...
...
Next Story

Jailer 2: రజనీకాంత్ జైలర్ 2 టికెట్ ధరల పెంపు- ఏ థియేటర్‌లో ఎంత పెరిగింది?తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంతంటే?

Jailer 2 Ticket Price Hike In Andhra Pradesh: సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జైలర్ 2' టికెట్ రేట్లను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు ఏపీలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది.

Published on: Oct 11, 2026, 06:47:57 IST
Advertisement

Jailer 2 Ticket Price Hike In Andhra Pradesh: సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండ్యన్‌గా థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు. రజనీకాంత్ నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ 'జైలర్ 2' అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

జైలర్ 2 టికెట్ ధరలు పెంపు

రజనీకాంత్ జైలర్ 2 టికెట్ ధరల పెంపు- ఏ థియేటర్‌లో ఎంత పెరిగింది?తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంతంటే? (X/ @theatrebabu)
రజనీకాంత్ జైలర్ 2 టికెట్ ధరల పెంపు- ఏ థియేటర్‌లో ఎంత పెరిగింది?తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంతంటే? (X/ @theatrebabu)

జైలర్ 2 సినిమా విడుదలకు మరో ఐదు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో చిత్రబృందం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రజనీ అభిమానులతో పాటు సినీ ప్రియులకు కీలకమైన అప్‌డేట్ అందించింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 'జైలర్ 2' టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్రసీమలో టికెట్ ధరల విధానం

సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వమే నియంత్రిస్తుంది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లకు వేర్వేరు గరిష్ఠ ధరలను నిర్దేశిస్తూ ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు విజ్ఞప్తి చేసినప్పుడు మాత్రమే తాత్కాలికంగా ధరల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది.

తెలంగాణలో కూడా ప్రభుత్వం టికెట్ రేట్లను పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలో 'జైలర్ 2' ఏపీ పంపిణీ హక్కులు దక్కించుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేసిన దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం ఈ పెంపునకు జీవో ఇచ్చింది.

సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో ఎంత పెరుగుతుందంటే?

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, అక్టోబర్ 15న జరిగే ప్రీమియర్ షోల నుంచి అక్టోబర్ 21 వరకు ఏడు రోజుల పాటు ఈ పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై రూ.50 వరకు, మల్టీప్లెక్స్‌లలో రూ.75 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చు.

ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ సంస్థ సాక్నిల్క్ (Sacnilk) అందించిన గణాంకాల ప్రకారం, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే జైలర్ 2 చిత్రం రూ.4.02 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఇందులో బ్లాక్ చేసిన సీట్ల లెక్కలు కూడా కలిసే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం కోసం టికెట్ల కేటాయింపు వేగంగా జరుగుతోంది.

భారీ తారాగణం.. అదిరిపోయే యాక్షన్ లైన్!

కాగా, 2023లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. మొదటి భాగంలో మెప్పించిన రమ్యకృష్ణ, మోహన్ ‌లాల్, యోగి బాబు, మీర్నా మీనన్, రిత్విక్ తమ పాత్రల్లో మళ్లీ కనిపిస్తున్నారు.

ఈ సీక్వెల్‌లో ఎస్‌జే సూర్య, మిథున్ చక్రవర్తి, జాకీ ష్రాఫ్, సూరజ్ వెంజారమూడు, విద్యా బాలన్, అన్నా రాజన్, జతిన్ సర్నా వంటి నటులు కొత్తగా చేరారు. వీరితో పాటు హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి ప్రత్యేక అతిథి పాత్రల్లో మెరుస్తారని వార్తలు వస్తున్నాయి.

జైలర్ 2 ట్రైలర్ చూస్తే

ఇటీవల విడుదలైన జైలర్ 2 ట్రైలర్ ప్రకారం ముత్తువేల్ పాండ్యన్ ఒక మారుమూల గ్రామంలో డ్రైవర్‌గా ప్రశాంత జీవనం గడుపుతుంటాడు. కానీ, శత్రువులంతా ఏకమై అతనిపై కుట్ర పన్నడంతో, రిటైర్డ్ జైలర్ మళ్లీ రౌద్ర అవతారం ఎత్తక తప్పదు.

దర్శకుడు నెల్సన్ తనదైన శైలి యాక్షన్‌తో పాటు రజనీకాంత్ మార్క్ స్వాగ్‌ను నెక్ట్స్ లెవెల్‌లో చూపించబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం జైలర్ 2 సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks