...
...
Next Story

Jio Hotstar OTT: జియో హాట్‌స్టార్‌లోకి ఇవాళ వచ్చిన 2 కొత్త సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్!

Today OTT Movies Telugu In Jio Hotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి ఇవాళ రెండు డిఫరెంట్ సినిమాలు వచ్చాయి. ఒకటి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అయితే, మరోటి రొమాంటిక్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. తెలుగుతోపాటు నాలుగు భాషల్లో ఈ 2 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

Published on: Aug 3, 2026, 19:39:33 IST
Advertisement

Jio Hotstar OTT Release Movies Today Telugu: డిజిటల్ యుగంలో ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు ఏం వస్తుంటాయా అని ఆడియెన్స్ ఎదురుచూస్తుంటారు. కొత్త వారం వచ్చిందంటే చాలు ఓటీటీ సినిమాలపైనే అందరి దృష్టి పడుతుంది. ఈ క్రమంలోనే ఇవాళ (ఆగస్ట్ 3) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లోకి 2 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో బీస్ట్

జియో హాట్‌స్టార్‌లోకి ఇవాళ వచ్చిన 2 కొత్త సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్!
జియో హాట్‌స్టార్‌లోకి ఇవాళ వచ్చిన 2 కొత్త సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్!

ఆ రెండు విభిన్న జోనర్లలో జియో హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటే బీస్ట్ (Beast). ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమానులను సంపాదించుకున్న 'గ్లాడియేటర్' నటుడు రస్సెల్ క్రో నటించిన 2026 మూవీ ఇది.

రిటైర్డ్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(MMA) సమరయోధుల జీవితాలు, వారు ఎదుర్కొనే కఠిన సవాళ్ల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ఈ బీస్ట్. ఏప్రిల్ 10న థియేటర్లలోకి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు రక్తం చిందే యాక్షన్ అనుభూతిని అందించింది.

79 శాతం ఫ్రెష్ కంటెంట్‌తో ఈ సినిమా ఆకట్టుకుంది. 'అమేజింగ్ రేస్ ఆస్ట్రేలియా' విజేత టైలర్ అట్కిన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రస్సెల్ క్రో స్వయంగా డేవిడ్ ఫ్రిగెరియోతో కలసి ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందించడం గమనార్హం.

ఏంటీ 'బీస్ట్' కథ?

గతంలో మాజీ ఎంఎంఏ ఛాంపియన్‌గా ఉండి, ఆ తర్వాత ఆ క్రీడకు గుడ్‌బై చెప్పి చేపల వేటను వృత్తిగా ఎంచుకున్న పాటన్ జేమ్స్ (డానియల్ మాక్‌ఫెర్సన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆపదలో ఉన్న తన సోదరుడిని కాపాడుకోవడానికి పాటన్ తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ రింగ్‌లోకి దిగాల్సి వస్తుంది. వన్ ఛాంపియన్‌షిప్‌లో బలమైన ప్రత్యర్థి ప్రాక్సీ గ్రే (బ్రెన్ ఫోస్టర్)తో తలపడేందుకు, పాటన్ తన పాత కోచ్ సమ్మీ (రస్సెల్ క్రో) వద్ద శిక్షణ పొందుతాడు. ఆ తర్వాత ఏమైందనేదే కథ.

బీస్ట్‌తోపాటు జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన మరో డిఫరెంట్ సినిమా లవ్ లైస్ బ్లీడింగ్ (Love Lies Bleeding). రొమాంటిక్, ఎరోటిక్ థ్రిల్లర్, మిస్టరీ, క్రైమ్, అడ్వెంచర్, సస్పెన్స్, డ్రామా వంటి ఎన్నో ఎలిమెంట్స్ కలయికగా ఈ సినిమాను తెరకెక్కించారు.

హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్, కేటీ ఓబ్రియన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ నియో-నోయర్ రోమాంటిక్ థ్రిల్లర్‌కు ప్రముఖ దర్శకురాలు రోజ్ గ్లాస్ దర్శకత్వం వహించారు. 2024 మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుంచి విశేష ఆదరణ లభించింది. అంతేకాకుండా 94 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా సర్టిఫికేట్ కూడా పొందింది ఈ సినిమా.

నేర ప్రపంచంలో చిక్కుకున్న ఇద్దరి కథ

1989 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో లూ (క్రిస్టెన్ స్టీవర్ట్) ఒక జిమ్ మేనేజర్‌గా పనిచేస్తుంటుంది. ఒకరోజు లాస్ వేగాస్‌కు వెళ్లే క్రమంలో ఆ ఊరికి వచ్చిన బాడీబిల్డర్ జాకీ (కేటీ ఓబ్రియన్)తో లూ ప్రేమలో పడుతుంది. అయితే వీరిద్దరి మధ్య మొదలైన ఈ అనురాగం అనూహ్య మలుపులు తిరుగుతుంది.

లూ కుటుంబానికి ఉన్న నేర చరిత్ర వల్ల వీరు అండర్ వరల్డ్ ఉచ్చులో చిక్కుకుంటారు. ఈ క్రమంలో జరిగే వరుస హింసాత్మక సంఘటనలు వీరి జీవితాలను ఎలా మార్చేశాయనేది చిత్ర కథాంశం.

లవ్ లైస్ బ్లీడింగ్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇద్దరి అమ్మాయిల లవ్ స్టోరీ, క్రైమ్ వరల్డ్ అంశాలతో తెరకెక్కిన లవ్ లైస్ బ్లీడింగ్ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ఆగస్ట్ 3న జియో హాట్‌స్టార్‌లో లవ్ లైస్ బ్లీడింగ్ ఓటీటీ రిలీజ్ అయింది. బీస్ట్‌లాగే, తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ వంటి 4 భాషల్లో లవ్ లైస్ బ్లీడింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

జియో హాట్‌స్టార్ కంటే ముందుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా లవ్ లైస్ బ్లీడింగ్ అందుబాటులో ఉంది. అందులో కూడా తెలుగు భాషలో లవ్ లైస్ బ్లీడింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, ఇప్పుడు రెండు ఓటీటీల్లో లవ్ లైస్ బ్లీడింగ్ సినిమాను తెలుగులో ఎంచక్కా చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe