...
...
Next Story

Kara OTT: ఓటీటీలోకి ధనుష్, మమితా బైజు హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్- 4 భాషల్లో, 5 రోజుల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Dhanush Kara OTT Streaming Details: ఓటీటీలోకి తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కర స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన కర క్రైమ్ ప్రపంచంలోకి మళ్లీ అడుగుపెట్టే మాజీ దొంగ చుట్టూ సాగుతుంది. కర ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: May 23, 2026, 11:08:36 IST
Advertisement

Dhanush Kara OTT Release Details: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన నటించిన వైవిధ్యమైన చిత్రాలు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. ఆ సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలానే, ఇటీవల ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలైన ధనుష్ లేటెస్ట్ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కర' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది.

ఓటీటీలోకి కర

ఓటీటీలోకి ధనుష్, మమితా బైజు హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్- 4 భాషల్లో, 5 రోజుల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ధనుష్, మమితా బైజు హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్- 4 భాషల్లో, 5 రోజుల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

వీక్‌డేలో విడుదలైనప్పటికీ, ధనుష్ మాస్ ఇమేజ్ కారణంగా థియేటర్లకు జనం క్యూ కట్టారు. ఇక థియేటర్ రన్ ముగించుకున్న కర ఓటీటీలోకి వచ్చేయనుంది. తాజాగా కర ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

'పోర్ తోళిల్' దర్శకుడి మ్యాజిక్.. కథేంటంటే?

గతంలో 'పోర్ తోళిల్' లాంటి సూపర్ హిట్ ఓటీటీ సస్పెన్స్ థ్రిల్లర్‌ను అందించిన విఘ్నేష్ రాజా కర చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక సాధారణ దొంగ చుట్టూ తిరిగే కథ ఇది. తప్పుడు మార్గాన్ని వీడి, మంచిగా బతకాలని అనుకునే ఒక మాజీ దొంగ.. ఊహించని పరిస్థితుల వల్ల మళ్లీ పాత దారిలోకి ఎలా రావాల్సి వచ్చింది అనేదే అసలు కథ.

బ్యాంకు వాళ్లు తన కుటుంబానికి చెందిన పూర్వీకుల భూమిని జప్తు చేయడంతో, ఆ భూమిని దక్కించుకోవడం కోసం మాజీ దొంగ మళ్లీ క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు, దొంగతనం ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి.

'ప్రేమలు' బ్యూటీతో పాటు భారీ తారాగణం

జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పల్లెటూరి వాతావరణం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. కర సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, సాధారణ ప్రేక్షకులు మాత్రం ధనుష్ నటనకు ఫిదా అయ్యారు.

ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులు థియేటర్లలో ఈలలు వేయించాయి. ధనుష్ రగ్గడ్ లుక్, ఎమోషనల్ పర్‌ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రం కర ఓటీటీ తెరపై అలరించేందుకు రెడీ అయిపోయింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

కర సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అంటే నెట్‌ఫ్లిక్స్‌లోనే కర ఓటీటీ రిలీజ్ అవనుంది. మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కర ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. అంటే, అందుకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. అంతేకాకుండా తమిళంతోపాటు తెలుగు , కన్నడ, మలయాళం వంటి నాలుగు భాషల్లో కర ఓటీటీ రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe