Illu Illalu Pillalu November 11 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ఫుల్ గా తాగిన చందును ఇంటికి ఆటోలో తీసుకెళ్తుంది అంజలి. తనకు అంజలినే కావాలంటాడు చందు. తనకు తోడుగా ఉండాలని అంజలి భుజంపై పడుకుంటాడు చందు. తనతోనే ఉండిపోవాలని చందు రిక్వెస్ట్ చేస్తాడు.
నర్మదపై ప్రేమ సీరియస్

ఇటు వల్లిని ఇంటికి తీసుకొస్తానని మాట ఇవ్వడంపై నర్మదపై ప్రేమ సీరియస్ అవుతుంది. తప్పు చేస్తున్నావక్కా. మంచితనం ఉండొచ్చు కానీ మరీ మనం మునిగిపోయేంత ఉండొద్దని ప్రేమ అంటుంది. అప్పుడే వచ్చిన వేదవతి కూడా ప్రేమకే సపోర్ట్ చేస్తుంది. కానీ ధీరజ్ మాత్రం నర్మదకు సపోర్ట్ చేస్తాడు.
వల్లి అక్కను తీసుకొస్తా
నర్మద వదిన ఊరికే మాట ఇవ్వొద్దు. మీరు ఏమన్నా కూడా వల్లి వదినను నర్మద వదిన ఇంటికి తీసుకొచ్చి తీరుతుందని ధీరజ్ అంటాడు. మేం ఇద్దరం ఉండగా మమ్మల్ని దాటి వల్లి ఇంట్లోకి రాగలదా అని అత్తను కలుపుకొని ప్రేమ అంటుంది. మిమ్మల్ని చూసి ఎవరూ భయపడరని ధీరజ్ సెటైర్ వేస్తాడు. మీరు నాకు పెద్ద లెక్కేం కాదు. నేను వల్లి అక్కను ఇంటికి తీసుకొచ్చి తీరతానని నర్మద కూడా చెప్తుంది.
కట్టప్పలా కాపాలా
చందు బావ గురించి ఆలోచించే వల్లిని ఇంటికి తీసుకొస్తానంటున్నా. వల్లి అక్కకు చందు బావ అంటే పిచ్చి ప్రేమ. వాళ్లు అన్యోన్యంగా ఉంటే మనమే కదా సంతోషించేది. వల్లి మారిందనే విషయం చందు బావకు తెలిస్తే కచ్చితంగా ఇంటికి తీసుకొస్తారని నర్మద అంటుంది. వల్లి మళ్లీ వస్తే లేనిపోని సమస్యలు వస్తాయని భయంగా ఉందని వేదవతి, ప్రేమ అంటారు. ఈ మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టప్పలా కాపలా కాస్తున్నానని నర్మద కౌంటర్ ఇస్తుంది.
పేరు కోసం గొడవ
అప్పుడే వచ్చిన తిరుపతి, సుకన్య ఏమో నర్మద నమ్మకం గురించి బిల్డప్ ఇస్తాడు. ట్రావెల్ ఆఫీసుకు చిన్నోడు పేరు పెట్టాలి కదా అని బౌల్ లో తిరుపతి కొన్ని చిట్టీలు తెస్తాడు. చిట్టీలు అవసరం లేదు. తన పేరే పెడతాడని ప్రేమ అనగానే వేదవతి కోపంతో చూస్తుంది. చిన్నోడు అమ్మ పేరు పెట్టుకుంటాడని వేదవతి సంబరపడుతుంది. ఈ పేరు విషయంలో ప్రేమ, వేదవతి గొడవ పడతారు.
ప్రేమ చీటింగ్
{{/usCountry}}అప్పుడే వచ్చిన తిరుపతి, సుకన్య ఏమో నర్మద నమ్మకం గురించి బిల్డప్ ఇస్తాడు. ట్రావెల్ ఆఫీసుకు చిన్నోడు పేరు పెట్టాలి కదా అని బౌల్ లో తిరుపతి కొన్ని చిట్టీలు తెస్తాడు. చిట్టీలు అవసరం లేదు. తన పేరే పెడతాడని ప్రేమ అనగానే వేదవతి కోపంతో చూస్తుంది. చిన్నోడు అమ్మ పేరు పెట్టుకుంటాడని వేదవతి సంబరపడుతుంది. ఈ పేరు విషయంలో ప్రేమ, వేదవతి గొడవ పడతారు.
ప్రేమ చీటింగ్
{{/usCountry}}ఈ తింగరబుచ్చికి అంత సీన్ లేదమ్మా. అమ్మ మించిన దైవం లేదమ్మా. ఎప్పుడూ అమ్మ పార్టీనే అని వేదవతిని ధీరజ్ ప్రేమగా హగ్ చేసుకుంటాడు. ప్రేమకు చిర్రెత్తుకొస్తుంది. ట్రావెల్స్ ఆఫీసుకు తన పేరే పెట్టాలని ప్రేమ అంటుంది. చిట్టీలు తీద్దామని నర్మద అంటే అందుకు ప్రేమ, వేదవతి ఒప్పుకొంటారు. కానీ అన్ని చిట్టీల మీద తన పేరే ప్రేమ రాసి చీటింగ్ చేస్తుంది.
కనిపెట్టిన నర్మద
వేదవతి చిట్టి తీస్తుంది. అందులో ప్రేమ పేరు చూసి వేదవతి షాక్ అవుతుంది. తన పేరు వచ్చిందని ప్రేమ ఎగిరి గంతులేస్తుంది. చూశావా అత్తా? మనతో గెలవడమంటే అంత ఈజీ కాదని ప్రేమ పొంగిపోతుంది. అప్పుడే నర్మదకు డౌట్ వస్తుంది. మిగతా చిట్టీలు చూస్తే అన్నింటిపై ప్రేమ అనే పేరు ఉంటుంది. వేదవతి, నర్మద కలిసి ప్రేమ చెవులు పిండుతారు. తన పేరే పెట్టాలని ప్రేమ తప్పించుకొని లోపలికి వెళ్తుంది. పెద్దోడు ఇంకా రాలేదని వేదవతి కంగారు పడుతుంది. తాను చూస్తానని ధీరజ్ ధైర్యం చెప్తాడు.
సీక్రెట్ గా విశ్వ, అమూల్య
ఇటు మళ్లీ విశ్వ, అమూల్య సీక్రెట్ గా కలుసుకుంటారు. మా పెద్దన్నయ్య తరపున నీకు సారీ చెస్తున్నారా అని అమూల్య చెప్తుంది. నా బతుకు గుడిలో గంటలా మారింది. మీ అన్నయ్యకు విడాకులు ఇప్పించి, రెండో పెళ్లి చేస్తారా? మీకు కొంచెమైనా పాపం అనిపించట్లేదా? అని విశ్వ అంటాడు. వెంటనే అమూల్య లాగిపెట్టి కొడుతుంది. మా అన్నయ్యకు రెండో పెళ్లి చేయాలనుకోవడం లేదని చెప్తుంది.
ధీరజ్ కు షాక్
చిన్న బావ జీవితమంతా ఇక ఆనందమే అని విశ్వ గంతులేస్తాడు. అప్పుడే ధీరజ్ బయటకు వస్తాడు. చిన్నయ్యను చూసి అమూల్య టెన్షన్ పడుతుంది. విశ్వను నెట్టేసి వెళ్లిపోతుంది. పెద్దోడి కోసం ధీరజ్ టెన్షన్ పడుతుంటే అప్పుడే ఆటో వస్తుంది. అందులో నుంచి చందును తీసుకొని అంజలి దిగడంతో ధీరజ్ కు మైండ్ బ్లాక్ అవుతుంది.
చందుకు ఏమైంది?
అన్నయ్యను నువ్వు తీసుకొచ్చావేంటీ అంజలి అని ధీరజ్ అడుగుతాడు. మీ అన్నయ్యకు ఎంత దూరంగా ఉందామనుకున్నా సరే టైమ్ మళ్లీ కలిపింది. మా ఇంటి ముందు మీ అన్నయ్య తాగి పడిపోయాడు. అసలు చందుకు ఏమైందని అంజలి అడుగుతుంది. ఏదో చిన్న గొడవ అని ధీరజ్ చెప్తాడు. చిన్నది కాదు, చాలా పెద్ద గొడవ. ఎంత తాగినా కానీ మర్చిపోలేనంత బాధ ఉందని చందు అంటాడు.
నా కలలోకి అంజలి వచ్చింది. మరి నువ్వెందుకు వచ్చావ్ రా. అంజలి ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి అని చందు భ్రమలోనే మాట్లాడతాడు. చందు భ్రమ అనుకుంటున్నాడు. అలాగే అనుకోని, నిజం చెప్పకు అని ధీరజ్ కు చెప్పి అంజలి వెళ్లిపోతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.