...
...
Next Story

OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మర్డర్ మిస్టరీ- ఫ్రెండ్ హత్యతో బయటపడే బలహీనతలు, రహస్యాలు- ఊహించని ట్విస్టులు- ఎక్కడంటే?

Imperfect Women OTT Release Today:ఓటీటీలోకి ఇవాళ మర్డర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఇంపర్ఫెక్ట్ విమెన్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ముగ్గురు ప్రాణ స్నేహితుల్లో ఒకరు హత్యకు గురికావడం, మిగతా వారి జీవితాల్లోని రహస్యాలు, బలహీనతలు బయటపడే కథతో ఈ ఓటీటీ సిరీస్ ఇంపర్ఫెక్ట్ విమెన్ తెరకెక్కింది.

Published on: Mar 18, 2026, 10:00:54 IST
Advertisement

బిగ్ లిటిల్ లైస్ వంటి ఓటీటీ సిరీస్‌లను ఇష్టపడే వారికి, స్నేహం వెనుక దాగున్న చేదు నిజాలు, సంపన్న వర్గాల రహస్యాలు, అనూహ్యమైన మలుపులతో కూడిన కథల కోసం వెతికే సినీ ప్రియుల కోసం అదిరిపోయే మర్డర్ మిస్టరీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

మర్డర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మర్డర్ మిస్టరీ- ఫ్రెండ్ హత్యతో బయటపడే బలహీనతలు, రహస్యాలు- ఊహించని ట్విస్టులు- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మర్డర్ మిస్టరీ- ఫ్రెండ్ హత్యతో బయటపడే బలహీనతలు, రహస్యాలు- ఊహించని ట్విస్టులు- ఎక్కడంటే?

హాలీవుడ్ ప్రముఖ నటీమణులు ఎలిజబెత్ మాస్, కెర్రీ వాషింగ్టన్, కేట్ మారా ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త మర్డర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ ‘ఇంపర్ఫెక్ట్ విమెన్’ (Imperfect Women) నేటి (మార్చి 18) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అసలు కథేంటి?

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మేరీ, ఎలియనోర్, నాన్సీ అనే ముగ్గురు ప్రాణ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. మేరీ ఒక మధ్యతరగతి గృహిణి, మానసిక సమస్యలతో సతమతమవుతుంటుంది. ఎలియనోర్ ఒంటరిగా ఉంటూ వ్యాపారంలో సక్సెస్ అయిన మహిళ.

నాన్సీ మరణంతో

ఇక నాన్సీ.. అత్యంత ధనవంతురాలు, సమాజంలో మంచి గౌరవం ఉన్న దాత. బయటకు ఎంతో పరిపూర్ణంగా (Perfect) కనిపించే నాన్సీ హత్యతో తన ఫ్రెండ్స్ జీవితాలు ఒక్కసారిగా ఛిన్నాభిన్నమవుతాయి.

చంపింది ఎవరు?

నాన్సీ మరణం తర్వాత ఆమెకు సంబంధించిన ఒక రహస్య ప్రేమ వ్యవహారం బయటపడుతుంది. ఆ వ్యక్తి ఎవరు? నాన్సీని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎవరు చంపారు? అనే ప్రశ్నలు ఇన్వెస్టిగేటర్లను వేధిస్తుంటాయి.

బయటపడే రహస్యాలు, బలహీనతలు

మరోవైపు, తమ స్నేహితురాలి మరణంతో కుంగిపోయిన మేరీ, ఎలియనోర్.. గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న కొద్దీ వారికి తెలియని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయి. ఈ క్రమంలో వారి వ్యక్తిగత జీవితాల్లోని బలహీనతలు, రహస్యాలు కూడా బయటపడతాయి. అవేంటి అనేదే ఇంపర్ఫెక్ట్ విమెన్ ఓటీటీ సిరీస్ కథ.

నటీనటులు

ఆరమింటా హాల్ రాసిన ‘ఇంపర్ఫెక్ట్ విమెన్’ (2020) నవల ఆధారంగా అనీ వైస్‌మాన్ ఈ ఓటీటీ సిరీస్‌ను రూపొందించారు. అనీ వైస్‌మాన్ గతంలో ‘ఫిజికల్’ వంటి విజయవంతమైన షోలను అందించిన అనుభవం ఉన్న మేకర్. ఊహించని ట్విస్టులు, ఇంట్రెస్టింగ్ సీన్లతో తెరకెక్కిన ఇంపర్ఫెక్ట్ విమెన్ ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్

ఆపిల్ టీవీ ప్లస్‌లో ఇవాళ (మార్చి 18) ఇంపర్ఫెక్ట్ విమెన్ ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతం కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఇంపర్ఫెక్ట్ విమెన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ ఓటీటీ సిరీస్ ఇంపర్ఫెక్ట్ విమెన్ నుంచి నేడు రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ 29 వరకు ప్రతి వారం ఒక్కో కొత్త ఎపిసోడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe