ఒక్క శృంగార సీన్ ఎంత పనిచేసింది అని అనుకుంటున్నారు నెటిజన్స్. హీరోతో చేసిన సెక్స్ సీన్ నటి జీవితాన్నే మార్చేసింది. అయితే, అది ఆమెను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకుండా కూడా చేసేసింది.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది టాక్సిక్ సినిమా గురించే. కేజీఎఫ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమే ఈ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. లేడి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ టీజర్ విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఒక్క సీన్‌తో
అయితే ఈ టాక్సిక్ టీజర్‌లో శ్మశానం వెలుపల కారులో చిత్రీకరించిన హీరో యశ్‌తో చిత్రీకరించిన శృంగార సీన్ ఇప్పుడు తీవ్ర వివాదాలకు దారితీసింది. టాక్సిక్ టీజర్ విడుదలైనప్పటి నుంచి ఆ సన్నివేశంలో యశ్‌తో కలిసి నటించిన నటి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
మొదట ఆమె నటాలీ బర్న్ అని ప్రచారం జరిగినప్పటికీ, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ స్పందిస్తూ ఆ బ్యూటీ బ్రెజిల్ నటి బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ అని పరిచయం చేశారు. అయితే, ఆ ఒక్క సెక్స్ సీన్‌తో టాక్సిక్ టీజర్‌పై దుమారం రేగింది.
ఆ దృశ్యంపై నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసేసింది. ప్రస్తుతం ఆమె ప్రొఫైల్ కోసం వెతికితే ‘పేజీ అందుబాటులో లేదు’ అని చూపిస్తోంది. దీంతో కారులో యశ్‌తో శృంగార సీన్ నటి బీట్రిజ్ జీవితాన్నే మార్చేసిందని నెటిజన్స్ అనుకుంటున్నారు.
మహిళా కమీషన్‌కు ఫిర్యాదు
టాక్సిక్ టీజర్‌లోని అశ్లీలతపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మహిళా విభాగం కర్ణాటక రాష్ట్ర మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. "ఈ టీజర్‌లోని అశ్లీల దృశ్యాలు మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. కన్నడ సంస్కృతిని కించపరిచేలా ఉన్న ఈ టీజర్‌ను వెంటనే తొలగించాలి" అని ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ డిమాండ్ చేశారు.
{{/usCountry}}టాక్సిక్ టీజర్‌లోని అశ్లీలతపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మహిళా విభాగం కర్ణాటక రాష్ట్ర మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. "ఈ టీజర్‌లోని అశ్లీల దృశ్యాలు మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. కన్నడ సంస్కృతిని కించపరిచేలా ఉన్న ఈ టీజర్‌ను వెంటనే తొలగించాలి" అని ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ డిమాండ్ చేశారు.
{{/usCountry}}దీనిపై స్పందించిన మహిళా కమీషన్, తగిన చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు (CBFC) లేఖ రాసింది. మరోవైపు సామాజిక కార్యకర్త దినేష్ కల్లహళ్లి కూడా అభ్యంతరకర దృశ్యాలపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇలా ఆ ఒక్క సీన్‌తో టాక్సిక్ వివాదంలో చిక్కుకుంది. చివరికి నటి బీట్రిజ్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేవరకు దారి తీసింది.
కియారా అద్వానీ-నయనతార
ఇకపోతే ‘టాక్సిక్’ సినిమాకు యశ్ స్వయంగా కథను అందించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తార సుతారియా వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన టాక్సిక్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది.