Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న చేసిన పనికి మళ్లీ డౌట్‌తో సూరజ్ పర్స్ చూస్తుంది మాలిని. అందులో జ్యో ఫొటో కనిపించదు. సూరజ్ ఎప్పుడు మాలిని కొడుకుగానే ఉంటాడని అనుకుంటుంది. కానీ, టేబుల్‌పై పర్స్ పెట్టిన మాలిని బెడ్ మీద ఉన్న దిండు తీసి చూస్తుంది. దిండు కింద జ్యోత్స్న ఫొటో ఉంటుంది.
జ్యోత్స్న కనిపించకూడదు

దాంతో మరింత షాక్ అవుతుంది మాలిని. జ్యోత్స్న చేసిన ఛాలెంజ్ గుర్తుచేసుకుంటుంది. జ్యోత్స్న చెప్పింది నిజమే అనుకున్న మాలిని తన బాడీగార్డ్ విజయ్‌తో జ్యోత్స్న కనిపించకూడదని అంటుంది. మీ కంటికి కనిపించకూడదా ఎవరి కంటికి కనిపించకూడదా. ఏం చేసిన ఆధారాలు కనిపించవు. దీప యాక్సిడెంట్ లాగే అని విజయ్ అంటాడు.
దాంతో మాలిని అలాగే చూస్తుండిపోతుంది. మరోవైపు శివ నారాయణ కాళ్లకు నొప్పులున్నాయని కార్తీక్ మర్ధన చేస్తాడు. కానీ, తాత కోప్పడతాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి నొప్పులున్నాయంటే డాక్టర్ కాళ్లు పట్టుకుని ట్రీట్‌మెంట్ చేస్తాడుగా. ఇది కూడా అలాగే అని కార్తీక్ అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు డాక్టర్ బాబువా అని శివ నారాయణ అంటాడు.
నేను చేసేది వైద్యమే అని కార్తీక్ అంటాడు. పారిజాతాన్ని పిలుస్తాడు తాత. లేదని చెబుతాడు. దశరథ, సుమిత్ర వస్తారు. మనవడు నొక్కుతున్నాడంటే ఊరుకోండి. లేదంటే ఖరీదు కట్టండని కార్తీక్ అంటాడు. దీపకు చేతులతో దండం పెట్టి మరి మీరు మా దగ్గర ఉండకండి. భరించలేకపోతున్నామని శివ నారాయణ అంటాడు. అయినా కార్తీక్ వినడు.
శివ నారాయణ కాళ్లకు మర్ధన
ఇక చేసేదేం లేక శివ నారాయణ అలాగే పడుకుని ఉండిపోతాడు. హాయిగా శివ నారాయణ పడుకుంటాడు. దీప, కార్తీక్ ఎమోషనల్ అవుతారు. మరోవైపు జ్యోత్స్నకు సూరజ్ కాల్ చేస్తే జ్యో లిఫ్ట్ చేయదు. దాంతో అర్జంట్‌గా మాట్లాడాలని, వెంటనే కాల్ చేయాలని మెసేజ్ చేస్తాడు సూరజ్. అయినా రిప్లై ఉండదు. చాలా సేపు చూసి సూరజ్ సహనం కోల్పోతాడు.
{{/usCountry}}ఇక చేసేదేం లేక శివ నారాయణ అలాగే పడుకుని ఉండిపోతాడు. హాయిగా శివ నారాయణ పడుకుంటాడు. దీప, కార్తీక్ ఎమోషనల్ అవుతారు. మరోవైపు జ్యోత్స్నకు సూరజ్ కాల్ చేస్తే జ్యో లిఫ్ట్ చేయదు. దాంతో అర్జంట్‌గా మాట్లాడాలని, వెంటనే కాల్ చేయాలని మెసేజ్ చేస్తాడు సూరజ్. అయినా రిప్లై ఉండదు. చాలా సేపు చూసి సూరజ్ సహనం కోల్పోతాడు.
{{/usCountry}}నేను నిన్ను కాల్ చేయమంది నువ్వు నాకు పీఏగా పనికిరావని. జాబ్ మానేయ్. కేఫ్‌లో మా అమ్మ జాబ్ తీయించేసిందిగా. ఆ జాబ్ నేను ఇప్పిస్తాను. నువ్వు నా దగ్గర జాబ్ మానేయ్. దయచేసి మళ్లీ ఆఫీస్‌కు రాకు. కనిపిచంకు అని సూరజ్ కోపంగా మెసేజ్ చేస్తాడు. అప్పుడే వచ్చిన దక్షిణామూర్తి ఎందుకురా అంత కోపమని అడుగుతాడు. తను పంతంతో తప్పా పని చేయాలని జాబ్‌లో చేరలేదని సూరజ్ అంటాడు.
