కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కాంచన నిర్ణయాన్ని తనకే వదిలేస్తున్నానని, కానీ, కొడుకుగా కలిసి ఉండాలని కోరుకుంటాను అని కార్తీక్ చెబుతాడు. ఆరోగ్యం బాలేనప్పుడు నాన్‌వెజ్ తినడం మానేసింది ఉదాహరణగా చెప్పి నిర్ణయాలు తీసుకునేది పాటించడానికే అని, కేవలం మిమ్మల్ని పిలిచింది కాశీ, స్వప్నలను కలపడానికి అని కాంచన అంటుంది.
కాశీ ఇక్కడే ఉంటాడు

స్వప్న నాకు పుట్టకపోయిన నా కూతురు లాంటిదే. కాశీతో స్వప్నను కలపాలి. కాశీ ఇక్కడే ఉంటాడు అని కాంచన చెబుతుంది. శ్రీధర్ వెళ్తానంటే కాశీ ఇక్కడ ఉన్నట్లు స్వప్నకు చెప్పకండని కాంచన అంటుంది. వంట చేసి కాశీకి అన్నం పెట్టు, స్నానం చేసి నా బట్టలు వేసుకుంటాడు అని దీపతో అంటాడు కార్తీక్. బావ అని కాశీ అంటే తర్వాత మాట్లాడదామని కార్తీక్ అంటాడు.
దీప చేతికి బ్యాండేజ్ చూసిన కాంచన నువ్వు రక్తం ఇచ్చావా అని అడుగుతుంది. సుమిత్ర కోసం దీప బ్లండ్ శాంపిల్స్‌కు ఇచ్చిన బ్యాండేజ్ చూపిస్తుంది. గైనకాలజస్ట్ దగ్గరికి వెళితే టెస్ట్ కోసం దీప బ్లడ్ తీసుకున్నారని, బిడ్డ ఎదుగుదల బాగుందని కార్తీక్ కవర్ చేస్తాడు. దాంతో కాంచన సంతోషిస్తుంది. సుమిత్ర ఆరోగ్యం గురించి అడుగుతుంది కాంచన.
ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వేసుకుంటే రోగం ముదరదు. వేసుకోకుంటే నిద్రలోనే ప్రాణం పోయే ప్రమాదం ఉందని, కానీ మావయ్య జాగ్రత్తగా చూసుకుంటాడు అని కార్తీక్ అంటాడు. నా భయమంతా జ్యోత్స్న మీదే ఉందని దీప అనుకుంటుంది. మరోవైపు సుమిత్ర దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న పారు అన్న మాటలు తలుచుకుంటుంది.
నువ్వు ఉంటేనే ప్రమాదం
నేను ఇన్ని కష్టాలు పడేది నీకోసమే. నీకు క్యాన్సర్ వచ్చినప్పటినుంచి నాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఈ ట్యాబ్లెట్ వాడితే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లంట్ జరిగే వరకు నీ ప్రాణాలకు ఏం కాదని డాక్టర్ చెప్పింది. అసలు నువ్వు ఉంటేనే ప్రమాదం మమ్మీ. అందుకే నీకు ట్యాబ్లెట్స్ వేయకుండా వేస్ట్ చేయాలనుకుంటున్నాను. నీ అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాను అని చెత్తబుట్టలో సుమిత్ర ట్యాబ్లెట్స్ వేస్తుంది జ్యోత్స.
{{/usCountry}}నేను ఇన్ని కష్టాలు పడేది నీకోసమే. నీకు క్యాన్సర్ వచ్చినప్పటినుంచి నాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఈ ట్యాబ్లెట్ వాడితే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లంట్ జరిగే వరకు నీ ప్రాణాలకు ఏం కాదని డాక్టర్ చెప్పింది. అసలు నువ్వు ఉంటేనే ప్రమాదం మమ్మీ. అందుకే నీకు ట్యాబ్లెట్స్ వేయకుండా వేస్ట్ చేయాలనుకుంటున్నాను. నీ అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాను అని చెత్తబుట్టలో సుమిత్ర ట్యాబ్లెట్స్ వేస్తుంది జ్యోత్స.
{{/usCountry}}అది దశరథ్ చూస్తాడు. తండ్రిని చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. ట్యాబ్లెట్స్ ఎందుకు డస్ట్ బిన్‌లో ఎందుకు వేశావ్ అని దశరథ్ నిలదీసాడు. పారిజాతం వస్తే దశరథ్ నిజం చెబుతాడు. దాంతో పారు తిడుతుంది. ఇంతలో శివ నారాయణ కూడా వచ్చి నిలదీస్తాడు. కింద పడిన ట్యాబ్లెట్స్ పని చేస్తాయా అని రివర్స్‌లో జ్యోత్స్ననే నిలదీస్తుంది. ఇంతలో సుమిత్ర నిద్ర లేస్తుంది.
జ్యోత్స్న చేసింది దశరథ్ చెబుతాడు. అన్ని పడేసినట్లు మాట్లాడతరేంటీ అని ఒక్క ట్యాబ్లెట్ చూపిస్తుంది జ్యోత్స్న. అన్ని పడేసింది కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని దశరథ్ అనుకుంటాడు. ట్యాబ్లెట్ ఉంది కదా దశరథ అని పారు అంటుంది. నా భార్యను నేను చూసుకుంటాను. లేదా దీప, కార్తీక్ చూసుకుంటారు. ఒక చిన్న హెల్ప్ చేయమ్మా. నువ్వు ఈ రూమ్‌కి రావొద్దమ్మా. ఏదైనా అవసరం ఉంటే నేనే పిలుస్తాను అని జ్యోత్స్నతో దశరథ్ అంటాడు.
జ్యోత్స్న భయపడుతోంది
దాంతో జ్యోత్స్న వెళ్లిపోతుంది. జ్యోత్స్న నిన్ను చూస్తూ భయపడుతుంది. అందుకే వద్దన్నా అని దశరథ్ అంటాడు. నిజమేనండి అని సుమిత్ర అంటుంది. ఏ ప్లాన్ వర్కౌట్ కావట్లేదు అని జ్యోత్స్న చిరాకు పడుతుంది. అన్నింటికి ఒకటే సొల్యూషన్. వెళ్లి దాసుతో మాట్లాడాలి. గ్రానీకి కూడా చెప్పకుండా వెళ్లాలి అని రాత్రిపూట మెల్లిగా చీకట్లో ఎవరు చూడకుండా వెళ్తుంది జ్యోత్స్న.
డోర్ తీయగానే ముసుగుతో పారిజాతం దర్శనం ఇస్తుంది. పారును చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. నిన్ను ఓ కంట కనిపెట్టడానికే ఇక్కడ ఉన్నా అని పారు అంటే.. ఇలా చేయమని ఎవరు చెప్పారని జ్యో అంటే నేనే అని కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఈ టైమ్‌లో ఎక్కడికే వెళ్తున్నావ్ అని పారు అంటుంది. బావ అడగమంటే అడుగుతావా అని జ్యో అంటుంది.
పారు అని కార్తీక్ అనగానే జ్యోత్స్నను లాగిపెట్టి కొడుతుంది పారిజాతం. ఆన్సర్ రాకుంటే ఈ పీజే పీకుతుంది అని కార్తీక్ చెప్పినట్లే చేస్తుంది పారిజాతం. ఫ్రెండ్ దగ్గరికి అని జ్యో అంటే కార్తీక్ నమ్మట్లే అంటాడు. నమ్మట్లేదట అని జ్యోత్స్నను ఎడాపెడా కొడుతుంది పారిజాతం. నిజం చెప్పేదాకా వాయించేస్తుంది పారిజాతం.
పారును మెచ్చుకున్న శివ నారాయణ
చచ్చేలా ఉన్నానని జ్యోత్స్న ఆపుతుంది. ఇంతలో దశరథ్, శివ నారాయణ వస్తారు. ఈ టైమ్‌లో జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుందో అడగండి అని శివ నారాయణ అంటాడు. నిద్ర పట్టక నైట్ రైడ్‌కు వెళ్తున్నాను అని జ్యోత్స్న అంటుంది. పారిజాతం అరిచి లోపలికి వెళ్లవే అని తిడుతుంది. నచ్చావ్ పారిజాతం. చాలా రోజులకు మంచి పని చేస్తున్నావ్. నిన్ను అభినందిస్తున్నాను అని శివ నారాయణ అంటాడు.
పారు మురిసిపోతుంది. జ్యోత్స్ను లోపలికి లాక్కెళ్తుంది పారిజాతం. శివ నారాయణ కూడా వెళ్తాడు. కార్తీక్‌తో దశరథ్ మాట్లాడుతాడు. మరోవైపు తను చెప్పినట్లు చేస్తే దాసును కనిపెడతానన్నాడు కార్తీక్ అని పారు చెబుతుంది.
మరోవైపు జ్యోత్స్న ట్యాబ్లెట్స్ వేయడం నేను చూశాను. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లాలనుకుంది. జ్యోత్స్న ఎందుకు భయపడుతుంది. దాసు ఏమయ్యాడు, దాసును జ్యోత్స్న ఎందుకు చంపాలని చూసింది, దీపపై ఎటాక్ చేయించింది ఎవరు, జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అని కార్తీక్‌కు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు దశరథ్.
రెండోసారి టెస్ట్‌లు
నేను మళ్లీ టెస్ట్‌లు చేయించబోతున్నాను అని దశరథ్ అంటే.. సరేనని కార్తీక్ అంటాడు. ఆల్రెడీ దీపతో టెస్ట్ చేయించాను. అత్త సేఫ్ అని కార్తీక్ అనుకుంటాడు. అత్తకేం కాదు. నా బిడ్డను ఊయలలో వేయాల్సింది మీరే అని దశరథ్‌కు ధైర్యం చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.