Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 17 ఎపిసోడ్ లో దీపకు ఊహించని బంపరాఫర్ తగులుతుంది. రూ.10 లక్షల చెక్ తీసుకోగానే ఆమె ముఖం వెలిగిపోతుంది. మరోవైపు సూరజ్ వీడియో లీక్ తో జ్యోత్స్న పరువు పోవడం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. మరి ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.
జ్యోకు కౌంటర్

పెద్ద ఆర్డర్ కు అడ్వాన్స్ రూ.10 లక్షలు చెక్ తీసుకోగానే దీప ముఖం వెలిగిపోతుంది. రేపటికే ఫుడ్ కావాలని కస్టమర్ చెప్తాడు. కష్టమే అని జ్యోత్స్న, మేనేజర్ మాట్లాడుకుంటారు. మేం సప్లై చేస్తామని దీప చెప్తుంది. ఇది పద్ధతి అంటే, కొందరిని చూసి కొందరు నేర్చుకోవాలని జ్యోకు కౌంటర్ వేసి ఆ కస్టమర్ వెళ్లిపోతాడు.
పార్టీ ఏదని
వెయ్యి భోజనాలకు ఫుడ్ ఆర్డర్ వచ్చింది బావ అని తెగ సంతోషపడుతూ కార్తీక్ కు చెప్తుంది దీప. కంగ్రాచ్యులేషన్స్ చెప్పబోతుంటే కార్తీక్ ను జ్యో అడ్డుకుంటుంది. కడుపు మంటతో జ్యో బయటకు వెళ్లిపోతుంది. పార్టీ ఏది మరి అని దీపను కార్తీక్ అడుగుతాడు. ఇంటికి వెళ్లాక ఇస్తానని దీప అంటుంది.
సూరజ్ ట్విస్ట్
బయట జ్యోత్స్న తెచ్చుకున్న కాఫీ కప్ ను సూరజ్ తీసుకుంటాడు. నీ డ్రామాలు నాకు తెలుసు. చిన్న వీడియో పెట్టుకుని నన్నేం చేయలేవని జ్యో అంటుంది. నీ వీడియో మీ తాతకు పంపించానని సూరజ్ షాకిస్తాడు. రౌడీలను అడ్డుపెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలు అన్నీ అందులో ఉన్నాయంటాడు. చివరకు జస్ట్ నీ టెన్షన్ చూద్దామనుకున్నా, వీడియో పంపలేదని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు.
ఎవరు నువ్వు?
అసలు ఎవరు నువ్వు? నన్ను, మా తాతను కాపాడినట్లు బిల్డప్ ఇచ్చి మా ఔట్ హౌజ్ లో ఎందుకు ఉంటున్నావ్? నా వీడియో ఎందుకు అడ్డుపెట్టుకున్నావ్? అని సూరజ్ ను జ్యోత్స్న అడుగుతుంది. కానీ టైమ్ వచ్చినప్పుడు చెప్తానని సూరజ్ మాట మారుస్తాడు. ఆఫర్ వదిలేసుకునే వాళ్లను జ్యోత్స్న అంటారంటూ సూరజ్ కౌంటర్లు వేస్తాడు. ఆ దీప ఓ వంటలక్క. మా ఇంట్లో వంటలు చేసుకోవడంతో దాని బతుకు మొదలైంది. నువ్వేమో రోడ్డు మీద జ్యూస్ లు అమ్ముకునేవాడివి అని తక్కువ చేసి మాట్లాడుతుంది జ్యోత్స్న.
{{/usCountry}}అసలు ఎవరు నువ్వు? నన్ను, మా తాతను కాపాడినట్లు బిల్డప్ ఇచ్చి మా ఔట్ హౌజ్ లో ఎందుకు ఉంటున్నావ్? నా వీడియో ఎందుకు అడ్డుపెట్టుకున్నావ్? అని సూరజ్ ను జ్యోత్స్న అడుగుతుంది. కానీ టైమ్ వచ్చినప్పుడు చెప్తానని సూరజ్ మాట మారుస్తాడు. ఆఫర్ వదిలేసుకునే వాళ్లను జ్యోత్స్న అంటారంటూ సూరజ్ కౌంటర్లు వేస్తాడు. ఆ దీప ఓ వంటలక్క. మా ఇంట్లో వంటలు చేసుకోవడంతో దాని బతుకు మొదలైంది. నువ్వేమో రోడ్డు మీద జ్యూస్ లు అమ్ముకునేవాడివి అని తక్కువ చేసి మాట్లాడుతుంది జ్యోత్స్న.
{{/usCountry}}నా స్థాయికి ఈ డీల్ సరిపోదు. కార్పొరేట్ ఆఫీస్ లో ఓ ఏడాది కాంట్రాక్ట్ అయితే నేను సంతకం పెట్టడానికి వాల్యూ ఉంటుంది. నా టైమ్ స్టార్ట్ అయింది. నువ్వు కాదు కదా వంటలక్క కూడా నన్ను ఆపలేదు అంటూ మెట్లు దిగబోతు జ్యోత్స్న కింద పడుతుంది. ఎందుకు చేయి ఇవ్వలేదని జ్యో అడిగితే.. సూరజ్ వరుసగా కౌంటర్లు వేస్తాడు. చందమామ కూడా నీ అంత అందంగా ఉండదు అని ఫ్లర్ట్ చేస్తాడు.
శివ నారాయణ కంగారు
కింద పడ్డ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని సూరజ్ కు వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. కుంటుకుంటూ తన క్యాబిన్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే శివ నారాయణ కంగారు పడుతూ వస్తాడు. కింద పడ్డావంట కదా, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. నడవడం కూడా రాకపోతే ఎలా అని అంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీప కూడా వచ్చి కింద పడ్డావంట కదా అని అడుగుతారు. మోకాలికి దెబ్బ తగిలి, గతం మర్చిపోతే ఎలా అని ఫన్నీ కౌంటర్లు వేస్తాడు కార్తీక్.
సుమిత్ర ఫోన్
కడుపు మంట కాళ్లకు అడ్డం పడ్డట్లు ఉంది. వచ్చిన ఆర్డర్ చూసి ఓర్చుకోలేక పోతుందని కార్తీక్ అంటాడు. అప్పుడే మేనేజర్ వంశీ ఏడుస్తూ వస్తాడు. మేడం కింద పడిందని వంశీ తెగ కంగారు పడతాడు. జ్యోత్స్న అరవడంతో మేనేజర్ పరుగెత్తుతాడు. సుమిత్ర కూడా కాల్ చేసి అదే విషయం అడుగుతుంది. నేను బాగానే ఉన్నానని చిరాకుగా చెప్పి జ్యో కాల్ కట్ చేస్తుంది. రెస్టారెంట్ స్టాఫ్ బొకేలు తీసుకుని వచ్చి పరామర్శించాలని అనుకుంటున్నారని ఆఫీస్ బాయ్ వచ్చి చెప్పడంతో జ్యోకు మండిపోతుంది.
సీసీ టీవీ ఫుటేజీ
కింద పడ్డ విషయం ఎవరికీ చెప్పొద్దన్న కదా, మరి ఎందుకు చెప్పావని సూరజ్ పై జ్యోత్స్న కోప్పడుతుంది. కానీ సూరజ్ తన స్టైల్లో కూల్ గా కౌంటర్లు వేస్తాడు. జ్యో తిడుతున్నా సూరజ్ నవ్వుతూనే ఉంటాడు. ప్రేమ ఉంటేనే తిట్లు వస్తాయంటాడు. నువ్వు కిందపడ్డ విషయం నేను చెప్పానని నీకు ఎవరు చెప్పారు? నేను ఎవరికి చెప్పలేదు ప్రామిస్. నీలా ఎవరూ పడకూడదని సీసీ టీవీ ఫుటేజీని కంపెనీ గ్రూప్ లో పోస్టు చేశానని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు. కార్తీక్ ను ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయమన్నానని చెప్తాడు.
మరోవైపు తమ స్టాఫ్ ను పిలిచి మనకు మంచి ఆర్డర్ వచ్చిందని దీప చెప్తుంది. ప్లేట్లో ఐటెమ్స్ డిఫరెంట్ గా ఉండేలా మెనూ రెడీ చేశానని దీప అంటుంది. ఏ ఐటెం ఎలా వండాలో కూడా చెప్తుంది. పనస బిర్యానీ తానే దగ్గరుండి చేయిస్తానంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.