JioHotstar OTT Horror Thrillers In Telugu New: న్యూ వీక్ వస్తే చాలు డిజిటల్ వేదికలపై సరికొత్త సినిమాల సందడి మొదలవుతుంది. హారర్, మైండ్-బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.
జియోహాట్‌స్టార్ ఓటీటీలో

థ్రిల్ కోరుకునే సినిమా ప్రియుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ రెండు భయానక హారర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఒకటి యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉంటే మరోటి క్రైమ్, మిస్టరీ అంశాలతో తెరకెక్కింది. సెప్టెంబర్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న హారర్ థ్రిల్లర్స్ ఏంటో తెలుసుకుందాం.
అడవిలో దాగి ఉన్న అదృశ్య శక్తి 'ది అవేకనింగ్'
కొలంబియన్ దర్శకుడు హైమే ఒసోరియో మార్కెజ్ తెరకెక్కించిన ఇంటర్నేషనల్ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'ది అవేకనింగ్ (2026)' కూడా ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చేసింది. క్లాడియో కాటానో, హిల్డా రూయిజ్, అలెజాండ్రో బుయిత్రాగో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కథాంశం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవుల్లోకి ప్రత్యర్థి లక్ష్యాన్ని మట్టుబెట్టేందుకు ఒక ప్రత్యేక సైనిక బృందం అడుగుపెడుతుంది. సాధారణ వ్యూహాత్మక ఆపరేషన్‌గా ప్రారంభమైన ఈ మిషన్, అడవి లోతుల్లో నుంచి ఉద్భవించే ఒక అతీంద్రియ శక్తి వల్ల భయంకరమైన స్వప్నంగా మారుతుంది.
500 ఏళ్ల నాటి శక్తి
500 సంవత్సరాల క్రితం స్పెయిన్‌కు చెందిన అన్వేషకుల బృందం కూడా సరిగ్గా ఇదే తరహా అదృశ్య శక్తి బారినపడి నాశనమవుతుంది. శతాబ్దాల వ్యవధి ఉన్నప్పటికీ, ఒకే ప్రాంతంలో మనుషులు ఏమాత్రం అడ్డుకోలేని ఆ ప్రాచీన 500 ఏళ్ల నాటి దుష్ట శక్తి వీరిని ఎలా వేటాడింది, అసలు అది ఎలా బయటకొచ్చింది, దాని మిస్టరీ ఏంటీ అనే అంశాలు నరనరాల్లో భయం కలిగించేలా చిత్రీకరించారు.
నరబలి, చేతబడి నేపథ్యంలో 'కర్మాఖ్య'
{{/usCountry}}500 సంవత్సరాల క్రితం స్పెయిన్‌కు చెందిన అన్వేషకుల బృందం కూడా సరిగ్గా ఇదే తరహా అదృశ్య శక్తి బారినపడి నాశనమవుతుంది. శతాబ్దాల వ్యవధి ఉన్నప్పటికీ, ఒకే ప్రాంతంలో మనుషులు ఏమాత్రం అడ్డుకోలేని ఆ ప్రాచీన 500 ఏళ్ల నాటి దుష్ట శక్తి వీరిని ఎలా వేటాడింది, అసలు అది ఎలా బయటకొచ్చింది, దాని మిస్టరీ ఏంటీ అనే అంశాలు నరనరాల్లో భయం కలిగించేలా చిత్రీకరించారు.
నరబలి, చేతబడి నేపథ్యంలో 'కర్మాఖ్య'
{{/usCountry}}బుల్లితెరపై 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన అభినయ కృష్ణ (అదిరే అభి) రచయితగా, దర్శకుడిగా కొత్త అవతారమెత్తిన సినిమా హారర్ థ్రిల్లర్ కర్మాఖ్య. సైకలాజికల్ హారర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన 'కర్మాఖ్య' ఐఎమ్‌డీబీ (IMDb)లో 8.6 రేటింగ్ సాధించి ఓటీటీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కర్మాఖ్య సినిమాలో సమైరా, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించగా సముద్రఖని, అభిరామి, మధునందన్, ధనరాజ్, ఆనంద్ భారతి కీలక పాత్రల్లో మెరిశారు. శాఖపట్నంలోని ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో అనాథ అయిన కామాఖ్య (సమైరా) నివసిస్తుంటుంది. అక్కడ కామాఖ్యకు ప్రవళిక (శరణ్య ప్రదీప్) అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది.
ఫ్రెండ్ కోసం వెళ్తే
అయితే, ఓ రోజు ప్రవళిక చేయాల్సిన ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్క్‌ను పూర్తి చేయడానికి కామాఖ్య ఊరి చివర అడవి శివార్లలోని ఒక పాత ఇంట్లో నివసించే వృద్ధ దంపతుల వద్దకు వెళ్లాల్సి వస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్లిన కామాఖ్యకు ఊహించని భయానక పరిస్థితులు ఎదురవుతాయి.
దుష్ట తంత్రాలు, భ్రమలు, నరబలుల కుట్రల నుంచి కామాఖ్య ఎలా బయటపడింది, అసలు కామాఖ్య పుట్టుక ఏంటీ, ఆమె జననం వెనుక ఉన్న రహస్యం ఏంటీ అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో కర్మాఖ్య సినిమాను తెరకెక్కించారు.
3, 5 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్
ఇకపోతే సెప్టెంబర్ 19న జియో హాట్‌స్టార్‌లో తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి 5 భాషల్లో కర్మాఖ్య ఓటీటీ రిలీజ్ అయింది. అలాగే, అదే రోజున హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, తమిళం 3 భాషల్లో ది అవేకనింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. భయంకరమైన సన్నివేశాలు, సైకలాజికల్ థ్రిల్ కోరుకునే వారు ఈ ఈ రెండు సినిమాలను ఎంచక్కా తెలుగులో వీక్షించవచ్చు.