...
...
Next Story

IPL 2026 final : నేడే ఐపీఎల్​ మెగా ఫైనల్​- వెదర్​ రిపోర్ట్​ ఏంటి? వర్షం పడుతుందా?

IPL 2026 final weather report : నేటి ఐపీఎల్​ 2026 ఫైనల్​కి వరుణుడి ముప్పు ఉందా? అహ్మదాబాద్​లో వాతావరణం ఎలా ఉంటుంది? రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు వర్సెస్​ గుజరాత్​ టైటాన్స్​ తుది సమరానికి ముందు వెదర్​ రిపోర్ట్​ని ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: May 31, 2026, 06:03:06 IST
Advertisement

RCB vs GT weather report : రెండు నెలల ఐండియన్ ప్రీమియర్ లీగ్​ సంబరానికి నేడు ముగింపు పడనుంది. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేటి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్​ రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక సమరం జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించిన వెదర్ రిపోర్ట్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐపీఎల్​ 2026 ఫైనల్- వెదర్​ రిపోర్ట్..

అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం..
అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం..

ఐపీఎల్​ 2026 ఫైనల్​లో ఆర్సీబీ, జీటీ మధ్య మ్యాచ్ సజావుగా జరుగుతుందని వెదర్​ రిపోర్ట్​ సూచిస్తోంది. ఈ మ్యాచ్​కి ఎలాంటి వర్షాల అడ్డంకి ఉండకపోవచ్చు. వాతావరణం దాదాపు క్లియర్​గా ఉంటుంది. అప్పుడప్పుడు మబ్బులు వస్తాయని కానీ వర్షం పడే ఛాన్స్​ లేదు. పైగా వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మ్యాచ్​ జరిగే సమయానికి అహ్మదాబాద్​లో 33 డిగ్రీల నుచి 36 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండొచ్చు.

7 పీఎం- 39 డిగ్రీలు

8 పీఎం- 37 డిగ్రీలు

9 పీఎం- 36 డిగ్రీలు

10 పీఎం- 34 డిగ్రీలు

11 పీఎం - 33 డిగ్రీలు

అయితే అహ్మదాబాద్​లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్టేడియంకు వెళ్లే ఫ్యాన్స్​ హైడ్రేటెడ్​గా ఉండాలని, మంచి నీరు ఎక్కువగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒకవేళ వర్షం పడి ఐపీఎల్​ 2026 ఫైనల్​ రద్దు అయితే? గెలిచేది ఎవరు?

వెదర్​ రిపోర్ట్​ ప్రకారం ఐపీఎల్​ 2026 ఫైనల్​లో వర్షం పడటం అసాధ్యంగానే ఉంది. కానీ ఆ పరిస్థితిని కూడా లెక్కలోకి తీసుకుంటే.. 120 నిమిషాల ఎక్స్​ట్రా టైమ్ ఉంటుంది. ఈలోపు మ్యాచ్​ని స్టార్ట్​ చేయాలి. కానీ ఓవర్లను కుదిస్తారు.

ఒక వేళ రిజర్వ్​ డే నాడు కూడా మ్యాచ్​ జరగకపోతే.. లీగ్​ స్టేజ్​లో పాయింట్స్​ పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.

ఐపీఎల్​ 2026 పాయింట్స్​ టేబుల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు, గుజరాత్ టైటాటాన్స్​కి చరో 18 పాయింట్లు ఉన్నాయి. కానీ నెట్​ రన్​ రేట్​ మెరుగ్గా ఉండటంతో రజత్​ పటిదార్​ సేన నెంబర్​ 1 పొజిషన్​లో ఉంది. అంటే, రిజర్వ్​ డే నాడు కూడా మ్యాచ్​ జరగకపోతే ఆర్సీబీని ఐపీఎల్​ 2026 విజేతగా డిక్లేర్ చేస్తారు.

గుజరాత్​ టైటాన్స్​ కష్టాలు..

క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న గుజరాత్‌కు ప్రకృతి షాక్ ఇచ్చింది. గుజరాత్​, అహ్మదాబాద్​లో వర్షాలు పడటం లేదు కానీ, వాయువ్య భారతంలో మాత్రం వానలు దంచికొడుతున్నాయి. దీని వల్ల జీటీ టీమ్​ ప్రయాణం ఆలస్యమైంది.

శనివారం మధ్యాహ్నమే చండీగఢ్ నుంచి బయలుదేరాల్సిన టైటాన్స్ జట్టు, పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల చాలా సేపు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది.

శనివారం రాత్రి ఆలస్యంగా అహ్మదాబాద్ ల్యాండ్ అవ్వడం వల్ల, వారికి ఫైనల్ మ్యాచ్‌కు ముందు పిచ్‌ను పరిశీలించడం లేదా నెట్స్‌లో కఠినంగా ప్రాక్టీస్ చేసే సమయం లేకుండా పోయింది.

ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి! ఫైనల్‌కు ఒక్క రోజు ముందు ప్రయాణం..

ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఒక ఫైనలిస్ట్ జట్టు మ్యాచ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి! బీసీసీఐ ఈసారి ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచులను మూడు వేర్వేరు నగరాల్లో (ధర్మశాల, చంఢీగఢ్, అహ్మదాబాద్) నిర్వహించాలని తీసుకున్న సరికొత్త నిర్ణయం వల్లే జట్లకు ఈ లాజిస్టికల్, ట్రావెల్ ఇబ్బందులు ఎదురయ్యాయి.

కాగా.. గుజరాత్ పరిస్థితి ఇలా ఉంటే, లీగ్ టేబుల్ టాపర్- డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది.

ధర్మశాలలో మంగళవారం జరిగిన క్వాలిఫైయర్ 1 లో గెలిచిన వెంటనే రజత్ పాటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ జట్టు బుధవారమే అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది.

గత రెండు రోజులుగా నరేంద్ర మోదీ స్టేడియం ఫ్లడ్‌లైట్ల కింద ఆర్సీబీ ఆటగాళ్లు రెండు భారీ ట్రైనింగ్ సెషన్లలో పాల్గొన్నారు. గుజరాత్​ టైటాన్స్​ పరిస్థితితో పోల్చుకుంటే ఆర్సీబీకి ఇది ప్లస్​ పాయింటే!

ఈ అడ్వాంటేజ్ గురించి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. "క్వాలిఫైయర్ 1 తర్వాత మాకు విశ్రాంతి దొరికింది, రికవరీ అయ్యాం. గుజరాత్ వరుసగా మ్యాచ్‌లు ఆడి వస్తోంది. మాకు కొంత అడ్వాంటేజ్ ఉన్న మాట నిజమే అయినా.. రెండు జట్లూ పటిష్టంగా ఉన్నాయి కాబట్టి ఫైనల్ పోరు రసవత్తరంగా ఉంటుంది," అని వ్యాఖ్యానించాడు.

వరుసగా రెండొవ ఐపీఎల్ ట్రోఫీపై కన్నేసిన ఆర్‌సబీ ఒకవైపు.. ప్రయాణ అలసటను తట్టుకుని రెండొవ టైటిల్ కొట్టాలని చూస్తున్న గుజరాత్ టైటాన్స్ మరోవైపు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో తేల్చుకోనున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe