బాలీవుడ్‌లో ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్ సుమారు పదేళ్ల విరామం తర్వాత వెండితెరపైకి హీరోగా తిరిగొస్తున్న చిత్రం 'అధూరే హమ్ అధూరే తుమ్'.
ఓటీటీ మూవీతో కమ్‌బ్యాక్

అయితే, ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఫిల్మ్. పదేళ్ల గ్యాప్ తర్వాత ఓటీటీ మూవీతో కమ్‌బ్యాక్ ఇద్దామనుకున్నాడు హీరో ఇమ్రాన్ ఖాన్. నెట్‌ఫ్లిక్స్‌లో అధూరే హమ్ అధూరే తుమ్ ఓటీటీ స్ట్రీమింగ్ కావాల్సంది. కానీ, ఆ సినిమాకు బ్రేకులు పడినట్లు తాజాగా తెలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా 2026
గతేడాది 'అధూరే హమ్ అధూరే తుమ్' సినిమాను ప్రకటించినప్పుడు ఇమ్రాన్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే, ఇప్పుడు ఈ చిత్రం విడుదల విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా ముంబైలో జరిగిన 'నెక్ట్స్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా 2026' వేడుకలో ఈ ఓటీటీ ప్రకటించిన 29 సినిమా టైటిల్స్ జాబితాలో 'అధూరే హమ్ అధూరే తుమ్' పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎందుకు వాయిదా పడుతోంది?
'అధూరే హమ్ అధూరే తుమ్' సినిమా భవితవ్యం ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉందని హిందీ సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కారణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఎగ్జిక్యూటివ్ ఆ సంస్థ నుంచి తప్పుకున్నారని, దాంతో ప్రస్తుతం ఈ సినిమాను పట్టించుకునే వారు కరువయ్యారని సమాచారం.
"మేము జూలైలోనే షూటింగ్ పూర్తి చేశాం. అక్టోబర్‌లో ఫైనల్ కట్ కూడా అందించాం. దురదృష్టవశాత్తూ, మా ప్రాజెక్ట్‌ను ఆమోదించిన అధికారి ఇప్పుడు లేకపోవడంతో సినిమా విడుదలపై నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు" అని చిత్ర బృంద సభ్యుడు ఒకరు వెరైటీ ఇండియాకు వివరించారు.
పాత కాంబినేషన్.. కొత్త కథ
{{/usCountry}}"మేము జూలైలోనే షూటింగ్ పూర్తి చేశాం. అక్టోబర్‌లో ఫైనల్ కట్ కూడా అందించాం. దురదృష్టవశాత్తూ, మా ప్రాజెక్ట్‌ను ఆమోదించిన అధికారి ఇప్పుడు లేకపోవడంతో సినిమా విడుదలపై నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు" అని చిత్ర బృంద సభ్యుడు ఒకరు వెరైటీ ఇండియాకు వివరించారు.
పాత కాంబినేషన్.. కొత్త కథ
{{/usCountry}}అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కాలక్రమాన్ని బట్టి చూస్తే 'అధూరే హమ్ అధూరే తుమ్'సినిమా ఈ ఏడాది జూలై తర్వాతే ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా ఇమ్రాన్ ఖాన్, తన 'బ్రేక్ కే బాద్' (2010) దర్శకుడు డానిష్ అస్లాంతో మళ్లీ జతకట్టారు.
హీరోయిన్‌గా భూమి
ఒక 'డిస్ ఫంక్షనల్ రొమాంటిక్ కామెడీ'గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. గుర్ఫతే పిర్జాదా కీలక పాత్ర పోషిస్తున్నారు. గత నెలలో తన స్నేహితుడు వీర్ దాస్ నటించిన 'హ్యాపీ పటేల్'లో ఇమ్రాన్ ఒక చిన్న క్యామియో రోల్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను పలకరించారు.
ఫ్యాన్స్‌కు నిరీక్షణ
అయితే, చాక్లెట్ బాయ్ ఇమ్రాన్ ఖాన్‌ను పూర్తిస్థాయి హీరోగా చూడాలనుకున్న అభిమానులకు మాత్రం అధూరే హమ్ అధూరే తుమ్ ఓటీటీ రిలీజ్ అయ్యే వరకు నిరీక్షణ తప్పేలా లేదని తెలుస్తోంది.