...
...
Next Story

Karthika Deepam 2: కార్తీక దీపం 2- మాలిని కొడుకే సూరజ్- అంతా తల్లీకొడుకుల స్కెచ్- కంపెనీ నుంచి జ్యోత్స్నతో పెళ్లి వరకు!

Karthika Deepam 2 Serial Updates: కార్తీక దీపం 2 సీరియల్‌లో రోజు రోజుకీ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. సూరజ్, దక్షిణామూర్తి, మాలిని వంటి మూడు సరికొత్త పాత్రలతో సీరియల్‌పై క్యూరియాసిటీ పెంచేశారు. అయితే.. మాలిని కొడుకే సూరజ్ అని, వారు చేసేదంతా వారి స్కెచ్‌లో భాగమనిపిస్తోంది. అది ఎందుకో ఇక్కడ చూద్దాం.

Published on: Jul 12, 2026, 06:11:50 IST
Advertisement

Karthika Deepam 2 Serial Updates: కార్తీక దీపం 2 సీరియల్ ఇంతకుముందు కంటే ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోంది. ఇంతకముందు జ్యోత్స్న, ఆస్తి, దీప వారసురాలు అంటూ చెప్పిందే చెప్పి కాస్తా విసిగించారు. కానీ, ఎప్పుడైతే సూరజ్ పాత్ర కార్తీక దీపం 2లోకి ఎంట్రీ ఇచ్చిందో సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.

పర్‌ఫెక్ట్ హీరో

కార్తీక దీపం 2 సీరియల్ విశ్లేషణ
కార్తీక దీపం 2 సీరియల్ విశ్లేషణ

జ్యోత్స్న లాంటి విలన్‌కు పర్‌ఫెక్ట్ హీరో అనిపించేలా, మరికొన్ని సార్లు అతనే మెయిన్ విలనా అనే అనుమానాలు వచ్చేలా క్యారెక్టర్‌ను బాగా డిజైన్ చేశారు. సూరజ్ తర్వాత సుమిత్ర తండ్రి అంటూ దక్షిణామూర్తి ఎంట్రీ ఇవ్వడం, శివ నారాయణ కుటుంబంతో గొడవ, మాట్లాడని కూతురు వంటి సీన్లతో బాగా రక్తికట్టించారు.

వీరిద్దరి తర్వాత సరికొత్తగా మాలిని అనే క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పాత్ర రాకతో అటు ఫ్యామిలీ పరంగా, ఇటు బిజినెస్‌కు సంబంధించి మంచి సస్పెన్స్ డ్రామాను బిల్డప్ చేశారు మేకర్స్. అయితే, ఇప్పటివరకు అయిన ఎపిసోడ్స్‌ను బట్టి చూస్తే దక్షిణామూర్తి మనవడు సూరజ్ అని ఒకానొక సమయంలో డౌటానుమానం వచ్చేసింది.

ఆ తర్వాత మాలిని ఎంట్రీ, దక్షిణామూర్తి కొడుకు భార్య అని తేలింది. దక్షిణామూర్తి మనవడే సూరజ్ అనే డౌట్ వచ్చినప్పుడు కచ్చితంగా అతను మాలిని కొడుకు అని ఈజీగా అర్థమైపోతుంది. పైగా జ్యోత్స్నను లవ్ చేస్తున్నట్లు వెంటపడటం, నిన్నటి ఎపిసోడ్‌లో బావ అనే అనుకో అని జ్యోకి సూరజ్ చెప్పే మాటలతో దాదాపు మాలిని కొడుకే సూరజ్ అని హింట్ వచ్చేసింది.

స్కెచ్ ఫలితమే

అంటే, పెళ్లికి దోష నివారణ కోసం గుడికి వెళ్తాననని శివ నారాయణ ఇంట్లో సూరజ్ అనడం, జ్యోత్స్న పెళ్లి కోసం తాత కూడా వెళ్దామనడం, కట్ చేస్తే గుడిలో దక్షిణామూర్తి సుమిత్ర కోసం హోమం చేయడం అంతా పకడ్బందీగా ప్లాన్ చేసిందని నిన్నటి ఎపిసోడ్‌లో మాలిని మాట్లాడిన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

సుమిత్ర దగ్కరికి వచ్చేందుకు, సుమిత్ర మంచి కోసం గుడిలో హోమం జరిపిద్దామని దక్షిణామూర్తికి సలహా ఇచ్చిందే మాలిని. ఎందుకంటే అదే రోజు శివ నారాయణ కుటుంబం గుడికి వచ్చేలా ఆల్రెడీ సూరజ్‌తో చేయించేసింది కాబట్టి.

మాలిని మాటల ప్రకారం

శనివారం నాటి ఎపిసోడ్‌లో "ఏది తెలియకుండా జరగలేదు (సుమిత్ర గుడికి రావడం) మావయ్య అన్ని తెలిసే జరిగాయ్. ఇకనుంచి అన్నీ తెలిసే జరుగుతాయ్. కానీ నాకు తెలిసినట్లు మీకు తెలియదు అంతే" అని మాలిని అంటుంది. ఈ మాటలకు అర్థం దక్షిణామూర్తికి తెలియకుండా సూరజ్‌తో కలిసి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

శివ నారాయణ ఇంట్లోంకి ఎంటర్ అవ్వడం, కంపెనీలో దీప పక్కన చేరడం నుంచి జ్యోత్స్నతో పెళ్లి జరిపించుకోడవం వరకు అంతా తల్లీకొడుకులు మాలిని సూరజ్ వేసిన పెద్ద స్కెచ్ అని తెలుస్తోంది. మేన కోడలిని కొడుకుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు విడిపోయిన కుటుంబాన్ని కలిపేందుకు ఇద్దరు ఇలాంటి స్కెచ్ వేసినట్లు ఓ వైపు అనిపిస్తోంది.

మరోవైపు బాలా రెస్టారెంట్‌ను ఇబ్బందిపెట్టి లాక్కోవడం మాలిని మంచిదా చెడ్డదా అనే డౌట్ వస్తుంది. సూరజ్ కూడా చాలాసార్లు మంచివాడిలానే బిహేవ్ చేసిన ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇచ్చేది తెలియదు. ఇదంతా పక్కన పెడితే సూరజ్‌తో ఈ ప్లాన్ అంతా దక్షిణామూర్తికి తెలియకుండా చేస్తున్నట్లు మాలిని మాటలను బట్టి అర్థమవుతోంది.

కొంతవరకే తెలుసేమో

అలాంటప్పుడు శివ నారాయణ ఇంట్లో, కంపెనీలో సూరజ్‌ను చూసి దక్షిణామూర్తి ఏం తెలియనట్లు ఎందుకు ఉన్నాడనేది పెద్ద సందేహం. మాలిని మాటల ప్రకారం దక్షిణామూర్తికి కొంతవరకే తెలుసు పూర్తిగా అసలు ప్లాన్ ఏంటనేది తెలియదు అని అనుకోవాలేమో మరి. కార్తీక దీపం 2 నవ వసంతం సీరియల్‌లో ఇంకెన్ని ట్విస్టులు వస్తాయో ముందు ముందు చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks