Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. పెళ్లి కాగానే నిజం చెప్పేస్తానని జ్యోత్స్న అంటుంది. దీంతో పారిజాతం షాక్ అవుతుంది. పారు మాట్లాడాలని అడిగినా జ్యోత్స్న నో చెప్తుంది. నేను దాసు కూతురిని అని అందరికీ చెప్పేస్తా. తాళి నా మెడలో పడిన వెంటనే చేసే ఫస్ట్ పని అదే అని దీపకు జ్యో చెప్తుంది.
మనిషిలా మారాను దీప

నేను అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ నీకు చెందాల్సినవే. మా అమ్మ చనిపోయింది కానీ నేను అమ్మానాన్నలతో ఉంటున్నా. నీకు అమ్మ ఉంది. కానీ నువ్వు అనాథగా బతికావ్. చాలా బాధలు పడ్డావ్. నా కోసం చాలా చేశావ్. రుణం తీర్చుకోవాలి కదా. నేను మనిషిలా మారాను దీప. నా సూరజ్ నన్ను అర్థం చేసుకుంటాడని జ్యోత్స్న చెప్తుంది.
మాట తీసుకున్న జ్యోత్స్న
నాలో ఈ మార్పు నీకు నచ్చడం లేదా దీప అని జ్యోత్స్న అడుగుతుంది. నచ్చిందని జ్యోత్స్నను దగ్గరకు తీసుకుని చెంపపై దీప ముద్దు పెడుతుంది. ఈ సీన్ అదిరిపోతుంది. నిజం చెప్పిన తర్వాత ఏం జరిగినా సరే మనం తోబుట్టువులాగే ఉందాం. అలాగే చూస్తానని మాటివ్వు అని దీప దగ్గర జ్యోత్స్న మాట తీసుకుంటుంది.
పారు టెన్షన్
మరోవైపు నిజాలు బయటపడితే ఏమైనా ఉందా? శివ నారాయణ ఊరుకోడని దాసుతో మాట్లాడుతూ పారిజాతం వణికిపోతుంది. జ్యోత్స్న పెళ్లి పారిజాతం చావుకు వచ్చింది. నువ్వు అయోమయం కొడుకువి. కూతురును కాదనలేవ్, తల్లిని వదులుకోలేవ్. జ్యోత్స్న ఏమైనా చేసుకోని, నువ్వు మాత్రం తండ్రిని అని చెప్పకూడదని తనపై ఒట్టు వేయించుకుంటుంది పారిజాతం.
కాంచన బాధ్యత
పెళ్లి కార్యక్రమం మొదలవుతుంది. నీళ్లు ఇవ్వమని పంతులు అడిగితే మాలిని పైకి లేస్తుంది. మాలినిని కాంచన ఆపుతుంది. నిన్ను ఎక్కడికి వెళ్లకుండా చూడమని దీపకు మా నాన్న చెప్పాడు. దీప బాధ్యత నేను తీసుకున్నానని కాంచన చెప్తుంది. నేను ఎక్కడికి వెళ్తాను కాంచన? మీ వదినకు సాయం చేద్దామనుకుంటున్నా. కాళ్లు పని చేయకపోయినా నోరు, చేతులు బాగానే పని చేస్తున్నాయని అవమానిస్తుంది మాలిని.
దీప సొంతిల్లు
{{/usCountry}}పెళ్లి కార్యక్రమం మొదలవుతుంది. నీళ్లు ఇవ్వమని పంతులు అడిగితే మాలిని పైకి లేస్తుంది. మాలినిని కాంచన ఆపుతుంది. నిన్ను ఎక్కడికి వెళ్లకుండా చూడమని దీపకు మా నాన్న చెప్పాడు. దీప బాధ్యత నేను తీసుకున్నానని కాంచన చెప్తుంది. నేను ఎక్కడికి వెళ్తాను కాంచన? మీ వదినకు సాయం చేద్దామనుకుంటున్నా. కాళ్లు పని చేయకపోయినా నోరు, చేతులు బాగానే పని చేస్తున్నాయని అవమానిస్తుంది మాలిని.
దీప సొంతిల్లు
{{/usCountry}}దీప ఈ ఇంటిని తన సొంతిల్లు అనుకుంటుంది. దశరథ, సుమిత్రను సొంత అమ్మానాన్నలాగే చూసుకుంటుందని కాంచన చెప్తుంది. ఇంకా నయం, ఇది నీ కోడలికి పుట్టిల్లు లాంటిది అనలేదని మాలిని అంటుంది. అలాగే అనుకో, ఏం పిన్ని నువ్వేమంటావ్? అని పారును కాంచన అడుగుతుంది. ఎవరి భయాలు వాళ్లకు ఉన్నాయని పారు టెన్షన్ పడుతుంది.
పెళ్లి ఆపేద్దామని
పారును లాగి పక్కన కూర్చోబెట్టుకుంటుంది మాలిని. ఇష్టం లేకపోతే చెప్పు పెళ్లి ఆపేద్దామని మాలిని అంటుంది. అప్పుడే వచ్చిన దాసు.. అలాంటి పని చేయొద్దని అంటాడు. మా మంచితనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. వచ్చినందుకు సంతోషం. పెళ్లి చూసి, భోజనం చేసి వెళ్లిపోండని దాసు చెప్తాడు. అప్పుడు దాసును అవమానించేలా మాలిని మాట్లాడుతుంది.
ఈ ఇంట్లో దాసుకు స్థానం లేదని మాలిని అంటుంది .ఇక్కడ నీ కంటే నాకు విలువ ఎక్కువే ఉందని దాసు కౌంటర్ ఇస్తాడు. ఇక జ్యోత్స్న దాసు కూతురని చెప్పేస్తుందా ఏంటీ? అని పారు తెగ టెన్షన్ పడుతుంది.
తాళి కట్టిన సూరజ్
జ్యోత్స్న మెడలో సూరజ్ తాళి కడతాడు. కొత్త జంట దండలు మార్చుకుంటుంది. హోమగుండం సిద్ధం చేయమని పంతులు చెప్తాడు. ఒక్క నిమిషం అని.. భర్తతో ఏడు అడుగులు నడిచే ముందు మీ అందరికీ ఒక నిజం చెప్పాలని జ్యోత్స్న అంటుంది. దీపకు అమ్మానాన్న లేరు. తాను అనాథ అని చాలా మంది నిందించారు. నేను కూడా అదే చేశా. నిజం ఏంటంటే దీపకు అమ్మానాన్న ఉన్నారని జ్యోత్స్న చెప్తుంది.
నిజం చెప్పేసిన జ్యోత్స్న
దీప అమ్మానాన్న ఎవరో నాకు తెలుసు. వాళ్లు ఇక్కడే ఉన్నారని సుమిత్ర, దశరథను దగ్గరకు పిలుస్తుంది జ్యోత్స్న. దీపను రమ్మంటుంది. ఇప్పుడు దీపను వాళ్ల అమ్మానాన్నకు అప్పగిస్తున్నానని దీప చేతిని సుమిత్ర, దశరథ చేతుల్లో పెడుతుంది జ్యోత్స్న. దీంతో అందరూ షాక్ అవుతారు.
మీరే దీప అమ్మానాన్న. దీపే మీ కన్నకూతురని జ్యోత్స్న చెప్తుంది. దీపే మా కన్నకూతురా అని సుమిత్ర మైండ్ బ్లాక్ అవుతుంది. అవును, దీపే మీ సొంత కూతురు. బిడ్డే తల్లిని వెతుక్కుంటూ వచ్చింది. తల్లిని చూసింది. అప్పటికే వేరేవాళ్లు ఆ స్థానంలో ఉండటంతో ఆగిపోయింది. నీకు క్యాన్సర్ వచ్చింది. బోన్ మ్యారో ఇవ్వాలన్నారు. అది ఇచ్చింది దీప అని జ్యోత్స్న చెప్తుంది.
సుమిత్ర ఎమోషనల్
కడుపులో బిడ్డకు ఏమైనా పర్వాలేదని దీప నీ కోసం బోన్ మ్యారో డొనేట్ చేసింది మమ్మీ అని జ్యోత్స్న నిజాలు అన్ని వరుసగా చెప్పేస్తుంది. దీప నా కూతురా అని సుమిత్ర ఏడ్చేస్తుంది. అవును సుమిత్ర.. జ్యోత్స్న చెప్పింది నిజం. దీపే మన సొంత బిడ్డ అని దశరథ ఎమోషనల్ అవుతాడు. దీప అనాథ కాదు ఈ దశరథ, సుమిత్ర కూతురు. శివ నారాయణ మనవరాలు. నా అసలైన వారసురాలు అని గర్వంగా చెప్తాడు దశరథ.
దీపను హత్తుకొని సుమిత్ర ఏడ్చేస్తుంది. ఈ సీన్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. దీప కొంత రుణం తీర్చుకున్నా. మీ అమ్మను ఇక అమ్మ అని ధైర్యంగా పిలవొచ్చని జ్యోత్స్న అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.