Illu Illalu Pillalu October 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. కేస్ వాపసు తీసుకున్నందుకు వల్లిని భాగ్యం గెంటేయాలని చూస్తుంది. ఈ క్రమంలోనే తల్లికి గుణపాఠం వచ్చేలా బల్లక్కాయ్ మాటలు అంటుంది. నువ్వు పుట్టినప్పటి నుంచి మాకు దరిద్రం తప్పా ఏం లేదని భాగ్యం అంటుంది.
చేయి ఎత్తిన ఇడ్లీ బాబాయి

వెంటనే కోపంతో ఇడ్లీ బాబాయి చేయి ఎత్తుతాడు. కొడతావా కొట్టు అని తన భర్త చేయిని పట్టుకొని భాగ్యం కొట్టుకుంటుంది. పేదరికం నుంచి బయటపడాలనే కదా అమ్మడి జీవితాన్ని పణంగా పెట్టామని ఇడ్లీ బాబాయి అంటాడు. ఇప్పుడు ఇది త్యాగమూర్తిలా మారిపోయింది కదా. వాళ్లను స్టేషన్ నుంచి ఇంటికి పంపించారు కదా. మరి దీన్ని ఇంటికి తీసుకెళ్లారా? అని భాగ్యం అడుగుతుంది.
వెళ్లిపోయిన బల్లక్కాయ్
నేను కనికరించను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని భాగ్యం కఠినంగా మాట్లాడుతుంది. నువ్వు పుట్టడమే దరిద్రమనే మాట తల్లి నోటి నుంచి విన్నా. నాకు ఈ జీవితమే అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోతానని బల్లక్కాయ్ లగేజీ తీసుకొని ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇడ్లీ బాబాయి ఆపాలని చూసినా వల్లి వినదు.
సుక్కు టెన్షన్
ఇటు రామరాజు ఇంట్లో సుక్కు డల్ గా కూర్చుంటుంది. ఏమైందని తిరుపతి అడుగుతాడు. మా భాగ్యం అత్త గురించి నీకు తెలీదు కాబట్టే కూల్ గా ఉన్నావ్. స్టేషన్ లో వల్లి కేస్ వాపసు తీసుకోవడం గురించి ఏం చేస్తుందోనని భయంగా ఉందని సుక్కు అంటుంది. అప్పుడే ఇడ్లీ బాబాయి కాల్ చేసి.. మీ రాక్షసి అత్త నానా మాటలని వల్లి మనసు విరిచేసింది. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని గెంటేసిందని ఏడుస్తాడు. ఈ విషయం ధీరజ్ హ్యాండిల్ చేయగలడని తిరుపతి అంటాడు.
ధీరజ్, ప్రేమ రొమాన్స్
పడక గదిలో రెడీ అయిన ప్రేమ.. ధీరజ్ ఎక్కడికి వెళ్లాడో అని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే దుప్పటి కప్పుకొని వచ్చిన ధీరజ్ ఆ దుప్పటినే ప్రేమపైనే వేసి ఎత్తుకొని తిప్పుతాడు. భయంలో కుక్కపిల్లలా నువ్వు చాలా క్యూట్ గా ఉంటావే అని ధీరజ్ అంటాడు. మరోసారి భయపెడతావా? అని ప్రేమ కోప్పడుతుంది. వెంటనే ప్రేమను దగ్గరకు లాక్కొని ధీరజ్ రొమాన్స్ మొదలు పెడతాడు.
డిస్టర్బ్ చేసిన నర్మద
{{/usCountry}}పడక గదిలో రెడీ అయిన ప్రేమ.. ధీరజ్ ఎక్కడికి వెళ్లాడో అని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే దుప్పటి కప్పుకొని వచ్చిన ధీరజ్ ఆ దుప్పటినే ప్రేమపైనే వేసి ఎత్తుకొని తిప్పుతాడు. భయంలో కుక్కపిల్లలా నువ్వు చాలా క్యూట్ గా ఉంటావే అని ధీరజ్ అంటాడు. మరోసారి భయపెడతావా? అని ప్రేమ కోప్పడుతుంది. వెంటనే ప్రేమను దగ్గరకు లాక్కొని ధీరజ్ రొమాన్స్ మొదలు పెడతాడు.
డిస్టర్బ్ చేసిన నర్మద
{{/usCountry}}ప్రేమకు ధీరజ్ ముద్దు పెట్టబోతుండగా ప్రేమ అని అరుస్తూ నర్మద వస్తుంది. దీంతో ధీరజ్, ప్రేమ ఉలిక్కిపడి దూరంగా వెళ్లిపోతారు. ఈ వాల్ కలర్ మార్చామంటే బ్రైట్ గా ఉంటుందని ప్రేమ కవర్ చేస్తుంది. ఏంటి అక్కా చెడగొట్టావ్? కరెక్ట్ ఇదే టైమ్ కు వస్తావ్ అని ప్రేమ చిరాకు పడుతుంది. నువ్వు అరిచావని వచ్చా, మీరు కల్చరల్ ప్రోగ్రామ్ లో ఉన్నారని నాకేం తెలుసని ప్రేమ నడుమును నర్మద గిల్లుతుంది.
వల్లి కోసం ధీరజ్
అప్పుడు తిరుపతి, సుక్కు కంగారుగా వస్తారు. పాపం వల్లిని వాళ్లమ్మ ఇంట్లో నుంచి గెంటేసిందంటా. ఎక్కడైనా చావు అని పంపించిందంటా అని సుక్కు భయపడుతూ చెప్తుంది. ఈ విషయం నీకెలా తెలుసు? అంటే ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు ఇక్కడికి మోస్తున్నావా? అని ప్రేమ గట్టిగా అడుగుతుంది. వల్లి కోసం మా మామయ్య ఫోన్ చేసి అడిగారని సుక్కు చెప్తుంది. ఇదేదో కొత్త నాటకమని ప్రేమ అంటుంది. నేను వెళ్లి చూస్తానని ధీరజ్ బయటకు వెళ్తాడు.
వల్లికి దెయ్యం పట్టిందా?
మరోవైపు సేనాపతితో భద్రావతి మాట్లాడుతుంది. దెబ్బ మీద దెబ్బ. ఆ రామరాజు కుటుంబాన్ని దెబ్బ కొడదామనుకుంటే చివరి క్షణంలో అంతా తారుమారు అవుతోంది. మనకు ఎదురు దెబ్బ తగులుతోంది. రామరాజు జైలులోకి వెళ్తాడనుకున్నా. కానీ వల్లి మొత్తం చెడగొట్టింది. దానికేమైనా దెయ్యం పట్టిందా? అని భద్రావతి అంటుంది. ఆ రామరాజు కుటుంబాన్ని ఎలారా దెబ్బ కొట్టేదని భద్రావతి అడుగుతుంది.
ఇటు లోపల ఏమో ఎంత శుభవార్త చెప్పావ్ రా మనవడా అంటూ విశ్వ బుగ్గలను శారదాంబ పిండేస్తుంది. నా కూతురు, అల్లుడు, పెద్ద మనవడు బయటకు వచ్చేశారా? ఏ కేసు లేకుండా ఇంటికి వచ్చారు కదా. దేవుడికి మొక్కు చెల్లించాలి. ఇప్పుడే అమ్మాయి, అల్లుడిని చూస్తానని శారదాంబ అంటుంది.
భద్రావతి కుట్ర
రేపు ఉదయాన్నే వెళ్లు గ్రానీ. వాళ్లు రెస్ట్ తీసుకోని. ఇంకో శుభవార్త కూడా ఉంది చెప్పనా? ధీరజ్, ప్రేమ కలిసి ట్రావెల్ బిజినెస్ పెడతారంటా అని శారదాంబకు విశ్వ చెప్తాడు. ఓ ట్రావెల్ కంపెనీ ఆక్షన్ లో ఉందని తెలిసిందని విశ్వ అంటాడు. ఈ మాటలను బయట నుంచి భద్రావతి, సేనాపతి వింటారు.
ఆ ధీరజ్ గాడు ట్రావెల్ ఏజెన్సీ పెడతాడా? వేలం పాట పాడతాడా? పాడనీ, వాడి పాట ఎంత తీయగా ఉంటుందో చూస్తా అని భద్రావతి మరో కుట్రకు తెరతీస్తుంది.
చందుకు వల్లి ఫోన్
ఇటు వల్లి రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ధీరజ్ ఏమో వల్లి కోసం వెతుకుతాడు. ఒక దగ్గర కూర్చుని వల్లి బాధపడుతూ ఏడుస్తుంది. బావకు ఫోన్ చేస్తానని చందుకు కాల్ చేస్తుంది. కానీ చందు కట్ చేస్తాడు. మళ్లీ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. నేనిప్పుడు రోడ్డు మీద ఉన్నా. కేసు వెనక్కి తీసుకున్నానని మా అమ్మ నన్ను గెట్టేసింది. నేనొక్కదాన్నే రోడ్డు మీద ఉన్నా బా. చాలా భయంగా ఉందని వల్లి ఏడుస్తుంది.
నన్ను బా అని పిలవకు. నువ్వు ఎవరు? నాకెందుకు ఫోన్ చేశావ్? అని చందు అడుగుతాడు. నువ్వు రాకపోతే చచ్చిపోతానని వల్లి అంటుంది. అయితే చచ్చిపో, నాకు పట్టిన పీడ పోతుంది. నువ్వెప్పుడో చచ్చిపోయావని చందు అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడే ఒక తాగుబోతు అక్కడికి వచ్చి వల్లిని ఓదార్చుతాను పక్కకు రమ్మంటాడు. వల్లి రాయితో వాడిని కొట్టబోతుంది.
అప్పుడే ధీరజ్ కార్లో వస్తాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.