...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపకు పుట్టబోయే బిడ్డను చంపేస్తానన్న జ్యోత్స్న- 2 కోట్లు మాయం, జ్యోని నిలదీసిన శ్రీధర్

కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 27 ఎపిసోడ్‌లో శివ నారాయణకు ధైర్యం చెబుతాడు కార్తీక్. కోపంతో రగిలిపోయిన జ్యోత్స్న దీపకు పుట్టబోయే బిడ్డను కడుపులోనే చంపేస్తానని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. ఇంటికి వచ్చిన శ్రీధర్ కంపెనీ నుంచి జ్యో అకౌంట్‌లోకి 2 కోట్ల 34 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని చెబుతాడు.

Published on: Nov 27, 2025, 07:56:03 IST
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో గురువు గారు చెప్పిన ప్రమాదం గురించి కార్తీక్‌తో చెబుతాడు శివ నారాయణ. ఎవరి మొహం చూసిన భయంగా ఉంది. అప్పుడు కాంచన గుర్తొచ్చింది. తను చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందం నుంచి తను బయటకు రావొద్దురా అని శివ నారాయణ అంటాడు.

ఎవ్వరికి ఏం కానివ్వను

కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 27వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ నవంబర్ 27వ తేది ఎపిసోడ్

ముందు ఆ భయంలో నుంచి రా. నువ్వే చెబుతావుగా దైవ సంకల్పం గొప్పదని. మన ఇంట్లో వాళ్లకు, నాకు పుట్టబోయే బిడ్డ వరకు ఎవరికి ఏం కానివ్వను. ఒకవేళ నీ కలలలోకి ప్రమాదం వస్తే ఇంటి గుమ్మం ముందు పోతురాజులా నా మనవడు ఉన్నాడు. నువ్వు వాన్ని దాటి రావాలని చెప్పు, నేను ఆ ప్రమాదం చూసుకుంటాం అని కార్తీక్ అంటాడు.

కత్తికంటే పదునుగా ఉన్నాయిరా నీ మాటలు. చిన్నప్పుడు చీకటిని చూసి భయపడొద్దని నీకు చెప్పాను. చావును చూసి భయపడొద్దని నాకు చెబుతున్నావు. నా పౌరుషం నీలోనూ కూడా ఉందిరా. ఇంక నాకు ఏ భయం లేదురా ఆనందంగా ఉంటాను అని శివ నారాయణ మెచ్చుకుంటాడు. జ్యోత్స్న రూపంలోనే పెద్ద ప్రమాదం ఉంది తాత అని కార్తీక్ మనసులో అనుకుంటాడు.

మరోవైపు సుమిత్ర కొట్టినదానికి జ్యోత్స్న ఏడుస్తుంటుంది. మీ అమ్మ కొట్టినందుకు బాధగానే ఉన్నా నిన్ను కొట్టడంలో తప్పులేదే అని పారు అంటుంది. దాంతో కోపంగా పారిజాతం పీకమీద కత్తి పెట్టి ఇప్పుడు చెప్పు ఆ మాట అని జ్యోత్స్న బెదిరిస్తుంది. కత్తిని ఇంకా పీకమీదకు లాక్కుని మీ అమ్మ నిన్ను కొట్టడంలో తప్పే లేదు అని గట్టిగా చెబుతుంది పారిజాతం.

కడుపులో బిడ్డ బయటకు రాకుంటే

బావ వారసత్వం దీప కడుపులో ఉండకూడదు అని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడు రాముడు అంత బలంగా కార్తీక్ గాడు ఉన్నాడు. ఏ చిన్న అనుమానం వచ్చిన మరదలివి అని కూడా చూడడు అని పారు హెచ్చరిస్తుంది. ఆ దీప మీద పగ తీర్చుకోకుంటే నా అంత చేతకాని దద్దమ్మ ఉండదు. దీప కడుపులో బిడ్డకు కడుపులోనే నూరేళ్లు నిండిపోవాలి. నేనైతే ఆ దీప బిడ్డను ఈ లోకాన్ని చూడనివ్వను అని తెగేసి చెబుతుంది జ్యోత్స్న.

మరోవైపు దీప కోపంగా ఉంటుంది. జ్యోత్స్న గురించి దీప అంటుంటే సుమిత్ర వస్తుంది. దీప బాధ గురించి మాట్లాడుతుంది సుమిత్ర. దీప మీద జ్యోత్స్నకు ఉంది ఈర్శ్య. మూర్ఖులు మనకేం తక్కువ అనుకుంటారు. సీఈఓ పదవి కూడా పోయింది. మావయ్యకు చెప్పాను మంచి సంబంధం చూడాలని అని సుమిత్ర అంటుంది. మనసు మారకపోతే మనిషి ఎక్కడున్నా అంతే అని దీప అంటుంది.

జ్యోత్స్న మారాలి

మంచి మాట చెప్పావు. ముందు జ్యోత్స్న మారాలి. ఆ ప్రయత్నం నేను చేస్తాను. కానీ, నువ్వు నాకు మాట ఇవ్వాలి. అనవసరమైన బాధలు కడుపులో మోయకు. తల్లి అయిన ప్రతి ఆడదాని కోరిక ఏంటో తెలుసా తన తల్లిని చూడాలని. తోడుగా కన్నతల్లి ఆ ఆనందమే వేరు అని సుమిత్ర అంటుంది. దూరంగా ఉన్నవాళ్లను కనిపించినవారిలో చూసుకోవచ్చుగా అని దీప అంటుంది.

తర్వాత ఇంట్లో జరిగిన గొడవ గురించి కాంచనకు చెప్పకని సుమిత్ర వెళ్లిపోతుంది. ఓ వైపు ఆనందం మరోవైపు బాధ ఉన్నాయని దీప చెబుతుంది. ఇదే మరదలా జీవితం అంటే అని కార్తీక్ అంటాడు. దాంతో కిచెన్‌లో కార్తీక్, దీప హగ్ చేసుకుంటారు. మరోవైపు శ్రీధర్ వస్తాడు. జ్యోత్స్నను పిలవమంటాడు. జ్యోత్స్న వస్తుంది. శ్రీధర్ పలకరించిన జ్యో పలకదు.

దశరథ్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో జ్యో పలకరిస్తుంది. ఇంట్లో ఏదో గొడవ జరిగినట్లుంది. మనకెందుకులే. వచ్చిన పని చూసుకుని పోదామనుకుంటాడు శ్రీధర్. కంపెనీ అకౌంట్స్ చూశాను. క్లోజింగ్ బ్యాలెన్స్‌లో కొంత అమౌంట్ టాలీ కావడం లేదు. కొంత డబ్బు మిస్ అయింది. 2 కోట్ల 34 లక్షలు మిస్ అయిందని శ్రీధర్ చెబుతాడు.

ట్రస్ట్‌కు ఇచ్చిందేమో

కంపెనీ అకౌంట్ నుంచి మాజీ సీఈఓ గారి అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయినట్లు ఉంది. అది ఎందుకో మాజీ సీఈఓనే చెప్పాలి అని శ్రీధర్ అంటాడు. అంత డబ్బు ఏం చేశావని అందరూ అడుగుతారు. ఏదైనా ట్రస్ట్‌కు ఇచ్చిందేమో. అసలే దానికి దాన గుణం ఎక్కువ అని పారిజాతం అంటుంది. ట్రస్ట్‌కు పర్సనల్ అకౌంట్ నుంచి పంపించరు కంపెనీ అకౌంట్ నుంచే పంపిస్తారు అని కార్తీక్ అంటాడు.

కంపెనీ డబ్బు వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేసు పెట్టడం కాదు పెట్టాలి. అది కూడా చైర్మన్ గారే పెట్టాలి అని కార్తీక్ అంటాడు. అల్లుడని సీఈఓ పదవి ఇస్తే ఇంట్లో మంట పెట్టాడు అని శ్రీధర్‌ను అంటుంది పారు. కార్తీక్ కౌంటర్స్ వేస్తాడు. జ్యోత్స్నను కొట్టి ఇంత జరుగుతుంటే మాట్లాడవేంటే అని పారిజాతం అరుస్తుంది.

ఆ డబ్బులతో ల్యాండ్ కొన్నాను. ఆ ల్యాండ్ సుమిత్ర కోసం కొన్నాను. మమ్మీకి మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్ కింద ఇద్దామనుకున్నాను అని జ్యోత్స్న చెబుతుంది. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం అని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe