బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండి లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. సోమవారం (మార్చి 23) తన పుట్టినరోజును పురస్కరించుకుని కంగనా రనౌత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా మీట్ అయ్యారు. ఈ అపురూప ఘట్టానికి సంబంధించిన ఫోటోలను కంగనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ప్రధానితో చిరస్మరణీయమైన పుట్టినరోజు

ఈ భేటీ గురించి కంగనా రనౌత్ స్పందిస్తూ.. "గౌరవనీయులైన ప్రధానమంత్రి సమయాన్ని, ఆయన అమూల్యమైన మార్గదర్శకత్వాన్ని ఈ రోజు నా కుటుంబంతో కలిసి పొందాను. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే పుట్టినరోజు" అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఉత్సాహంగా ఆడుకుంటూ
కంగనా పంచుకున్న ఫోటోలలో ఆమె తల్లిదండ్రులు ప్రధాని ముందు వినయంగా చేతులు జోడించి కూర్చోగా, మోదీ చిరునవ్వుతో వారితో మాట్లాడుతుండటం కనిపిస్తోంది. మరో ఫోటోలో కంగనా మేనల్లుడు ప్రధాని సమీపంలో ఉత్సాహంగా ఆడుకుంటూ కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు.
ప్రధానికి ప్రత్యేక కానుకలు
ఈ సందర్భంగా కంగనా తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రధానికి అద్భుతమైన కానుకలను అందించారు. హిమాచలీ చేనేత శాలువాతో పాటు, విష్ణుమూర్తి పది అవతారాలను ప్రతిబింబించే 'విష్ణు దశావతారం' పెయింటింగ్‌ను ఆమె బహుకరించారు. ఎప్పుడూ భారతీయ చేనేత వస్త్రాలకు ప్రాధాన్యత ఇచ్చే కంగనా రనౌత్ ఈ వేడుక కోసం తెల్లటి హ్యాండ్లూమ్ శారీని (చేనేత చీర) ధరించి ఎంతో హుందాగా కనిపించారు.
సినిమా నుంచి రాజకీయం దాకా..
కాగా మార్చి 23, 1986న హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన కంగనా రనౌత్ రెండు దశాబ్దాల పాటు హిందీ చిత్రసీమలో హీరోయిన్‌గా తనదైన ముద్ర వేశారు. పలు జాతీయ అవార్డులను అందుకున్న కంగనా రనౌత్ 2024 ఎన్నికల్లో మండి నుంచి ఎంపీగా గెలుపొంది రాజకీయాల్లోకి ప్రవేశించారు.
ఇందిరా గాంధీ పాత్రలో
కంగనా స్వీయ దర్శకత్వంలో ఇందిరా గాంధీ పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' (2023) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, ఆమె నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.
తదుపరి ప్రాజెక్ట్: భారత్ భాగ్య విధాత
{{/usCountry}}కంగనా స్వీయ దర్శకత్వంలో ఇందిరా గాంధీ పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' (2023) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, ఆమె నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.
తదుపరి ప్రాజెక్ట్: భారత్ భాగ్య విధాత
{{/usCountry}}ప్రస్తుతం కంగనా రనౌత్ తన తదుపరి చిత్రం 'భారత్ భాగ్య విధాత' (Bharat Bhhagya Viddhaata) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మనోజ్ తపాడియా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో సాగుతుంది.
ఇందులో కామా అండ్ అల్బ్‌లెస్ హాస్పిటల్ స్టాఫ్ చూపిన ధైర్యసాహసాలను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాలో కంగనా ఒక నర్సు పాత్రలో కనిపించనున్నారు. 2026లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.