు డౌట్

Illu Illalu Pillalu May 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 13 ఎపిసోడ్ లో సుక్కు మందు కలిపిన పాలు తాగిన ప్రేమ, నర్మద తమ భర్తలతో సాంగ్ వేసుకుంటారు. కానీ వల్లి కోసం సుక్కు వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అదే సమయంలో నర్మదకు అనుమానం వస్తుంది.

Published on: May 13, 2026, 07:49:16 IST
Advertisement

Illu Illalu Pillalu May 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 13 ఎపిసోడ్ లో.. సుక్కు కోసం శ్రీవల్లి వెతుకుతుంది. మా ఆయన నాకు ముద్దు పెట్టబోయాడని వల్లి చెప్తుంది. ముందు మీ ఆయన దగ్గరకు వెళ్లు అని సుక్కు పంపించేస్తుంది. మరోవైపు మందు కలిపిన పాలు తాగిన ప్రేమ, నర్మద తమ భర్తలతో సాంగ్స్ వేసుకుంటారు.

నువ్వే విలన్

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

తిరుపతి ఏమో సుకన్య కోసం వెతుకుతాడు. చీకట్లో బెంచీ మీద కూర్చున్న ధీరజ్ ను సుకన్య అనుకుని దుప్పటి కప్పేస్తాడు తిరుపతి. ధీరజ్ విడిపించుకుంటాడు. నా ప్రేమ కథలో నువ్వే విలన్ అని తిరుపతి వెళ్లిపోతాడు.

ఇడ్లీ, భాగ్యం డ్యాన్స్

సీన్ ఇడ్లీ బాబాయ్ ఇంటికి మారుతుంది. ఇడ్లీ గటగటా మందు తాగుతాడు. సుక్కు అక్కడ ప్లాన్ చేసింది. మన అమ్మడి కడుపు అబద్ధం అనే విషయం బయటకే రాదని భాగ్యాన్ని పట్టుకుని ఇడ్లీ బాబాయ్ తెగ హ్యాపీగా చెప్పేస్తాడు. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ డ్యాన్స్ చేస్తారు.

హుషారుగా సుక్కు

ఉదయం సుకన్య తెగ హుషారుగా ఉంటుంది. వల్లి నోరు తీపి చేయాలని సుక్కు స్వీట్ రెడీ చేస్తుంది. కెమెరా ఆన్ చేసి వ్లాగ్ చేస్తుంటుంది సుక్కు. రాత్రి తాగిన పాల వల్ల తలనొప్పి భయంకరంగా ఉందని నర్మద బయటకు వస్తుంది. మరోవైపు పాల స్కీమ్, స్కామ్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? పాలల్లో మూలికల పొడి కలిపి మిసమిసలు, పదనిసలు చేశానన్న మాట అని సుక్కు అంటుంది. ఆ మాటలను నర్మద వింటుంది.

నర్మదకు డౌట్

మంచంపై శ్రీవల్లి దిగాలుగా కూర్చుంటుంది. గుడ్ మార్నింగ్ వల్లి అంటూ పాయసంతో సుక్కు హుషారుగా వస్తుంది. ఆనందంతో ఎగరాల్సిన సమయంలో తలపై చేయి పెట్టుకుని కూర్చుంటావా? మేనత్త కూతురివని సాయం చేశా. నాకు విగ్రహాలు ఏమొద్దని సుక్కు తెగ బిల్డప్ ఇస్తుంది.

ప్లాన్ ఫెయిల్

నేను నెల తప్పడానికి రాత్రి ఏం జరగలేదు. ఆయన ఫుల్ గా గురుకపెట్టి నిద్రపోయారని రాత్రి జరిగింది వల్లి చెప్తుంది. నా ఆరాటమే నా కొంపముంచింది. రాత్రి నీ దగ్గరకు రాకపోయినా బాగుండేదని వల్లి ఫీల్ అవుతుంది. చందు పడుకోవడం ఏంటి? పాలల్లో మందు డోసు ఎక్కువ కలిపానా ఏంటీ? అని సుక్కు అంటుంది. ఆ మాటలు విన్న నర్మద.. మందు ఏంటీ? అని అడుగుతుంది.

ఏం మందు కలిపావ్?

నువ్వు రాత్రి పాలల్లో ఏం మందు కలిపావ్? అని సుక్కును నర్మద అడుగుతుంది. సుక్కు తప్పించుకోవాలని చూస్తుంది. కానీ నర్మద వదలదు. మొగుడు, పెళ్లాలను ఒకటి చేద్దామని చిన్న మందు కలిపానని సుక్కు చెప్పేస్తుంది. వల్లి అక్క ప్రెగ్నెంట్ కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరిని ఒకటి చేయడం ఏంటి? అని నర్మద అడుగుతుంది.

వల్లితో చందు ప్రేమగా ఉండటం లేదని వల్లి బాధ పడుతుంది. అందుకే తనువులు కలిస్తే మనసులు కలుస్తాయని చిన్న ప్రయత్నం చేశానని సుక్కు మళ్లీ కవర్ చేస్తుంది. వల్లి కూడా అదే మాట చెప్తుంది. మీ బావ నా దగ్గరకు అవుతారని ఇలా చేసిందని వల్లి అబద్ధం చెప్తుంది.

ప్రేమతో సరసాలు

మరోవైపు ప్రేమతో సరసాలు ఆడతాడు ధీరజ్. రూమ్ లోకి రాగానే డోర్ వేసేస్తావు. నా దగ్గరకు వచ్చి బెడ్ మీదకు లాగుతావని ముద్దు పెట్టబోతాడు ధీరజ్. కానీ తోసేసి ప్రేమ వెళ్లాలని చూస్తుంది. రాత్రి నువ్వు ఇలాగే చేశావని ధీరజ్ చెప్తాడు. నిద్రపోయానని ప్రేమ చెప్తుంది. నిద్రపోలేదు, రాత్రంతా పరుగెత్తించి రచ్చ రచ్చ చేశావని ప్రేమ నడుం గిల్లుతాడు ధీరజ్. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe