...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..సూరజ్ మిస్టరీ గిఫ్ట్-పెళ్లి కాగానే జన్మ రహస్యం చెప్పేస్తానన్న జ్యోత్స్న

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ కథలో పెద్ద మిస్టరీనే సాగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో జ్యోత్స్న, సూరజ్ పెళ్లికి మాలిని వస్తుంది. జ్యోకు సూరజ్ ఓ మిస్టరీ గిఫ్ట్ ఇస్తాడు. ఇక పెళ్లి కాగానే నిజం చెప్పేస్తానని జ్యోత్స్న షాక్ ఇస్తుంది.

Published on: Aug 26, 2026, 07:09:29 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 26 ఎపిసోడ్ లో.. జ్యోత్స్న, సూరజ్ ల పెళ్లికి వెళ్లేందుకు మాలిని రెడీ అవుతుంది. దక్షిణామూర్తిని రావొద్దని చెప్తుంది. మొదటి శుభలేఖ అందుకున్న మిత్రుడిని, వియ్యంకుడిని నేను రాకపోతే ఎలా అని దక్షిణామూర్తి అడుగుతాడు.

పెళ్లికి మాలిని

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

మీరు అక్కడికి వచ్చిన ప్రతిసారి మీకు అవమానమే జరుగుతుంది. అక్కడ మర్యాద ఇవ్వడంలో కానీ పలకరింపులో కానీ మిమ్మల్ని ఎలా అవమానించాలో శివ నారాయణకు తెలుసు. మీ కూతురు, అల్లుడు పలకరించరు. అందరూ మిమ్మల్ని వెతుక్కుని వచ్చేలా చేస్తా. ఈ సారి మీరు తలెత్తుకునే పని చేస్తానని దక్షిణామూర్తికి మాలిని చెప్తుంది. క్షేమంగా వెళ్లి అనుకున్నది సాధించుకుని రా అని మాలినికి చెప్తాడు మామయ్య.

సూరజ్ గిఫ్ట్

మరోవైపు పెళ్లి కూతురిగా ముస్తాబైన జ్యోత్స్న దగ్గరకు సూరజ్ వెళ్తాడు. జ్యోకు సూరజ్ గిఫ్ట్ ఇస్తాడు. మనసుతో ఇస్తున్నా. తర్వాత ఓపెన్ చేయమని జ్యోకు చెప్తాడు. ఇద్దరం పక్కపక్కనే ఉండి తర్వాత ఓపెన్ చేద్దామని జ్యో అంటుంది. ఇది నువ్వు ఒక్కదానివే ఓపెన్ చేస్తావ్. నీకు అది తర్వాత తెలుస్తుంది అని ఏదో రహస్యాన్ని దాచినట్లే సూరజ్ మాట్లాడతాడు.

జ్యో సిగ్గు

మనం ప్రేమికులుగా ఉండే ఆఖరి రోజు ఇది. తర్వాత మన పెళ్లి అయిపోతుంది. అప్పుడు భార్యాభర్తలుగా ఉంటాం. అప్పుడు కొత్త అధికారాలు వస్తాయి. నువ్వు నన్ను టచ్ చేయలేదు. ముద్దు పెట్టుకోలేదు. కానీ నువ్వు రూమ్ లోకి రాగానే ఏదో ఫీలింగ్. నిన్ను చూడాలనుకుంటున్నా కానీ చూడలేకపోతున్నా. ఇవి ప్రేమలో ఉండే ఫీలింగ్స్. కానీ పెళ్లి తర్వాత ఇవన్నీ మారిపోతాయని జ్యో సిగ్గుపడుతూ చెప్తుంది.

ప్రపోజ్ చేసిన జ్యోత్స్న

జ్యోత్స్న అంటే జాబిలి. సూరజ్ అంటే సూర్యుడు. ఆకాశం మన జీవితమైతే ఒకడే సూర్యుడు. ఒకటే జాబిలి. నువ్వు వెలుగునివ్వు. నేను వెన్నెలనిస్తా. నన్ను నీలోకి తీసుకో సూరజ్ అని జ్యోత్స్న అంటుంది. పెళ్లి అయిన తర్వాత తీసుకుంటానని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు. ఒకప్పుడు నువ్వు ఇచ్చిన ఫ్లవర్ ను కాలు కింద వేసి తొక్కేశానని తీసుకోవడం లేదా? అని జ్యో అడుగుతుంది. ఓకే అని పువ్వు తీసుకొని వెళ్లిపోతాడు సూరజ్.

శివ నారాయణ కౌంటర్లు

ఇక పెళ్లి పనుల్లో అందరూ బిజీగా ఉంటారు. సూరజ్ ను పెంచి పెద్ద చేసిన పెద్దయ్యను శివ నారాయణ ఆహ్వానిస్తాడు. సూరజ్ కు చెప్పుకోదగ్గ బంధువు ఆయనే అని శివ నారాయణ అంటాడు. అప్పుడే నమస్తే బాబాయ్ అంటూ మాలిని ఎంట్రీ ఇస్తుంది. నా మేనకోడలి పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటానని మాలిని అంటుంది. మాలినిని ముందు వరుసలో కూర్చోబెట్టు దీప. వెనుకాల కూర్చుంటే పెళ్లి కనిపించదు కదా అని శివ నారాయణ కౌంటర్లు వేస్తాడు.

సొంత ఆడపడుచు నిన్ను పట్టించుకోలేదు. వరుసకు అన్నయ్య అయిన దశరథ నిన్ను చెల్లి అని పిలవలేదని మాలినితో మాట్లాడుతూ సెటైర్లు వేస్తాడు కార్తీక్.

దాసు ఆశీర్వాదం

చేతిలో కొబ్బరి బోండంతో వస్తున్న జ్యోత్స్న తన కన్న తండ్రి దాసు దగ్గరకు వెళ్తుంది. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా అని దాసు పొంగిపోతాడు. నాకు నీ ఆశీర్వాదం కావాలి నాన్న అని జ్యోత్స్న అంటుంటే దాసు ఆపుతాడు. నాకు దీవించే యోగ్యత లేదమ్మా. నా లాంటి తండ్రిని చీదరించుకున్నావు కదా అని దాసు అంటాడు. మరో జన్మలో కూడా నీకే పుడతానని జ్యోత్స్న ఫీల్ అవుతుంది.

నిజం చెప్పేస్తా

నువ్వే నా తండ్రివి అని నిజం చెప్పేస్తానని జ్యో షాక్ ఇస్తుంది. ఏంటి నాన్న నీకు చెప్పుకోవాలని లేదా అని దాసును అడుగుతుంది. లేదమ్మా, దశరథ అన్నయ్య కూతురుగా ఉంటేనే నీకు ఈ వైభోగం, గౌరవం దక్కుతాయని దాసు అంటాడు. ఏదో ఒక రోజు నేను వీళ్ల కూతురిని కాదని చెప్పాలి కదా. ఇప్పటికే కొన్ని జీవితాలు మన తప్పుల కారణంగా చీకటిలో ఉన్నాయి. చేసిన పాపాలు కడుక్కోవాలి. దశరథ కూతురిగా పెళ్లి చేసకుంటా. దాసు కూతురిగా బతుకుతానని జ్యోత్స్న చెప్తుంది.

నా మెడలో తాళి పడిన వెంటనే నిజం చెప్పేస్తానని జ్యోత్స్న అంటుంది. నీ ఇష్టం అమ్మా అని దాసు కంగారు పడతాడు. జ్యోత్స్నతో మాట్లాడతానని పారు అంటే.. ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదని జ్యో షాక్ ఇస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe