Chethabadi Movie Audio Rights Sold To Saregama: తెలుగులో ఎంతో క్రేజ్ ఉన్న హీరోల్లో జేడీ చక్రవర్తి ఒకరు. 90స్ కాలంలో హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన జేడీ చక్రవర్తి నటుడిగా కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ చేతబడి. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రానికి తాజాగా ‘‘చేతబడి” అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.
తాజాగా టైటిల్ రివీల్

ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎమ్3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇదివరకు ఈ రెండు నిర్మాణ సంస్థల నుంచి ప్రొడక్షన్ నెం 4గా ఓ మూవీ తెరకెక్కుతున్నట్లు పోస్టర్ అనౌన్స్‌మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆ సినిమా టైటిల్ చేతబడి అంటూ రివీల్ చేశారు దర్శకనిర్మాతలు.
చేతబడి టెక్నికల్ వర్క్
చేతబడి సినిమాను మహర్షి కూండ్ల సమర్పణలో రూపొందుంతోంది. ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చేతబడి సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
బాణామతి బ్యాక్ డ్రాప్‌లో
సినిమాటోగ్రాఫర్‌గా మిర్లాన్ నసీర్ చేయగా ఎడిటింగ్ వంశీ చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాణామతి బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ ఆసక్తికరమైన చిత్రం చేతబడి హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా
ఇప్పటికే విడుదలైన చేతబడి ప్రీ లుక్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. గురువారం (ఏప్రిల్ 17) వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి రివీల్ చేశారు మేకర్స్. మునుపెన్నడూ పోషించని డిఫరెంట్ అవతార్‌లో హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తి కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలియజేసింది.
ఐదు భాషల ఆడియో రైట్స్
మరోవైపు చేతబడి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకముందే.. ఐదు భాషల ఆడియో రైట్స్‌ను మ్యూజిక్ సెన్సేషన్ సరిగమ సంస్థ దక్కించుకుంది. ఒక పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది. కానీ, ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
దెయ్యం తర్వాత
{{/usCountry}}మరోవైపు చేతబడి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకముందే.. ఐదు భాషల ఆడియో రైట్స్‌ను మ్యూజిక్ సెన్సేషన్ సరిగమ సంస్థ దక్కించుకుంది. ఒక పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది. కానీ, ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
దెయ్యం తర్వాత
{{/usCountry}}వచ్చే నెల నుంచి ఈ చేతబడి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. చేతబడి చిత్రం టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది. ఇదివరకు దెయ్యం వంటి సినిమాలతో అలరించిన జేడీ చక్రవర్తి ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చేతబడి మూవీతో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి.