...
...
Next Story

RCB vs GT pitch report : ఐపీఎల్​ 2026 ఫైనల్- పిచ్​ రిపోర్ట్, ఆర్సీబీ వర్సెస్​ జీటీ స్టాట్స్.. గెలుపెవరిది?

IPL 2026 final pitch report : ఐపీఎల్​ 2026 ఫైనల్ నేడే! రాయాల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్​ పిచ్​ రిపోర్ట్​, హెడ్​-టు-హెడ్​ స్టాట్స్​ గురించి ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: May 31, 2026, 06:43:51 IST
Advertisement

రెండు నెలల పాటు క్రికెట్​ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. గుజరాత్​ అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్​- గుజరాత్​ టైటాన్స్​ మధ్య ఐపీఎల్​ 2026 ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. గత ఏడాది (2025) ఇదే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ని ఓడించి ఆర్సీబీ తన మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. క్వాలిఫైయర్ 1లో గుజరాత్‌ని 92 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఈ జట్టు ట్రోఫీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్‌ను ఓడించి గుజరాత్​ టైటాన్స్​ని తక్కువ అంచనా వేయడానికి లేదు! ఈ నేపథ్యంలో ఆర్సీబీ వర్సెస్​ జీటీ పిచ్​ రిపోర్ట్​, హెడ్​-టు-హెడ్​ స్టాట్స్​ వంటి కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్సీబీ వర్సెస్​ జీటీ ఫైనల్- పిచ్ నంబర్ 6 ప్రత్యేకత..

ఆర్సీబీ వర్సెస్​ జీటీ మెగా ఐపీఎల్​ ఫైనల్ నేడే..
ఆర్సీబీ వర్సెస్​ జీటీ మెగా ఐపీఎల్​ ఫైనల్ నేడే..

టాస్ పడటానికి ముందే ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ పిచ్ గురించిన ఒక కీలక రహస్యాన్ని వెల్లడించారు:

75% ఎర్రమట్టి పిచ్: "మేము పిచ్ నంబర్ 6 పై ఆడబోతున్నాం. ఇది 75 శాతం ఎర్రమట్టితో కూడిన పిచ్. గత ఏడాది మేము ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు వాడిన స్ట్రిప్ కూడా ఇదే. ఈ పిచ్‌పై బౌన్స్ స్థిరంగా ఉంటుంది, బ్యాటింగ్‌కు చాలా అద్భుతంగా సహకరిస్తుంది. కాబట్టి ఫైనల్​ రోజు రాత్రి పరుగుల వరద పారడం ఖాయం," అని ఆయన పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 181 పరుగులుగా ఉంది. కొత్త బంతితో పేసర్లకు కొద్దిగా స్వింగ్ లభించినా, మధ్య ఓవర్లలో పిచ్ స్పిన్నర్లకు టర్న్ ఇస్తుంది.

ఐపీఎల్​ 2026 ఫైనల్ : ఆర్సీబీ వర్సెస్​ జీటీ స్టాట్స్..

ఐపీఎల్​ 2026 క్వాలిఫైయర్​ 1కి ముందు ఇరు జట్లు 4-4 విజయాలతో సమానంగా ఉండేవి. కానీ క్వాలిఫైయర్​ 1లో తిరుగు లేని ఆధిపత్యాన్ని చెలాయించిన ఆర్సీబీ ఆ మ్యాచ్​ గెలవడంతో ఇప్పుడు ఈ హెడ్​-టు-హెడ్​ స్టాట్స్​ 5-4కి మారింది. మరోవైపు అహ్మదాబాద్​లో ఇరు జట్లు 1-1 విజయాలతో ఉన్నాయి. ఇరు జట్ల మధ్య జరిగిన 9 మ్యాచుల్లో.. రెండోసారి బ్యాటింగ్​ చేసిన జట్టే 8సార్లు విజయం సాధించడం గమనార్హం.

ఐపీఎల్​ 2026 ఫైనల్- టాస్ గెలిస్తే ఫీల్డింగే!

సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ ఉండే అవకాశం ఉండటం వల్ల బంతి తడిగా మారి బౌలింగ్ చేయడం కష్టమవుతుంది. ఇది ఛేజింగ్ చేసే జట్టుకు కొండంత అండగా మారుతుంది.

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ అనలిటికల్ కెప్టెన్లు కాబట్టి.. టాస్ గెలిచిన వారు ఆలోచించకుండా మొదట ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు! టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం స్కోరు బోర్డుపై కనీసం 205+ పరుగులు పెట్టాల్సి ఉంటుంది.

ఐపీఎల్​ 2026 ఫైనల్​ వెదర్​ రిపోర్ట్​ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

నరేంద్ర మోదీ స్టేడియం కీలక గణాంకాలు..

అత్యధిక స్కోరు: 233/3 (గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, 2023)

అత్యల్ప స్కోరు: 89 (గుజరాత్ టైటాన్స్ వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్)

అత్యధిక వ్యక్తిగత స్కోరు: 129 పరుగులు (శుభ్‌మన్ గిల్ వర్సెస్ ముంబై ఇండియన్స్, 2023)

బెస్ట్ బౌలింగ్ గణాంకాలు: 5/10 (మోహిత్ శర్మ వర్సెస్ ముంబై ఇండియన్స్, 2023)

పేస్ వర్సెస్ స్పిన్ వికెట్లు: ఇక్కడ పడే వికెట్లలో దాదాపు 67% వికెట్లు పేసర్లకే దక్కుతాయి.

హోమ్ గ్రౌండ్‌లో 'గిల్' రాజరికం!

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఈ మైదానం సొంత ఇల్లు లాంటిది. ఇక్కడ ఆడిన ఐపీఎల్ మ్యాచుల్లో గిల్ ఏకంగా 1,257 కంటే ఎక్కువ పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆర్సీబీ వర్సెస్​ జీటీ ఫైనల్- ఎవరు గెలిచే అవకాశం ఉంది?

పేపర్‌పై చూస్తే ఆర్సీబీ బౌలింగ్ లైనప్ (భువనేశ్వర్ స్వింగ్, హేజిల్‌వుడ్ బౌన్స్, క్రునాల్ స్పిన్) ఈ కండిషన్స్‌కు సరిగ్గా సరిపోతుంది. పైగా క్వాలిఫైయర్ 1లో 254/5 స్కోరుతో ప్లేఆఫ్స్ హిస్టరీలోనే అత్యధిక స్కోరు సాధించిన మొమెంటం వారికుంది. కానీ గుజరాత్ బ్యాటింగ్ డెప్త్, రషీద్ ఖాన్ మ్యాజిక్, గిల్ రికార్డులను తక్కువ అంచనా వేయలేం. టాస్ గెలిచి చేజ్ చేసే జట్టుకే కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe