...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: శౌర్యకు జ్యోత్స్య ట్యూషన్, ఇరుక్కున్న పారు- సూరజ్ తల్లిదండ్రులపై కార్తీక్ ఆరా- జ్యోపై పగ

Karthika Deepam 2 Serial July 4th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూలై 4వ ఎపిసోడ్‌లో దక్షిణామూర్తితో మాట్లాడొద్దని సూరజ్‌పై చాలా సీరియస్ అవుతాడు శివ నారాయణ. శౌర్యకు వచ్చిన మార్కులపై జ్యోత్స్న ఎగతాళి చేస్తుంది. శౌర్యకు జ్యోనే ట్యూషన్ చెప్పాలని తాత ఆర్డర్ వేస్తాడు. పారును ఇరికించి జ్యో వెళ్లిపోతుంది.

Published on: Jul 4, 2026, 07:35:39 IST
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో శివ నారాయణ రెస్టారెంట్స్ బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ పోటీగా తన బ్రాంచ్స్ ఓపెన్ చేశానని దక్షిణామూర్తి చెప్పి వెళ్లిపోతాడు. మా బ్రాంచ్ సీక్రెట్స్ ఎలా తెలిసాయి. ఆఫీస్‌లో దక్షిణామూర్తి మనిషి ఎవరైనా ఉన్నారా అని శివ నారాయణ అనుమానపడతాడు.

సూరజ్‌పై సీరియస్

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 4 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జూలై 4 ఎపిసోడ్

అప్పుడే బయట దక్షిణామూర్తితో సూరజ్ మాట్లాడుతాడు. అది చూసిన శివ నారాయణ షాక్ అవుతాడు. ఇదంతా కార్తీక్, దీప చూస్తారు. సూరజ్ వెళ్లిపోతుంటే నువ్వు దక్షిణామూర్తి మనిషివా అని నిలదీస్తాడు శివ నారాయణ. దక్షిణామూర్తి ఎవరని సూరజ్ అంటాడు. ఇప్పటివరకు నువ్వు మాట్లాడిన వ్యక్తి, అతను నీతో ఏం మాట్లాడాడు అని శివ నారాయణ అడుగుతాడు.

ఆయన అడిగిన దానికి చెప్పాను. అతను మీ ఇంట్లో విషయాలు గురించి అడిగాడు. ఇలాంటి వివరాలు నన్ను అడగొద్దు మా సర్ లోపలే ఉన్నాడు కావాలంటే అడగండని చెప్పాను. వద్దులే అని వెళ్లిపోయాడు అని సూరజ్ అంటాడు. ఇకనుంచి ఆ మనిషితో ఎప్పుడు మాట్లాడకు అని శివ నారాయణ అంటాడు. ఎందుకు అని సూరజ్ అంటే. మాట్లాడొద్దని చెప్పానుగా అని చాలా సీరియస్ అయి సూరజ్‌పై అరుస్తాడు శివ నారాయణ.

ఏమైంది సర్ అని సూరజ్ అంటుంటే.. బ్రదర్ ఇటు రా అని కార్తీక్ పిలుస్తాడు. నా మీద ఎందుకు అంత సీరియస్ అయ్యారని సూరజ్ అడుగుతాడు. అది తర్వాత చెబుతానను సూరజ్‌ను తీసుకెళ్తాడు కార్తీక్. ఇకనుంచి నేనే నీకు పోటీ అని దక్షిణామూర్తి చెప్పింది గుర్తు చేసుకుని ఆలోచిస్తాడు శివ నారాయణ. ఇంతలో శౌర్య వస్తుంది.

శౌర్యకు జ్యో ట్యూషన్

దాంతో జ్యో షాక్ అవుతుంది. కార్తీక్ నవ్వుతాడు. శౌర్యకు నీకు సంబంధం లేదు అయిన మాట్లాడావ్. ఏ నోటితో శౌర్య చదువు ఎగతాళి చేశావో అదే నోటీతో శౌర్యకు ట్యూషన్ చెప్పు. ఇది నా ఆర్డర్ అని శివ నారాయణ వెళ్లిపోతాడు. శౌర్యకు ట్యూషన్ చెప్పేందుకు జ్యో కూర్చుంటుంది. మిస్ జ్యో అంటూ పిలుస్తుంది శౌర్య. కార్తీక్ పంచులు వేస్తాడు.

శౌర్య అడిగే ప్రశ్నలకు జ్యోత్స్న తలపట్టుకుంటుంది. నీలాంటి మేధావికి ట్యూషన్ చెప్పడం నావల్ల కాదని జ్యో అంటుంది. అంతలో పారిజాతం వస్తుంది. పిల్లలకు చదువు చెప్పడం ఒక ఆర్ట్ అని పారు అంటే.. అయితే నువ్వు కూర్చుని చెప్పు అని కూర్చొబెట్టి పోతుంది జ్యోత్స్న. కార్తీక్, దీప కూడా వెళ్లిపోతారు. పారిజాతంను జ్యో ఇరికించి పోతుంది.

సూరజ్ తల్లిదండ్రుల గురించి ఆరా

మరోవైపు సూరజ్ గురించి కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. సూరజ్ సొంత విషయాలు తెలుసుకోమన్న కదా. ఇప్పుడు అడగమని కార్తీక్‌తో అంటుంది దీప. సూరజ్‌ది ఏ ఊరు, మీ అమ్మనాన్న గురించి తెలుసుకుందామని, నీది కచ్చితంగా పెద్ద ఫ్యామిలీనే అయింటుంది. లేకుంటే ఇంత మంచి లక్షణాలు ఎలా వస్తాయని కార్తీక్ అంటాడు.

నాకంటూ చెప్పుకునే వాళ్లు ఎవరు లేరు. కానీ, ఇప్పుడు నాకు అన్నయ్య, వదిన ఉన్నారు. అది మీరే అని సూరజ్ అంటాడు. నా ఒంటరి జీవితంలో దేవుడు ఇచ్చిన కొత్త బంధాలు. నన్ను నువ్వు ఎవరి తాలూకా అని చెప్పుకునేదానికి బంధం దొరికిందని సూరజ్ అంటాడు. తర్వాత దక్షిణామూర్తి గురించి చెబుతానని చెప్పావని సూరజ్ అంటే.. కార్తీక్ చెబుతాడు.

ప్రస్తుతం వీళ్లిద్దరు బద్ద శత్రువులు అని, కొట్టుకునేంత శత్రువులు. ఆయన విషయంలో మనల్ని ఎవరు అనుమానించకుండా చూసుకోవాలి. అనుమానం రానివ్వకూడదని అంటున్నా. పెద్ద పెద్ద సంస్థలు ఇతరులకు అమ్ముడుపోవడం వల్లో, భయపడటం వల్ల నాశనం అయ్యాయని కార్తీక్ అంటాడు. అలాంటి భయాలు నా విషయంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదని, నీతో ఉన్న బంధాన్ని జీవితాంతం కాపాడుకుంటామని సూరజ్ అంటాడు.

కుటుంబంలా కలిసిపోయింది నాకోసమే

ఇంతలో జ్యో వచ్చి ఏంటో ఆ బంధం అని అడుగుతుంది. దీప, కార్తీక్ వదిన అన్నయ్య అని చెబుతాడు. మీరు కుటుంబం అవుతారని ఎప్పుడో ఊహించా. అవసరానికి ఏర్పడే బంధాలు ఎక్కువ కాలం నిలబడవని జ్యో అంటుంది. మా బంధం అభిమానంతో పుట్టిందని సూరజ్ వెళ్లిపోతాడు. అన్నింట్లో దూరిపోతావేంటీ ఎలకపిల్లలా అని కార్తీక్ అని కూడా వెళ్లిపోతాడు.

మీరంతా కలిసిపోయింది నన్ను అంతం చేయడానికే అని తెలుసు బావ. మీరెంతమంది అయినా సరే నేను ఒక్కదాన్ని చాలు సమాధానం చెప్పడానికి అని జ్యోత్స్న అనుకుంటుంది. మరోవైపు పారు పద్యాలు పాడుతుంది. శౌర్య ఇరిటేట్ అవుతుంది. పారిజాతం మాటలకు శౌర్య పంచులు వేస్తుంది. పుస్తకంలోని పదాలకు అర్థాలు అడుగుతుంది శౌర్య.

పారిజాతం తప్పుగా చెబితే తప్పని శౌర్య అంటుంది. పద్యానికి మీనింగ్ అడిగితే పారు తప్పుగా చెబుతుంది. శౌర్య కరెక్ట్ చెబుతుంది. పారిజాతానికే శౌర్య ట్యూషన్ చెప్పినట్లు అవుతుంది. అదంతా విన్న శివ నారాయణ వెరీ గుడ్ అని శౌర్యను మెచ్చుకుంటాడు. శివ నారాయణ కూడా చంటిదే నీకు చెబుతుందని అంటాడు. శౌర్య ఇకనుంచి నువ్వు పారిజాతానికి ట్యూషన్ చెప్పమని వెళ్లిపోతాడు శివ నారాయణ.

జ్యోకి పెండింగ్ ఫైల్స్

అలాగే, శౌర్య ట్యూషన్ చెబుతుంది. మరోవైపు పెండింగ్ ఫైల్స్ అన్ని జ్యోత్స్న టేబుల్‌పై పెట్టి మీరు స్టడీ చేయాలని చెబుతాడు కార్తీక్. ఇది సీఈఓ దీప ఆర్డర్ అని అంటాడు. వీటిని బాగా స్టడీ చేసి ఫైల్స్ అన్నీ అప్డేట్ చేసి పేపర్లన్నీ కొత్తగా ప్రింట్ అవుట్ తీసి ఫైల్ చేసి పెద్దసారుకు ఇవ్వమన్నారని కార్తీక్ అంటాడు. చేస్తాను తప్పుతుందా. ఇంకో వారం ఇదే పని అని జ్యోత్స్న అంటుంది.

అంత టైమ్ లేదు. రేపు ఉదయమే పెద్దసారుకు ఇవ్వాలట. సీఈఓ ఆర్డర్ అని కార్తీక్ అంటాడు. తాత వేసిన శిక్ష గుర్తుకు వచ్చి చేస్తానంటుంది. ఇంతకంటే మేము ఎక్కువే చేశాం. మీరు తిని తిరగడం తప్పా ఏనాడైనా వర్క్ చేశారా అని సెటైర్లు వేస్తాడు కార్తీక్. నువ్వు మీ ఆవిడ కలిసి నా మీద పాత పగలు తీర్చుకుంటున్నారా అని జ్యోత్స్న అంటుంది.

నిజంగా పగ తీర్చుకోవాలనుకుంటే బాలరాజు గాడి గురించి సుమిత్ర అత్తకు ఎప్పుడో చెప్పేవాన్ని. చెప్పలేదంటే మారడానికి అవకాశం ఇచ్చాం. అది ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవడం మంచిది. లేకుంటే దీపను మీ నానమ్మ ఎక్కడ వదిలేసిందో నిన్ను అక్కడే వదిలేస్తారు అని కార్తీక్ అంటాడు. అంటే చెత్తకుప్పే అని కార్తీక్ ఇన్‌డైరెక్ట్‌గా అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe