...
...
Next Story

Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రిలీజ్- టైగర్ ముత్తువేల్‌గా రజనీకాంత్ విధ్వంసం, కొత్త విలన్లతో సమరం- ఎవరెవరున్నారంటే?

Jailer 2 Trailer Released: సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన జైలర్ 2 ట్రైలర్‌‌ను మేకర్స్ విడుదల చేశారు. టైగర్ ముత్తువేల్ పాండ్యన్ మాస్ అవతార్, కొత్త విలన్లు, హృతిక్ రోషన్ క్యామియో ప్రచారం అభిమానుల్లో అంచనాలను ఆకాశానికెత్తేశాయి. మరి జైలర్ 2 ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

Published on: Oct 5, 2026, 21:07:51 IST
Advertisement

Rajinikanth Jailer 2 Trailer Released: సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఏ క్షణం కోసమైతే వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారో ఆ సమయం రానే వచ్చింది. 2023లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌‌గా వస్తున్న 'జైలర్ 2' ట్రైలర్‌ను దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు.

డ్రైవర్‌గా టైగర్.. తిరగబడ్డ వేళ విధ్వంసమే!

జైలర్ 2 ట్రైలర్ రిలీజ్- టైగర్ ముత్తువేల్‌గా రజనీకాంత్ విధ్వంసం, కొత్త విలన్లతో సమరం- ఎవరెవరున్నారంటే?
జైలర్ 2 ట్రైలర్ రిలీజ్- టైగర్ ముత్తువేల్‌గా రజనీకాంత్ విధ్వంసం, కొత్త విలన్లతో సమరం- ఎవరెవరున్నారంటే?

టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజినీకాంత్ మరోసారి తన మార్కు మాస్ విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు రెండు నిమిషాల నిడివితో సాగిన ఈ జైలర్ 2 ట్రైలర్ ప్రారంభంలో సూరజ్ వెంజారమూడు పాత్ర టైగర్ కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తుంది.

గతంలో జైలర్‌గా అలరించిన ముత్తువేల్ పాండ్యన్, ప్రస్తుతం తన గతాన్ని దాచిపెట్టి సాధారణ డ్రైవర్‌గా జీవిస్తుంటారు. తన గతం తెలియని వారి నుంచి అవమానాలు ఎదుర్కొంటూ శాంతంగా ఉండే టైగర్, పరిస్థితులు హద్దు దాటినప్పుడు ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో ట్రైలర్‌లో చూపించారు. శత్రువులను

మల్టీస్టారర్ ధమాకా.. కొత్త విలన్లతో సమరం

నరికిపారేసిన తర్వాత కూడా ఏమీ తెలియనట్లు కారు తుడిచే సీన్‌లో యోగి బాబు కామెడీ, నెల్సన్ మార్కు డార్క్ హ్యూమర్‌ను బాగా చూపించారు. ఈ సీక్వెల్‌లో నటీనటుల పరిధిని మేకర్స్ మరింత విస్తరించారు. సూరజ్ వెంజరమూడు, ఎస్‌జే సూర్య, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి ఈసారి కొత్త ప్రత్యర్థులుగా కనిపించనున్నారు.

జైలర్ 2 ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌‌గా మారింది. దీనిపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. "జైలర్ 2 బాగుంది కానీ, మొదటి భాగం స్థాయిలో గూస్‌బంప్స్ ఇవ్వలేదు" అని ఒక నెటిజన్ అభిప్రాయపడగా, "భారీ యాక్షన్ సీన్లు, నెల్సన్ మార్కు ఎలివేషన్లు అద్భుతంగా ఉన్నాయి. ఈసారి కూడా అనిరుధ్ తన సంగీతంతో సినిమాను నిలబెడతాడో లేదో చూడాలి" అని మరొకరు రాసుకొచ్చారు.

మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ట్రైలర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మెరిశారని నెటిజన్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ట్రైలర్‌లోని ఒక సెకన్ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ "జైలర్ 2లో హృతిక్ రోషన్ కనిపిస్తున్నారా? ఇది నిజమైతే సినిమా రేంజ్ మారిపోతుంది" అంటూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks