...
...
Next Story

Illu Illalu Pillalu September 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. పెళ్లికి నో చెప్పిన ప్రేమ-నర్మదకు దొరికేసిన బల్లక్కాయ్

Illu Illalu Pillalu September 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే సెప్టెంబర్ 22 ఎపిసోడ్ లో పెళ్లికి ఓకే చెప్పకుండానే ప్రేమ ఇంట్లోకి వెళ్లిపోతుంది. బల్లక్కాయ్ నర్మదకు అడ్డంగా దొరికిపోతుంది. వల్లిని నర్మద బాదేస్తుంది. భద్రావతి కూడా కొడుతుంది. ధీరజ్ కు పెళ్లి అని తిరుకు తెలుస్తుంది.

Published on: Sep 22, 2026, 07:34:55 IST
Advertisement

Illu Illalu Pillalu September 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్ ఎంత రిక్వెస్ట్ చేసినా ప్రేమ వినదు. నీ మీద నమ్మకంతో మా అత్తకు మాటిచ్చా. కానీ నువ్వు నా నమ్మకాన్ని చంపేశావ్. అత్తకు ఇచ్చిన మాటను తప్పలేనని ప్రేమ అంటుంది.

ప్రేమ హగ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఈ పెళ్లి జరగకపోతే మనం జీవితాంతం దూరంగా ఉండాల్సి వస్తుంది. అది నీకు అర్థమవుతుందా? అని ప్రేమను ధీరజ్ అడుగుతాడు. వెంటనే ధీరజ్ ను ప్రేమ హగ్ చేసుకుంటుంది. విశ్వ, అమూల్య ఈ సీన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వెంటనే ప్రేమ దూరం జరిగి సారీ చెప్తుంది. వెళ్లి మామయ్యకు చెప్పు అని లోపలికి వెళ్లిపోతుంది. దీంతో పెళ్లికి ప్రేమ నో చెప్పినట్లయింది.

బల్లక్కాయ్ డ్రామా

ఇటు ఇంట్లో ధీరజ్, ప్రేమ పెళ్లి జరగదు బాలా. మనం జరగనివ్వం కదా బాలా అని శ్రీవల్లి పాట పాడుతూ గదిలోకి వెళ్తుంది. అక్కడ నర్మదను చూసి షాక్ అవుతుంది. పెళ్లి జరగదా వల్లక్కాయ్? కష్టపడి వాళ్లను విడగొట్టావ్ కదా అని నర్మద అంటుంది. తనకేం తెలియదన్నట్లు బల్లక్కాయ్ తెగ డ్రామా ఆడుతుంది.

బాదేసిన నర్మద

ప్రేమ, ధీరజ్ లు విడిపోవడంలో నీకు ఏం పాపం లేదా ఊసరవల్లక్కాయ్? మరి మీ మమ్మీ, డాడీని మోపిదేవికి ఎందుకు పంపించావ్ అక్కాయ్? అని నర్మద అడగ్గానే వల్లి ఫ్యూజులు ఔట్ అవుతాయి. పంపించలేదని వల్లి అనగానే నర్మద లాగిపెట్టి కొడుతుంది. అవును వెళ్లారని వల్లి చెప్తుంది. మరి నీకెందుకు కాల్ చేశారని మళ్లీ నర్మద కొడుతుంది.

నర్మద అనుమానం

భద్రావతికి కాలింగ్ చేసినట్లు డేటా చూపించమని వల్లి అడుగుతుంది. నువ్వు ఫోన్లో మాట్లాడావని నేను అనలేదే. అంటే నువ్వే చెప్పావని కన్ఫామ్ అని నర్మద బిగ్ ట్విస్ట్ ఇస్తుంది. ఇలా నర్మదకు బల్లక్కాయ్ దొరికిపోతుంది. బోర్డుపై భద్రావతి, బల్లక్కాయ్, భాగ్యం, ఇడ్లీ బాబాయి ఫొటోలు పెట్టి లింకులు కలుపుతుంది నర్మద. ఒక్క లింక్ దొరకగానే నీ పని ఫినిష్ అని నర్మద వార్నింగ్ ఇస్తుంది.

అప్పుడే నర్మద చేయి తగిలి వస్తువులు కింద పడతాయి. వల్లి సీక్రెట్ సిమ్ కార్డు కూడా బయట పడుతుంది. కానీ బల్లక్కాయ్ ఏమో నర్మదకు తెలియకుండా ఆ సిమ్ తీసుకొని దాచేస్తుంది.

భద్రావతికి ఇంటికి నిచ్చెన

వల్లితో నిచ్చెన మోయిస్తుంది నర్మద. భద్రావతి ఇంటికి నిచ్చెన వేయిస్తారు. ఈ బల్లక్కాయ్ ను పంపిద్దామని అత్తతో నర్మద చెప్తుంది. వెళ్లి ప్రేమను తీసుకురా అని నర్మద చెప్పేసరికి బల్లక్కాయ్ యమ స్పీడ్ గా నిచ్చెన ఎక్కుతుంది. పైకి వెళ్లిన బల్లక్కాయ్ కు భద్రావతి కనిపించడంతో షాక్ అవుతుంది.

ప్రేమ జాగ్రత్త

ప్రేమను జాగ్రత్తగా చూసుకోండని భద్రావతికి వల్లి చెప్తుంది. నీకు సన్మానం చేయాల్సిందేనని బల్లి రెండు చెంపలను వాయిస్తుంది భద్రావతి. నా తమ్ముడు తిరుపతి విషయంలో నువ్వు, నీ కుటుంబం చేసే మోసాన్ని కళ్లారా చూశాక కూడా నిన్ను ఎలా నమ్ముతానని భద్రావతి సీరియస్ అవుతుంది. ఏడ్చుకుంటూ వేదవతి, నర్మద దగ్గరకు వెళ్తుంది వల్లి. నన్ను వదిలేయమంటూ వెళ్లిపోతుంది.

ధీరజ్, ప్రేమ పెళ్లి

మరోవైపు తన భర్త తిరుపతికి సుక్కు ప్రేమగా స్వీట్లు తినిపిస్తుంది. అప్పుడే తిరుపతి వాళ్ల అమ్మ శారదాంబ అక్కడికి వస్తుంది. తిరు, సుక్కు కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు. మీ అన్యోన్యతను చూసి కడుపు నిండిపోయింది. మా వాడిని వలలో వేసుకోవడానికి పన్నాగాలు పన్నారేమో అనుకున్నా. కానీ మిమ్మల్ని చూస్తే మీ స్వచ్ఛమైన ప్రేమ ఏంటో తెలిసిందని శారదాంబ అంటుంది.

మీ రామరాజు బావ ధీరజ్ కు పెళ్లి చేయబోతున్నాడు. అప్పుడు మీరు ఆ ఇంట్లోకి రావొచ్చని శారదాంబ చెప్తుంది. ప్రేమ అన్యాయం అయిపోతుంది కదా అని తిరుపతి సీరియస్ అవుతాడు. ధీరజ్, ప్రేమకే మీ బావ పెళ్లి చేస్తానన్నాడని శారదాంబ అసలు విషయం చెప్తుంది. సుకన్యకు శారదాంబ నెక్లెస్ ఇస్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks