...
...
Next Story

సూర్య, జ్యోతికల ప్రేమ హద్దు దాటుతోంది, చాలామందికి ఇంట్లో తిండి కూడా పెట్టట్లేదు- హీరో కార్తీ కామెంట్స్- అన్న రియాక్షన్?

Karthi About Suriya Jyothika Love: సూర్య-జ్యోతికల 20వ పెళ్లి రోజు వేడుకలపై హీరో కార్తీ 'సీన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి అతి ప్రేమ వల్ల తమలాంటి భర్తలకు ఇంట్లో తిట్లు పడుతున్నాయని, చాలామందికి తిండి కూడా పెట్టడం మానేశారని చెప్పారు. దాంతో అన్న సూర్య రియాక్ట్ అయ్యారు.

Published on: Nov 2, 2026, 06:37:23 IST
Advertisement

Karthi About Suriya Jyothika Love: టాలీవుడ్, కోలీవుడ్‌లో అత్యంత ఆదర్శవంతమైన జంటలలో సూర్య-జ్యోతిక ఒకరు. రీసెంట్‌గా తమ 20 ఏళ్ల వైవాహిక బంధాన్ని పురస్కరించుకుని స్కాట్లాండ్‌లోని ఒక పురాతన కోటలో కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో మళ్లీ పెళ్లి (Vow Renewal) చేసుకున్నారు.

సూర్య, జ్యోతిక ఫొటోలు వైరల్

సూర్య, జ్యోతికల ప్రేమ హద్దు దాటుతోంది, చాలామందికి ఇంట్లో తిండి కూడా పెట్టట్లేదు- హీరో కార్తీ కామెంట్స్- అన్న రియాక్షన్?
సూర్య, జ్యోతికల ప్రేమ హద్దు దాటుతోంది, చాలామందికి ఇంట్లో తిండి కూడా పెట్టట్లేదు- హీరో కార్తీ కామెంట్స్- అన్న రియాక్షన్?

ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా సూర్య నటిస్తున్న 'సీన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమ్ముడు, హీరో కార్తీ చేసిన కామెంట్స్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"చాలామందికి ఇంట్లో తిండి కూడా పెట్టలేదు!"

వేదికపై కార్తీ మాట్లాడుతూ అన్న, వదినల ప్రేమాయణంపై సరదాగా పంచ్‌లు వేశారు. "వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ కొంచెం హద్దులు దాటుతోంది. వీళ్లు చేసే పని వల్ల సమాజంలోని మిగతా భర్తలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. స్కాట్లాండ్ వేడుక ఫొటోలు చూశాక మా ఇంట్లో నన్ను ఎలా తిట్టారో చెప్పలేను. ‘సూర్యని చూడు.. నువ్వు చూడు’ అంటూ ఇంట్లో వాళ్లు క్లాస్ పీకారు. చాలామందికి ఇంట్లో తిండి కూడా పెట్టలేదు" అని కార్తీ వేదికపై చమత్కరించారు.

అయితే ఆ వేడుక చూడటానికి చాలా అద్భుతంగా అనిపించిందని చివరిగా హీరో కార్తీ ముగించారు. కార్తీ కామెంట్లకు సూర్య, జ్యోతిక దంపతులు నవ్వుతూనే ఉండిపోయారు. తమ్ముడు కార్తీ కామెంట్లకు స్పందించిన సూర్య తన భార్య జ్యోతికపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.

జ్యోతికపై సూర్య భావోద్వేగ కామెంట్స్

సూర్య బాక్సాఫీస్ రికార్డులు.. తదుపరి 'సీన్'!

ఒకప్పుడు ‘సూరరై పోట్రు’, ‘జై భీమ్’ వంటి చిత్రాలతో ఓటీటీలో అదరగొట్టినా థియేటర్లలో ‘కంగువ’, ‘రెట్రో’లతో సూర్యకు తీవ్ర నిరాశ ఎదురైంది. కానీ, ఈ ఏడాది సూర్య బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులు సృష్టించారు.

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో త్రిషతో కలిసి నటించిన ‘కరుప్పు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 310 కోట్ల కలెక్షన్లు సాధించి ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూ. 209 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూర్య సత్తాను చాటింది.

హ్యాట్రిక్ సాధిస్తారని అభిమానుల కోరిక

ఇప్పుడు ఇదే ఊపులో ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో సూర్య 'సీన్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నజ్రియా నజీమ్, నస్లేన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నవంబర్ 6న థియేటర్లలోకి రానుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న సూర్య ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks