తెలుగులో కామెడీ డ్రామాగా వచ్చిన సినిమా జిగ్రీస్. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో కిరణ్ అబ్బవరం సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. నలుగురు స్నేహితుల కామెడీ ట్రిప్‌గా సాగే జిగ్రీస్ ఓటీటీల్లో దూసుకుపోతోంది. ఏకంగా రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌లో నవ్విస్తూ దూసుకుపోతోంది జిగ్రీస్ మూవీ.
గుండెకు హత్తుకునే భావోద్వేగాలు

థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో జిగ్రీస్ సినిమాను ఎగబడి చూస్తున్నారు. కేవలం నవ్వులే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అద్భుతంగా తీర్చిదిద్దారు.
కడుపుబ్బ నవ్వించడమే కాకుండా
కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనతో పాటు మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు.
సందీప్ రెడ్డి వంగా సపోర్ట్
కృష్ణ వోడపల్లి నిర్మాణంలో, చిత్తం వినయ్ కుమార్ సహ నిర్మాణంలో వచ్చిన జిగ్రీస్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా గారి సపోర్ట్ పెద్ద బలాన్ని ఇచ్చింది. సయ్యద్ కమ్రాన్ సంగీతం, ఈశ్వరదిత్య డీవోపీ మరియు చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
రెండింట్లో ట్రెండింగ్
ఇలాంటి జిగ్రీస్ అమెజాన్ ప్రైమ్‌తోపాటు సన్ నెక్ట్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 6న సన్ నెక్ట్‌తోపాటు అమెజాన్ ప్రైమ్‌లో జిగ్రీస్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ రెండింట్లో జిగ్రీస్ ఓటీటీ ట్రెండింగ్ అవడం విశేషంగా మారింది.
జిగ్రీస్ కథ
కాగా, డైరెక్టర్ హరీష్ రెడ్డి దర్శకత్వం వహించిన జిగ్రీస్ సినిమాలో రామ్ నితిన్, కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా హీరోలుగా చేశారు. ఇక జిగ్రీస్ కథలోకి వెళితే.. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన నలుగురు ప్రాణ స్నేహితుల కథ ఇది.
మద్యం మత్తులో
{{/usCountry}}కాగా, డైరెక్టర్ హరీష్ రెడ్డి దర్శకత్వం వహించిన జిగ్రీస్ సినిమాలో రామ్ నితిన్, కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా హీరోలుగా చేశారు. ఇక జిగ్రీస్ కథలోకి వెళితే.. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన నలుగురు ప్రాణ స్నేహితుల కథ ఇది.
మద్యం మత్తులో
{{/usCountry}}ఒక రాత్రి మద్యం మత్తులో, ‘ఇన్ టూ ది వైల్డ్’ అనే ఇంగ్లీష్ సినిమా చూసి స్ఫూర్తి పొంది.. అసలు చేతిలో ఫోన్లు, డబ్బులు, ఐడెంటిటీ కార్డులు ఏవీ లేకుండా పాత మారుతీ 800 కారులో గోవాకు రోడ్ ట్రిప్ బయలుదేరతారు నలుగురు ఫ్రెండ్స్.
అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ ఓటీటీలు
ఆ ప్రయాణంలో వారికి ఎదురైన వింత అనుభవాలు, సరదా సంఘటనలు, ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. నవ్వులతో మొదలైన వీరి ప్రయాణం, చివరలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ముగుస్తుంది. థియేటర్లలో చూడనివారు అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న జిగ్రీస్‌పై లుక్కేయండి.