...
...
Next Story

Irumudi Review: ఇరుముడి రివ్యూ- క్లైమాక్స్‌కు ఏడవాల్సిందే- రవితేజ ఎమోషనల్ హిట్- తండ్రీ కూతుళ్ల బంధం మెప్పించిందా?

Irumudi Review And Rating In Telugu: రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ఇరుముడి సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. అయ్యప్ప స్వామి మాలధారణ నేపథ్యం, తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్, ఆడపిల్లల రక్షణ అనే బలమైన సందేశంతో ఈ సినిమా తెరకెక్కింది. మరి రవితేజ హిట్ కొట్టాడో లేదో నేటి ఇరుముడి రివ్యూలో చూద్దాం.

Published on: Aug 21, 2026, 13:57:18 IST
Advertisement

Irumudi Movie Review In Telugu And Rating:

ఇరుముడి రివ్యూ- క్లైమాక్స్‌కు ఏడవాల్సిందే- రవితేజ ఎమోషనల్ హిట్- తండ్రీ కూతుళ్ల బంధం మెప్పించిందా?
ఇరుముడి రివ్యూ- క్లైమాక్స్‌కు ఏడవాల్సిందే- రవితేజ ఎమోషనల్ హిట్- తండ్రీ కూతుళ్ల బంధం మెప్పించిందా?

టైటిల్: ఇరుముడి

నటీనటులు: రవితేజ, బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వాసిక విజయన్, అజయ్ ఘోష్ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్

విడుదల తేది: ఆగస్ట్ 21, 2026

మాస్ మహారాజా రవితేజ నుంచి ఒక సినిమా వస్తోందంటే అభిమానులు పక్కా మాస్ ఎలిమెంట్స్, విపరీతమైన ఎనర్జీ, యాక్షన్ సీన్స్ ఆశిస్తారు. కానీ, ఈసారి రవితేజ రూట్ మార్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి హృదయానికి హత్తుకునే ఒక బలమైన కథతో ప్రేక్షకులను పలకరించాడు రవితేజ.

'నిన్ను కోరి', 'మజిలీ' వంటి ఫీల్ గుడ్ ఎమోషనల్ చిత్రాలను అందించిన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన'ఇరుముడి' సినిమాపై మొదటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తండ్రీ కూతుళ్ల ఎమోషన్‌కు అయ్యప్ప దీక్ష అనే డివోషనల్ ఎలిమెంట్ అద్ది ఈ సినిమాను రూపొందించారు. మరి ఇవాళ (ఆగస్ట్ 21) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఇరుముడి రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

సీలేరు ప్రాంతంలోని ఓ పల్లెటూరులో త్రినాథ్ (రవితేజ) అరటిపళ్ల వ్యాపారం చేస్తూ తన భార్య కావేరి (ప్రియా భవాని శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)ను పోషించుకుంటాడు. అతనికి మందు అలవాటు కూడా ఉంటుంది. ఊరిలో ఏం జరిగిన తండ్రికి చెప్పడం మణికంఠకు అలవాటు. ఈ క్రమంలోనే చదువుకునే పాఠశాల విద్యార్థినీలు అనుమానాస్పద రీతిలో మరణిస్తుంటారు. ఆ అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారో తెలుసుకునేందుకు త్రినాథ్ ప్రయత్నిస్తాడు.

చాలా కాలంగా రవితేజకు సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలో డిఫరెంట్ జోనర్‌తో రవితేజ రావడంతో ఇరుముడి సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆశలు నెరవేరినట్లే అని చెప్పుకోవచ్చు. ఎంతోకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఇరుముడితో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.

ఇరుముడి స్టోరీ కాస్తా రెగ్యులర్‌గా అనిపించిన స్క్రీన్ ప్లే, టేకింగ్‌తో డైరెక్టర్ శివ నిర్వాణ మ్యాజిక్ చేశారు. సమాజంలో నిత్యం కనిపించే ఒక కఠినమైన నిజాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించి క్లైమాక్స్ పూర్తయ్యేలోపు ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏడ్చేలా చేశారు.

ప్రధానమైన మెసేజ్

కథనం ఫస్టాఫ్ అంతా చాలా ఆహ్లాదకరంగా, సరదాగా సాగిపోతుంది. ప్రథమార్థంలో సీలేరు ప్రకృతి అందాలు, కుటుంబ సన్నివేశాలు, అయ్యప్ప మాలధారణ భక్తి గీతాలు, తండ్రీ కూతుళ్ల అనుబంధం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. "ఆడపిల్లలకు భయం ఉండకూడదు, వారిని ధైర్యంగా పెంచాలి" అనే ప్రధానమైన మెసేజ్‌ను దర్శకుడు చాలా బాగా తెరపైకి తీసుకువచ్చారు.

ఇక సెకండాఫ్ మొదలైన తర్వాత కథ సీరియస్‌గా మారుతుంది. వచ్చే ట్విస్టులు అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రతి ఆడపిల్ల తండ్రిని ఆలోచింపజేసేలా, కాస్త భయపెట్టేలా కొన్ని సీన్లు రాసుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. అక్కడక్కడా కథ కాస్త మెల్లగా సాగినట్లు అనిపించినా, బలమైన ఎమోషన్స్ ఆ లోపాన్ని కప్పేశాయి.

హైలెట్ అయ్యే సంగీతం

అలాగే, మల్లెపూల పల్లకి పాట, ఓ చేజింగ్ సీన్‌లో వచ్చే డీజే మిక్స్ సీన్లకు ప్రాణం పోశాయి. కొన్ని చోట్ల ఇంకాస్తా డెప్త్‌గా కూడా సన్నివేశాలు ఉండొచ్చేమో అనిపించింది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు బాగా హెల్ప్ అయింది. అయ్యప్ప స్వామి భక్తి పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయి.

విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ సీలేరు అందాలను చాలా సహజంగా చూపెట్టింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సెకండాఫ్‌లో కాస్త నెమ్మదించినా, దర్శకుడు అందించిన సందేశం సినిమాను నిలబెట్టింది.

ఎవరెలా చేశారంటే?

చాలా కాలం తర్వాత రవితేజ నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమా వచ్చింది. అయ్యప్ప భక్తుడిగా, బాధ్యతగల తండ్రిగా ఆయన ఒదిగిపోయారు. నిజానికి సినిమా అంతా రవితేజనే కనిపించారు. రవితేజతోపాటు ఆయనకు కూతురుగా నటించిన చిన్నారి బేబీ నక్షత్ర యాక్టింగ్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది.

తండ్రీకూతుళ్ల మధ్య కెమిస్ట్రీ, ఎమోషన్, బాండ్ బాగా ఎలివేట్ అయ్యాయి. అందుకు కారణం రవితేజ, నక్షత్రల నటనే అని చెప్పొచ్చు. వారి పర్ఫామెన్స్‌తో ఆడియెన్స్ వారి బంధంలో లీనమయ్యేలా చేశారు. ప్రియా భవాని శంకర్ తన పరిధి మేరకు పద్ధతిగా నటించగా, సాయి కుమార్, అజయ్ ఘోష్ తమ పాత్రల్లో రాణించారు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

స్వాసిక పాత్ర కొంచెమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా మంచి సందేశాన్ని ఇచ్చే పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. కుటుంబంతో థియేటర్లలో ఇరుముడి సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.

రేటింగ్: 3.5/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe