ఇటీవల కన్నడ నాట విడుదలై భారీ హిట్ అందుకున్న సినిమా కాంతార చాప్టర్ 1. 2022లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార 2 అంతకుమించిన సక్సెస్ కొట్టింది. కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించారు.
రిషబ్ శెట్టితోపాటు

కాంతార చాప్టర్ 1 సినిమాలో రిషబ్ శెట్టితోపాటు బ్యూటిఫుల్ రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమ్మిడి, దీపక్ రాయ్, రాకేష్ పూజారి, పూరి ప్రశాంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరించి రూపొందించారు.
వరల్డ్ వైడ్‌గా రిలీజ్
అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన కాంతార చాప్టర్ 1 మూవీ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. కన్నడతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. త్వరలో అక్టోబర్ 31న కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వెర్షన్ కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఇలా థియేటర్లలో ఉండగానే కాంతార చాప్టర్ 1 ఓటీటీ స్ట్రీమింగ్‌పై అప్డేట్ వచ్చింది. కాంతార 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ఈ అప్డేట్‌ను తాజాగా ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ కానున్నట్లు కన్ఫర్మ్ చేసింది సదరు ప్లాట్‌ఫామ్. దీనికి సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థ.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
కాంతార సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన బుటా కోలా ఆచారంలోని గెటప్పుతో ఉన్న పోస్టర్‌ను అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసింది. అందులో "లెజండ్ కొనసాగుతాడు" అని రాసి ఉంది. కింద అగ్నితో అట్రాక్టివ్‌గా ఆ పోస్టర్ ఉంది. యొక్క మూలాలను పరిశీలిస్తుంది.
లెజండరీ అవ్వాలంటే..
ఈ పోస్టర్ రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో "లెజండరీ అవ్వాలంటే.." అని క్యాప్షన్ రాసుకొస్తూ ఫైర్ ఎమోజీ యాడ్ చేసింది. ఇలా కాంతార చాప్టర్ 1 ఓటీటీ స్ట్రీమింగ్‌ను అధికారికంగా ప్రకటించి కన్ఫర్మ్ చేసింది ప్రైమ్ వీడియో సంస్థ. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
{{/usCountry}}ఈ పోస్టర్ రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో "లెజండరీ అవ్వాలంటే.." అని క్యాప్షన్ రాసుకొస్తూ ఫైర్ ఎమోజీ యాడ్ చేసింది. ఇలా కాంతార చాప్టర్ 1 ఓటీటీ స్ట్రీమింగ్‌ను అధికారికంగా ప్రకటించి కన్ఫర్మ్ చేసింది ప్రైమ్ వీడియో సంస్థ. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
{{/usCountry}}థియేట్రికల్ రన్ తర్వాత
ఇకపోతే థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత కాంతార 2 ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. త్వరలో కాంతార చాప్టర్ 1 ఓటీటీ ప్రీమియర్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్‌లోనే తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళం, ఇంగ్లీష్ వంటి ఆరు భాషల్లో కాంతార చాప్టర్ 1 ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తాజా పోస్టర్ ద్వారా తెలుస్తోంది.