Kamala Nivas Serial First Night Cockroach Scene: కొన్నిసార్లు బుల్లితెరపై వచ్చే రోజువారీ సీరియల్స్ కొన్నిసార్లు ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తే.. మరికొన్నిసార్లు అస్సలు నమ్మశక్యం కాని వింత సీన్లతో షాక్‌కు గురిచేస్తుంటాయి. రేటింగుల వేటలో పడి కథకులు, దర్శకులు లాజిక్‌కు పూర్తిగా పాతర వేస్తున్నారు.
హార్పిక్‌తో స్వీట్లు

గతంలో ల్యాప్‌టాప్‌ను డిటర్జెంట్ సబ్బుతో కడగడం, హార్పిక్‌తో స్వీట్లు చేయడం, చీర కొంగు మెడకు చుట్టుకుని ఊపిరాడక చనిపోవడం వంటి విచిత్రమైన సీన్లు హిందీ సీరియల్స్‌లో చూశాం. ఇప్పుడు వాటన్నింటినీ మించిపోయేలా ఓ బెంగాలీ సీరియల్‌లో ఏకంగా హీరో బొద్దింకను నమిలి తినేసిన సీన్ సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతోంది.
శోభనం రాత్రి అసలేం జరిగిందంటే?
జీ బంగ్లా ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘కమల నివాస్’ (Kamala Nivas) సీరియల్‌లోని ఈ వింత సీన్‌తో నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి గురైంది. ధ్రువ జ్యోతి సర్కార్, సంఘతి బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్‌లో ఇటీవల ఒక విచిత్రమైన ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు.
కథ ప్రకారం హీరో, హీరోయిన్లు పెళ్లయిన తర్వాత మొదటి రాత్రి గదిలోకి అడుగుపెడతారు. ఇద్దరూ ముచ్చటించుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఒక బొద్దింక వచ్చి భార్యను కుడుతుంది. దాంతో ఆమె భయంతో గట్టిగా అరుస్తుంది. తన భార్యను కుట్టి, తమ శోభనం ముచ్చట్లకు అడ్డుపడిందనే కోపంతో హీరోకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది.
వెంటనే ఆ బొద్దింకను చేత్తో పట్టుకుంటాడు. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న పాల గ్లాసులో ఆ బొద్దింకను ముంచి, భార్య చూస్తుండగానే నోట్లో వేసుకుని నమిలేస్తాడు. ఈ సీన్ చూసి ఆ భార్యతో పాటు టీవీల ముందున్న ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు.
నెట్టింట ట్రోల్స్.. మీమ్స్‌తో ఆడుకుంటున్న నెటిజన్లు
ఈ వింత సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను సదరు ఛానల్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఈ పిచ్చి సీన్‌ను చూసిన నెటిజన్లు దర్శకుడిపై, స్క్రీన్‌ప్లే రైటర్లపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
{{/usCountry}}ఈ వింత సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను సదరు ఛానల్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఈ పిచ్చి సీన్‌ను చూసిన నెటిజన్లు దర్శకుడిపై, స్క్రీన్‌ప్లే రైటర్లపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
{{/usCountry}}"సీరియల్స్‌లో భార్యపై ప్రేమను చూపించడానికి ఇప్పుడు బొద్దింకలను కూడా తినాలా? ఈ దారుణాన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు" అని ఒక వీక్షకుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ సీరియల్‌లో కూడా
మరికొందరు నెటిజన్లు దీనిని గతంలో హిందీలో వచ్చిన సూపర్ హిట్ సీరియల్ 'సౌభాగ్యవతి భవ' లోని విరాజ్ దోబ్రియాల్ (కరణ్‌వీర్ బోహ్రా) సైకో పాత్రతో పోలుస్తున్నారు. ఆ సీరియల్‌లో కూడా భార్యను భయపెట్టడానికి విరాజ్ పాత్ర ఇలాగే బొద్దింకను తింటుంది.
"ఆ సీన్‌ను విరాజ్ దోబ్రియాల్ ఇంతకంటే బాగా చేశాడు" అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోలో ఉన్నది బొద్దింక కాదని, ఓరియో బిస్కెట్ అంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు.
టీఆర్‌పీ పిచ్చితో బుల్లితెరకు పట్టిన గ్రహణం
సాధారణంగా తెలుగు, హిందీ, తమిళ సీరియల్స్‌లో సైతం రేటింగుల కోసం వింత వింత ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ, ఈ స్థాయి అసహ్యకరమైన దృశ్యాలను కుటుంబ సమేతంగా చూసే టీవీ సీరియల్స్‌లో పెట్టడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రేమ, సెంటిమెంట్ పేరుతో ఇలాంటి విపరీత ధోరణులను స్క్రీన్ మీద చూపించడం సరికాదని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఒక్క సీన్‌తో ట్రెండింగ్
ప్రస్తుతం ఈ 'కమల నివాస్' సీరియల్ సాయంత్రం 6:30 గంటలకు జీ బంగ్లా ఛానల్‌లో ప్రసారమవుతోంది. ఓటీటీ వీక్షకుల కోసం జీ5 (Zee5) యాప్‌లో కూడా అందుబాటులో ఉంది.
వివాదాల సంగతి పక్కనబెడితే, ఈ ఒక్క సీన్‌తో ఈ బెంగాలీ సీరియల్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.