...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపను తోసేసిన జ్యోత్స్న- దీపకు సుమిత్ర సేవలు- దీపే వారసురాలని పారిజాతంతో నోరు జారిన జ్యో!

కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 22 ఎపిసోడ్‌లో దీప చేతుల మీదుగా హోమంలో పూర్ణాహుతి పడటంతో జ్యోత్స్న పెద్ద రచ్చ చేస్తుంది. ఆఖరికి గురువు గారు దాని వల్లే మంచే జరిగిందని చెబుతాడు. కోపంతో దీపను తోసేస్తుంది జ్యోత్స్న. స్పృహ తప్పిపోయిన దీపకు సుమిత్ర సేవలు చేస్తుంది. పారుతో జ్యోత్స్న నోరు జారుతుంది.

Published on: Nov 22, 2025, 07:52:35 IST
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో హోమంలో పూర్ణాహుతిని పడకుండా కింద పడేసేలా జ్యోత్స్న చేస్తే హోమంలోనే పడేటట్లు దీప చేస్తుంది. అంతా షాక్ అవుతారు. దీప చేత్తోనే హోమం పూర్తి అయిందని దాసు, కార్తీక్ సంతోషిస్తారు. దాసు వెళ్లిపోతాడు. దీపను పారిజాతం అనబోతుంటే శివ నారాయణ పూజ కానివ్వని అంటుంది.

నీ నుంచి జారితే దీప పట్టుకుంది

కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 22వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 22వ తేది ఎపిసోడ్

పంతులు వెళ్తానంటే.. జ్యోత్స్స ఆపి హోమం ఇంటి వారసురాలు చేతులతో పూర్తి కాలేదు. ఇంటి పని మనిషి దీపతో అయిందని అంటుంది. దీప వేసింది కానీ, కావాలని వేసిందా. నీ చేతులో నుంచి జారిపోతుంటే దీప పట్టుకోబోయింది. దాంతో హోమంలో పడింది అని కార్తీక్ అంటాడు. ఈవిడ అసలు పట్టుకుంటే కదా. ఆలోచనలన్నీ ఎక్కడో అని స్వప్న అంటుంది.

నోర్ మూయవే పిల్లకుంకా అని పారు అంటే.. కాశీ కోప్పడతాడు. నోర్ మూయిరా సన్నాసి అని పారు అంటుంది. మా అల్లుడిని అంటే ఊరుకోమని కావేరి అంటుంది. నువ్వు తప్పు చేసి దీపను అంటావేంటని జ్యోత్స్నను దశరథ్ అంటాడు. అంటే నేను తప్పులు చేస్తుంటే దీప వచ్చి కరెక్ట్ చేసిందంటారు అని జ్యోత్స్న అంటుంది.

నువ్వు కావాలని తప్పు చేస్తే దీప కరెక్ట్ చేసిందనుకోవచ్చు. నువ్వు కావాలనే తప్పు చేశావా అని శివ నారాయణ అంటాడు. అడుగుతున్నారుగా చెప్పు. పూర్ణాహుతి సరిగ్గా పట్టుకునే బాధ్యత నీది కాదా అని సుమిత్ర కూడా అంటుంది. జ్యోత్స్న అలాగే పెద్ద రచ్చ చేస్తుంది. పూర్ణాహుతి కింద పడితే అరిష్టం అన్నారు. మరి ఈమె చేతులమీదుగా పడితే అరిష్టం కాదా అని జ్యోత్స్న అంటుంది. కాదమ్మా అని గురువు అంటాడు.

మనుషుల కోరికలతోనే

దాంతో అంతా సంతోషిస్తారు. జ్యో, పారు మాత్రం రగిలిపోతారు. చెప్పు దీప నీకే అందరూ వత్తాసు పలుకుతున్నారు. నువ్వు ఏం చేసిన నన్ను ఫూల్‌ను చేయడానికేగా అని దీపను తోసేస్తుంది. దీప కిందపడిపోతుంది. అంత దీపను లేపుతారు. దీప స్పృహ తప్పిపోతుంది. జ్యోత్స్నను కోపంగా పారు చూస్తుంది. జ్యోత్స్న నువ్వు అసలు మనిషివేనా అని శివ నారాయణ తిడతాడు.

తర్వాత దీప కళ్లు తెరుస్తుంది. దీపను లోపల పడుకోబెట్టమని సుమిత్ర చెబుతుంది. కొన్ని జీవితాలు అంతేనేమో మంచి చేసి కూడా బాధపడాలి అని కార్తీక్ అంటడు. దీప పడుకుని ఉంటుంది. అందరికి ప్రసాదం పెట్టమని సుమిత్ర అంటే సరే మమ్మీ అని జ్యో అంటుంది. నీకు చెప్పానా. స్వప్న అందరికి ప్రసాదం పెట్టు. అత్తయ్య జ్యోత్స్నను పక్కకు తీసుకెళ్లు అని సుమిత్ర అంటుంది.

దీపకు సుమిత్ర సేవలు

దాంతో జ్యోత్స్నను పారు తీసుకెళ్తుంది. దీప చేయి రుద్దుతూ సుమిత్ర సేవలు చేస్తుంది. అందరిని బయటకు వెళ్లమని, దీపతో తానుంటానని సుమిత్ర చెబుతుంది. ముందు దీపను కోలుకోనివ్వండి, దీనికి కారణమైన వాళ్లను ఏం చేయాలో చూద్దాం అని శివ నారాయణ అంటాడు. జ్యోత్స్నను తిడుతుంది పారిజాతం. ఎప్పుడు ఏదో పెంట చేసి ఛీ అనిపించుకుంటున్నావ్ పారు అంటుంది.

ఎవరి చేత్తో పడిన పర్లేదు కానీ దీప చేత్తో పడకూడదు అని జ్యోత్స్న అంటుంది. ఎందుకు, దాన్ని కూడా వేరే అనుకోవచ్చుగా అని పారు అంటుంది. అనుకోను. ఎందుకంటే దీపే ఈ ఇంటి అని జ్యోత్స్న ఆగిపోతుంది. చెప్పవే దీప ఎవరు అని పారు అంటుంది. ఈ ఇంటి పని మనిషి. అదంటే నాకు పడదు అని జ్యో అంటుంది. దీపను ఏం చేయకుంటే వారసురాలి స్థానాన్ని కూడా పోగొట్టుకుంటాను అని జ్యో నోరు జారుతుంది.

అదేంటీ అదెలా. నువ్వు దాసు కూతురు అని తెలియాలి. లేదా సుమిత్ర కూతురు బతికి రావాలి. ఈ రెండు కాకుండా నువ్వు వారసురాలి స్థానం కోల్పోతావ్ అని పారు అడుగుతుంది. నీ కొడుకు దీపకు చెబితే అని జ్యోత్స్న అంటుంది. దీప ఇంకా స్పృహలోకి రాలేదు. నువ్వు ఎదురుపడితే కార్తీక్ గాడు కొట్టిన కొడతాడు అని పారు అంటుంది. అది ఇంకా నాటకం ఆడుతుంది అని ఇంకా రగిలిపోతుంది జ్యోత్స్న.

ప్రసాదం పెట్టని స్వప్న

అందరికి ప్రసాదం పెట్టి కాశీకి పెట్టదు స్వప్న. అది చూసిన కార్తీక్ కాశీకి కూడా ప్రసాదం పెట్టమని చెబుతాడు. స్వప్న పెడుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe