Illu Illalu Pillalu October 14 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రామరాజు ఇంటికి వచ్చిన పోలీసులు షాకిస్తారు. రామరాజు, వేదవతి, చందుపై వల్లి గృహ హింస కేసు పెట్టిందని చెప్తారు. మీ ముగ్గురిని అరెస్టు చేస్తున్నాం, స్టేషన్ కు నడవండని ఎస్ఐ చెప్తుంది.
వల్లి కేసు

ఆ వగలాడి మాపై కేసు పెట్టిందా? ఎన్నో మోసాలు, కుట్రలు చేసిందని వేదవతి చెప్తుంది. నర్మద, ధీరజ్ మట్లాడేందుకు ప్రయత్నించినా కూడా స్టేషన్ కు వచ్చి మాట్లాడుకోమని ఎస్ఐ సీరియస్ అవుతుంది. భర్త, అత్తామామ తనను కొట్టి, బయటకు గెంటేశారని శ్రీవల్లి కంప్లైంట్ ఇచ్చింది. అందుకే మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్తారు.
అవమానించిన భద్రావతి
రామరాజు, వేదవతి, చందును పోలీసులు తీసుకెళ్తారు. ఏంటి సేనా ఆ కూలోడి కుటుంబాన్ని పోలీసులు తీసుకెళ్తున్నట్లు ఉన్నారని భద్రావతి అవమానించేలా మాట్లాడుతుంది. పోలీస్ స్టేషన్ వెళ్లడం అంటే అవమానంగా ఫీల్ అవుతారు, చచ్చిపోతారు. కానీ వీళ్లేంటీ ఏదో సినిమాకు వెళ్తున్నట్లు వెళ్తున్నారని భద్రావతి దెబ్బిపొడుస్తుంది.
ధీరజ్ కు ఛాలెంజ్
వాడికి సిగ్గూ శరం ఉంటే కదా అక్క ఫీల్ అవడానికి అని సేనాపతి అంటాడు. ధీరజ్ పట్టరాని కోపంతో వెళ్లి సేనాపతి కాలర్ పట్టుకుంటాడు. ధీరజ్ ను విడిపిస్తారు. ఏయ్ పిల్లబచ్చా ముందు మీ అమ్మానాన్న, అన్నయ్యను విడిపించుకో అని భద్రావతి ధీరజ్ కు ఛాలెంజ్ చేస్తుంది. వేదవతి, రామరాజు, చందును పోలీసులు జీపులో తీసుకెళ్తారు.
పెళ్లి రోజు గిఫ్ట్
నర్మద మేడం నాకు వార్నింగ్ ఇవ్వడానికి ఒంటి కాలు మీద వస్తావ్ కదా. నీ పెళ్లి రోజే మీ అత్తామామలు స్టేషన్ కు వెళ్తున్నారు. ఎలా ఉంది మీ పెళ్లి రోజు గిఫ్ట్ అని భద్రావతి పొగరుగా మాట్లాడుతుంది. ఎందుకు అత్త ఇలా చేస్తున్నావని ప్రేమ అడుగుతుంది. తనకేం తెలియదని భద్రావతి అంటుంది. మా అత్తమామయ్య బయటకు వచ్చాక ఆ వల్లి వెనుక ఎవరున్నారో తేలుస్తానని నర్మద వార్నింగ్ ఇస్తుంది.
ఆధారాలు ఉన్నాయా?
{{/usCountry}}నర్మద మేడం నాకు వార్నింగ్ ఇవ్వడానికి ఒంటి కాలు మీద వస్తావ్ కదా. నీ పెళ్లి రోజే మీ అత్తామామలు స్టేషన్ కు వెళ్తున్నారు. ఎలా ఉంది మీ పెళ్లి రోజు గిఫ్ట్ అని భద్రావతి పొగరుగా మాట్లాడుతుంది. ఎందుకు అత్త ఇలా చేస్తున్నావని ప్రేమ అడుగుతుంది. తనకేం తెలియదని భద్రావతి అంటుంది. మా అత్తమామయ్య బయటకు వచ్చాక ఆ వల్లి వెనుక ఎవరున్నారో తేలుస్తానని నర్మద వార్నింగ్ ఇస్తుంది.
ఆధారాలు ఉన్నాయా?
{{/usCountry}}పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగానే రామరాజు, వేదవతి, చందును సెల్ లో వేయమని ఎస్ఐ చెప్తుంది. వీళ్ల వెనుకాలే సాగర్, ధీరజ్, నర్మద, చందు వెళ్తారు. అసలు కేసు పెట్టిన వల్లి ఎలాంటిది అని ఎంక్వైరీ చేయరా? ఏం ఆధారాలు ఉన్నాయని అరెస్ట్ చేశారని నర్మద అడుగుతుంది. ఏంటీ రూల్స్ మాట్లాడుతున్నావ్? మా డ్యూటీ గురించి మాకే నేర్పిస్తున్నావా? అని ఎస్ఐ ఫైర్ అవుతుంది.
వల్లి చేతులపై దెబ్బలు
అప్పుడే లోపలి నుంచి వల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయి వస్తారు. వల్లి చేతులపై దెబ్బలు ఉంటాయి. అరెస్టు చేయడానికి ఏం సాక్ష్యాలు ఉన్నాయని అడిగారు కదా. ఈ దెబ్బలే సాక్ష్యాలు. భర్త, అత్తామామలు టార్చర్ పెట్టారని చెప్పడానికి, ఈ కేసులో అరెస్టు చేయడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని ఎస్ఐ అడుగుతుంది.
మేం నిన్ను టార్చర్ పెట్టామా? చంపేస్తాను నిన్ను అని వల్లి పైపైకి చందు వెళ్తాడు. ఎస్ఐ అమ్మ మీ ముందే చంపేస్తానంటాడు. ఇక ఇంట్లో ఎంత టార్చర్ పెట్టి ఉంటాడని భాగ్యం తెగ డ్రామా ఆడుతుంది. ఇవన్నీ అబద్ధాలు. ఆ దెబ్బలు కూడా తనే కొట్టుకుందని ప్రేమ అంటుంది.
బల్లక్కాయ్ అబద్ధాలు
నాకేమైనా పిచ్చా? నన్ను కొట్టి బయటకు గెంటేశారని బల్లక్కాయ్ అబద్ధం చెప్తుంది. తప్పులు నువ్వు చేసి మాపై నిందలు వేస్తావా అని వేదవతి ఫైర్ అవుతుంది. ఏ రోజైనా నిన్ను ఒక్క మాట అన్నామా? మీ అమ్మానాన్న కంటే ప్రేమగా చూసుకున్నాం. మీ అమ్మానాన్న వచ్చి వ్యాపారంలో నష్టపోయామంటే అప్పటికప్పుడు రూ.10 లక్షలు ఇచ్చామని రామరాజు అంటాడు.
చందు రిక్వెస్ట్
పెళ్లి అయిన మరుసటి రోజు నుంచే వీళ్లు నా కూతురితో గొడ్డు చాకిరీ చేయించారని భాగ్యం ఏడుస్తుంది. భాగ్యం నీ నోట్లో నుంచి మరొక్క అబద్ధం బయటకు వస్తే నాలుక చీరేస్తానని వేదవతి వార్నింగ్ ఇస్తుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోమ్మని ధీరజ్ తో సహా అందరు రిక్వెస్ట్ చేస్తున్నా ఎస్ఐ వినదు. ఈ మోసగత్తెను పెళ్లి చేసుకోని పాపం చేసింది నేను. నాకే శిక్షలు వేయండి. మా అమ్మానాన్నను వదిలేయండని చందు రిక్వెస్ట్ చేస్తాడు.
ఫీల్ అవుతున్న వేదవతి
వరకట్నం కోసం వల్లిని వేధించారని ఎస్ఐ అంటుంది. మేం ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. అలాంటిది ఎందుకు వేధిస్తామని రామరాజు అడుగుతాడు. చందు, రామరాజు, వేదవతిని సెల్ లో వేస్తారు. లాయర్ ను తీసుకురావడానికి ధీరజ్ వెళ్తాడు. ఆ వల్లి మనకు గుణపాఠం నేర్పించిందని వేదవతి ఫీల్ అవుతుంది. నా కారణంగానే మీరు అరెస్టు అయ్యారు. నన్ను క్షమించు నాన్న అని చందు ఎమోషనల్ అవుతాడు.
స్టేషన్ బెయిల్ రాదని
లాయర్ వచ్చి వల్లి ఇచ్చిన కంప్లైంట్ ను చూస్తాడు. మేడం వీళ్లంతా అమాయకులు. వల్లి మోసం తెలిసి బయటకు గెంటేశారు. అందుకే కేసు పెట్టింది. స్టేషన్ బెయిల్ ఇవ్వండని ఎస్ఐని లాయర్ అడుగుతాడు. వల్లి బాడీ మీద దెబ్బలు ఉన్నాయని ఎస్ఐ అంటుంది. అది వల్లినే కొట్టుకుందని ప్రేమ చెప్తుంది. అలా నిరూపించడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? అని ఎస్ఐ అడుగుతుంది.
ఇది డౌరీ హరాస్మెంట్ కేసు. స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదు. రేపు కోర్టులో చూసుకోండి. ఇలాంటి కేసుల్లో రెండు మూడు నెలల వరకు బెయిల్ రాదని ఎస్ఐ చెప్తుంది. వల్లి ఫ్యామిలీ మోసాలు చేశారని ప్రేమ, నర్మద చెప్తూనే ఉంటారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.