Raghavendra Rao Behaviour With Keerthy Suresh Krithi Shetty: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రం ముహూర్తం వేడుకలో ఊహించని వివాదం రేగింది. చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సీనియర్ దర్శకుడు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.
నందమూరి కల్యాణ్ వెంకటేష్ మూవీ

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా (#VenkyAnil5 - #NKRAR2) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజులతో పాటు 84 ఏళ్ల దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా హాజరయ్యారు.
ముహూర్తపు షాట్‌కు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, గౌరవ సూచకంగా రాఘవేంద్రరావు మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. అయితే, ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సరికొత్త వివాదం రాజుకుంది.
వైరల్ వీడియో.. అసలు ఏం జరిగిందంటే?
ముహూర్తపు షాట్ డైరెక్ట్ చేసే క్రమంలో కెమెరా వెనుక నిల్చున్న రాఘవేంద్రరావు.. అక్కడ ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ చేయి పట్టుకుని తన వైపునకు గట్టిగా లాగారు. ఆ తర్వాత వెంటనే మరో హీరోయిన్ కృతి శెట్టి చేయి పట్టుకుని ముందుకు లాగుతూ.. హీరోలు వెంకటేష్, కల్యాణ్ రామ్‌ల భుజాలపై చేతులు ఎలా వేయాలో యాక్ట్ చేసి చూపించారు.
హీరోయిన్ల పట్ల ఆయన అంతగా చొరవ తీసుకుంటూ చేతులు పట్టుకుని లాగడం అక్కడి వారిని కాస్త ఇబ్బందికి గురిచేసింది. ఈ వీడియో కాస్తా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైరల్ కావడంతో నెటిజన్లు దర్శకేంద్రుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. పాత విషయాలు గుర్తుచేస్తూ..
{{/usCountry}}హీరోయిన్ల పట్ల ఆయన అంతగా చొరవ తీసుకుంటూ చేతులు పట్టుకుని లాగడం అక్కడి వారిని కాస్త ఇబ్బందికి గురిచేసింది. ఈ వీడియో కాస్తా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైరల్ కావడంతో నెటిజన్లు దర్శకేంద్రుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. పాత విషయాలు గుర్తుచేస్తూ..
{{/usCountry}}"ఆడవారి అనుమతి లేకుండా వారిని అలా తాకే హక్కు ఈ ముసలాయనకు ఎవరు ఇచ్చారు?" అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. "అసలు ఇలా ప్రవర్తించడం ఏంటి? హీరోయిన్లను తాకకుండానే సీన్ ఎలా చేయాలో వివరించవచ్చు కదా.. ఇది చూడ్డానికి చాలా అసభ్యంగా ఉంది" అని మరొకరు కామెంట్ చేశారు.
గతంలో నటి నిహారిక కొణిదెల విషయంలో కూడా రాఘవేంద్రరావు ఇలాగే ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొన్నారని, అయినా ఆయన తన పద్ధతి మార్చుకోలేదని కొందరు గుర్తుచేస్తున్నారు. "ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఆయన చేసినవన్నీ చెల్లిపోయాయి.. కానీ ఈ డిజిటల్ రోజుల్లో కూడా హీరోయిన్లతో ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకోరు" అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.
మరోవైపు సినిమా ప్రారంభంపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. "థియేటర్లలో ప్రేక్షకులను అలరించడం కంటే నాకు పెద్ద ఆనందం మరొకటి లేదు. ఎంతో సంతోషం, కృతజ్ఞత, బాధ్యతతో ఈ రోజు మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం. వేడుకకు విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు" అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
తాప్సీ పాత కామెంట్స్ మళ్లీ ట్రెండింగ్
ఈ వివాదం నడుస్తుండగానే, గతంలో హీరోయిన్ తాప్సీ పన్ను దర్శకేంద్రుడిపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 2017లో ఒక టాక్ షోలో తాప్సీ మాట్లాడుతూ, తన మొదటి సినిమా 'ఝుమ్మంది నాదం' (2010) షూటింగ్ సమయంలో రాఘవేంద్రరావు తన నడుముపై పండ్లు, కొబ్బరికాయలు వేయడంపై సెటైర్లు వేశారు.
"నా నడుముపై కొబ్బరికాయ కొట్టడంలో ఉన్న రొమాన్స్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు" అని తాప్సీ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపగా, తాను కేవలం నిజాలు మాత్రమే మాట్లాడానని తాప్సీ సమర్థించుకున్నారు.
నేటి తరం డిజిటల్ మీడియా కాలంలో ఇలాంటి ప్రవర్తనను ప్రేక్షకులు అస్సలు అంగీకరించడం లేదని తాజా వివాదం నిరూపిస్తోంది.