తనకు చాలా పొగరు. ఇప్పటివరకు రిప్లై లేదు. దీన్ని పీఏగా పెట్టుకోగలనా అని అంటాడు. అయితే భార్యను చేసుకో. జ్యోత్స్న మనసులో నువ్వున్నావ్. నీ మనసులో కూడా జ్యో ఉంది. జ్యోత్స్న పీఏ అయితే ఇంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే ప్రశ్నించుకో. జ్యోత్స్న మనమధ్య లేదు. కానీ మన మాటల్లో ఉంది. అది ఎవరు తీసుకొచ్చారు. జ్యోత్స్న నీ మాటల్లో కాదు నీ మనసులో ఉంది అని వెళ్లిపోతాడు దక్షిణామూర్తి.
టిఫిన్ బండి దగ్గర సుమిత్ర పని
దిండు కింద ఉన్న జ్యోత్స్న ఫొటో చూసి.. మళ్లీ దిండు పెట్టేస్తాడు సూరజ్. మరుసటి రోజు ఉదయం శివ నారాయణ ఇడ్లీ బండి దగ్గర దశరథ, సుమిత్ర పని చేస్తారు. దశరథ ఆర్డర్స్ ఇస్తే సుమిత్ర ప్లేట్స్ తోముతుంది. అది చూసిన శివ నారాయణ మనసుకు కష్టంగా ఉందంటాడు. ఆ మాటలు కార్తీక్, దీప వింటారు. ఇంటి కోడలితో పని చేయించాలని నాకు లేదమ్మా అని శివ నారాయణ అంటాడు.
మన కుటుంబం కోసం కలిసి పనిచేసుకుంటున్నాం. అత్తయ్య గారు ఉన్నప్పుడు రానివ్వలేదు. ఇప్పుడైనా చేయనివ్వండని. మన తలరాతను మనమే సరిదిద్దుకుందామని సుమిత్ర అంటుంది. నా కోడలువనిపించావమ్మా అని తాత అంటాడు. మనల్నీ తాత సాయం చేయనివ్వడు అని కార్తీక్ అంటాడు. నాకు మాలినిని చూస్తే కోపంగా ఉంది. ఏం గతి పట్టించాడు నా కుటుంబానికి అని దీప అంటుంది.
ఇంతలోనే దక్షిణామూర్తి, మాలిని, సూరజ్ వస్తారు. దక్షిణామూర్తి దగ్గరికి వెళ్తే ఎవరో వచ్చారు. ఆర్డర్ తీసుకోండని సుమిత్ర అంటుంది. ఆ మనిషి నా టిఫిన్ గొంతు దిగదని శివ నారాయణ అంటాడు. దక్షిణామూర్తి కోపంగా అరుస్తాడు. ఇంతలో కార్తీక్ వచ్చి కస్టమర్స్ ఉన్నారు. అనవసరంగా బిజినెస్ పాడవుద్దని కార్తీక్ ఆపుతాడు. అనసవరమైన చెత్తంతా నా బండి ముందే ఉంది ఛీ అని శివ నారాయణ అంటాడు.
గొడవ చేసేందుకే తీసుకొచ్చింది
ఇంటికెళ్లండి తాత అని కార్తీక్ అంటే.. నువ్వు చెప్పాల్సింది చెప్పావ్. నేను వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్తానని దక్షిణామూర్తి అంటాడు. సుమిత్ర కూరగాయలు కట్ చేస్తుంది. కస్టమర్స్ వెళ్లేదాక దక్షిణామూర్తి వెయిట్ చేస్తుంటాడు. జ్యోత్స్న కనిపించడం లేదు. ఇంట్లో ఉన్నట్టుందని సూరజ్ అనుకుంటాడు. మాలిని అత్త గొడవ చేయడానికే తీసుకొచ్చినట్టుందని కార్తీక్‌తో దీప అంటుంది.
నీతో మాట్లాడాలని సుమిత్రతో దక్షిణామూర్తి అంటే.. ఇది నా ఇల్లు కాదు నా బంధువు కాదని సుమిత్ర అంటుంది. మాలిని, సూరజ్ అరిస్తే గట్టిగా సమాధానం చెబుతుంది సుమిత్ర. నేను నీకు జన్మనిచ్చిన తండ్రినమ్మా. ఒక యువరాణిలా పెంచుకున్నా. అలాంటి నా కూతురుని టిఫిన్ ప్లేట్స్ కడిగించే పరిస్థితికి తీసుకొచ్చాడు ఈ దౌర్భాగ్యుడు అని దక్షిణామూర్తి అంటాడు.
దాంతో గరిట పట్టుకుని కోపంగా కొట్టేందుకు వెళ్తాడు శివ నారాయణ. కార్తీక్, దశరథ, సుమిత్ర ఆపుతారు. వీళ్లకు అందంగా సమాధానం చెబితే సరిపోదని దశరథ అంటాడు. ఎక్కడ చెప్పారు. మీ నాన్న గరిట తీశాడు. లేదా షర్ట్ చింపుతారని మాలిని అంటుంది. నా భర్తను అంటే ఊరుకోను అని సుమిత్ర అంటుంది. టిఫిన్ బండి దగ్గర పనిచేయించే ఈ దద్దమ్మను అంటే నీకెందుకమ్మా కోపం అని దక్షిణామూర్తి అంటాడు.
మీరంతా ఒక్కటేగారా
నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే షర్ట్ చించడం కాదు డొక్కచించి డోలు కడతా అని శివ నారాయణ అంటాడు. ఇంటికోడలిని పని మనిషిని చేస్తావురా. ఇదేనా నీ గౌరవం. నేను నా కూతురుని తీసుకెళ్తాను. అమ్మా సుమిత్ర నాతో వచ్చేయ్ అని దక్షిణామూర్తి అంటాడు. మా తాత మంచి మూడ్‌లో ఉన్నాడు కాబట్టి ఏమనలేదు. మీరు వెళ్లిపోండని కార్తీక్ అంటాడు.
మీ ఇంటికి రాలేదుగా వెళ్లిపోమ్మనడానికి అని సూరజ్ అంటాడు. నీలాంటివాడిని ఇంటి వాకిట్లోకి కూడా రానివ్వకూడదని శివ నారాయణ అంటాడు. నీ మామతో నా కొడుకు మాటలుపడేంత అవసరం లేదని మాలిని అంటే.. అలా అయితే ఇక్కడికి వాళ్లను తీసుకురావు అత్త అని దీప అంటుంది. కుటుంబం కోసం కష్టపడుతున్నా మావయ్య కోసం సహాయంగా నిల్చున్న అత్తలో తప్పేముంది తాత అని కార్తీక్ అంటాడు.
బిడ్డకు తల్లిచ్చే పాలల్లో కూడా నీళ్లు కలిసాయని నిరూపించే సమర్ధులురా వీళ్లు. వీళ్లను నువ్వు నిలదీయాల్సిన అవసరం లేదు. మీరు మీరు ఒక్కటేగా అని శివ నారాయణ అంటాడు. అవును కార్తీక్, దీప మా మనుషులే అని మాలిని అంటుంది. అత్త ఆపు నీకు దండం పెడతానని పెడుతుంది దీప. నీ కొడుకు రాజేసిన మంటలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. మళ్లీ నువ్వు తాటాకాలు వేయకు అని దీప అంటుంది.
సిగ్గులేదు నీకు
నువ్వెందుకు వదిన మా అమ్మను అంటావ్. మా అత్త పనిచేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం అని సూరజ్ అంటాడు. దానికి సుమిత్ర చప్పట్లు కొడుతుంది. శభాష్‌రా మేనల్లుడా. ఈ అత్తపై నీకున్న ప్రేమ చూస్తుంటే మాటలు రావట్లేదురా అని సుమిత్ర అంటుంది. నీ మీద మాకెప్పుడు ప్రేమ అభిమానం ఉంటాయని మాలిని అంటుంది.
ఈ మాట అనడానికి సిగ్గులేదు నీకు అని సుమిత్ర అంటుంది. సుమిత్ర అని మాలిని అరిస్తే.. నోర్మూయ్.. అని నేను నిన్ను అనలేను.. ఎంత కాదనుకున్నా నువ్వు నా అన్నయ్య భార్యవి. బంధుత్వాలు మర్చిపోయి మీరు మృగాళ్లలా ప్రవర్తించారు గానీ మేము మనుషుల్లా ప్రవర్తించాం అని సుమిత్ర అంటాడు. అత్త మాటలు జాగ్రత్తగా రాని మాట్లాడేది మా అమ్మతో అని సూరజ్ అంటాడు.
అయితే ఏంటీ.. అయితే ఏంటీ.. నీ మాటలు కూడా జాగ్రత్తగా రాని. నువ్వు మాట్లాడేది మా అమ్మతో.. అని దీప అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.