కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 29 ఎపిసోడ్ లో మనం తొందరపడ్డామో దొరికిపోతామని పారుతో జ్యోత్స్న అంటుంది. ఆల్రెడీ దొరికిపోయాం. నీ రిపోర్ట్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవ్వలేదో అప్పుడే సగం దొరికిపోయినట్లు. దశరథ ముఖం చూస్తే ఏదో అనుమానం వచ్చినట్లే ఉందని పారు అంటుంది. లోపల భయం ఉంటే ఎవరి ముఖం చూసినా అలాగే ఉంటుందని జ్యో అంటుంది.
జ్యోకు షాక్

ఆస్తి ఇంకా మనది కాలేదు. నువ్వు సపోర్ట్ చేస్తే చాలని పారుతో జ్యోత్స్న అంటుంది. ఏంటీ సపోర్ట్ చేసేదని పారు ఫైర్ అవుతుంది. మీ నాన్న ఉంటే ఏదో ఒకటి చేసేదాన్ని. దాసుగాడు ఏమైపోయాడో కూడా అర్థం కావడం లేదని పారు అంటుంటే రౌడీల నుంచి కాల్ వస్తుంది. దాసు మాట్లాడతాడు. ప్లాన్ ఫెయిల్ అయిందంట కదా. నీ బుద్ధి మారడం లేదు. నువ్వు మాత్రం రాక్షసివేనని దాసు షాకిస్తాడు.
దాసు వార్నింగ్
ఈ కథలో నా అల్లుడు కార్తీక్ బ్రహ్మ దేవుడు. వాడి నుంచి నువ్వు తప్పించుకోలేవు జ్యోత్స్న. దీప మహర్జాతకురాలు. ఇప్పటికే మూడు సార్లు చావు నుంచి తప్పించుకుంది. ఇక గండాలు నీ వంతు. తప్పించుకోలేవు. నిజం ఒప్పుకొని క్షమించమని కాళ్ల మీద పడటం తప్పా వేరే దారి లేదు. నీ మంచి కోరి చెబుతున్నా ఇక్కడితో ఆపేయ్ అని దాసు చెప్పడంతో జ్యో కాల్ కట్ చేస్తుంది. నిజం భయటపడితే ఇంకెంత భయంకరంగా ఉంటుందని జ్యో భయపడుతుంది.
శాంపిల్స్ తీసుకోవాలని
ఇంటితో ఏ సంబంధం లేని దీప శాంపిల్స్ ఎలా మ్యాచ్ అవుతాయని అనుకుంటున్నారని కార్తీక్ ను డాక్టర్ అడుగుతుంది. ఇలా ఆరాలు తీయొద్దు డాక్టర్. సుమిత్రమ్మకు వెంటనే ఆపరేషన్ చేయాలని దీప ఏడుస్తుంది. బ్లడ్ క్యాన్సర్ అనేది మనిషిని తీసుకెళ్లి చావు అంచుల మీద నిలబెడుతుంది. ఇప్పుడు టాబ్లెట్స్ వల్ల ఏం కాదు. నేను అందరినీ టెస్టు చేస్తూ పోలేను. దీపకు ఆ ఇంటికి సంబంధం లేదని స్వయంగా సుమిత్రనే చెప్పింది. సుమిత్ర, దీప వాళ్ల అమ్మ అక్కాచెల్లెల్లా అని డాక్టర్ అడుగుతుంది.
{{/usCountry}}ఇంటితో ఏ సంబంధం లేని దీప శాంపిల్స్ ఎలా మ్యాచ్ అవుతాయని అనుకుంటున్నారని కార్తీక్ ను డాక్టర్ అడుగుతుంది. ఇలా ఆరాలు తీయొద్దు డాక్టర్. సుమిత్రమ్మకు వెంటనే ఆపరేషన్ చేయాలని దీప ఏడుస్తుంది. బ్లడ్ క్యాన్సర్ అనేది మనిషిని తీసుకెళ్లి చావు అంచుల మీద నిలబెడుతుంది. ఇప్పుడు టాబ్లెట్స్ వల్ల ఏం కాదు. నేను అందరినీ టెస్టు చేస్తూ పోలేను. దీపకు ఆ ఇంటికి సంబంధం లేదని స్వయంగా సుమిత్రనే చెప్పింది. సుమిత్ర, దీప వాళ్ల అమ్మ అక్కాచెల్లెల్లా అని డాక్టర్ అడుగుతుంది.
{{/usCountry}}ముందు మీరు దీప శాంపిల్స్ టెస్ట్ చేయండి. రిపోర్ట్స్ చూశాక మీరే కాల్ చేస్తారని డాక్టర్ తో కార్తీక్ చెప్తాడు. నేనే షాక్ లో ఉన్నా. జ్యోత్స్న సొంత కూతురు కానీ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి భయపడింది. నీకు ఆ ఇంటికి సంబంధం లేకపోయినా సుమిత్రను కాపాడాలని తాపత్రాయ పడుతున్నావు. ఇది ఓకే అవ్వదని నాకు తెలుసు. కానీ మీకోసం చేస్తానని డాక్టర్ అంటుంది.
కాశీని కలిసిన కాంచన
గుడిలో దేవుడికి మొక్కుకుంటుంది కాంచన. ఏం పాపం చేసిందని దీప ప్రాణాలు తీయాలని అనుకుంటున్నారని మొర పెట్టుకుంటుంది. అక్కడ కాశీ కనిపిస్తాడు. కాశీ ఇలా అయిపోయావ్ ఏంట్రా? నీ గురించి అడిగితే కోపంలో వెళ్లిపోయావనుకున్నారు. వైజాగ్ వెళ్లావేమో అనుకున్నానని కాంచన అంటుంది. లేదు అత్తా ఇక్కడే ఉన్నా. ఏ ముఖం పెట్టుకుని మీ దగ్గరకు రావాలి. నేను మారాను అత్త. తన కోపమే తన శత్రువు అనే పద్యంలోని అర్థం ఇప్పుడు అర్థమైంది. నేనేం మిగిల్చికోలేదు అత్త అని కాశీ ఫీల్ అవుతాడు.
కాశీ కన్నీళ్లు
మామను, బావను మోసం చేశా. తండ్రిని ఛీ కొట్టా. ఆఖరికి భార్యనూ మోసం చేశా. అందరూ నన్ను వదిలేశారని ఏడుస్తాడు కాశీ. ఇప్పుడు బతుకే కనిపించట్లేదు అత్తా. అంతా చీకటి అయిపోయిందని కాశీ అంటాడు. నీ మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుందని కాంచన అంటుంది. స్వప్నకు అర్థం కావడం లేదు. తను నా మాట వినట్లేదు అత్త. నాకు నా భార్య కావాలి. మమ్మల్ని కలుపు అత్త అని కాశీ అడుగుతాడు. ముందు మన ఇంటికి వెళ్దాం పదా అని కాశీని తీసుకెళ్తుంది కాంచన.
కార్తీక్ ట్విస్ట్
బుర్రలో వంద ఆలోచనలు. మీ ఆవిడను రెగ్యులర్ చెకప్ తీసుకెళ్లావు కదా ఏమైందని కార్తీక్ ను అడుగుతుంది పారు. వెంటనే పారును నానా మాటలు తిడతాడు కార్తీక్. రోకలి తీసుకుని వీపు మోత మోగేలా వాయించాల్సిందే. నువ్వు నిజమైన తల్లివే అయితే కనిపించకుండా పోయిన కొడుకు కోసం ఆరా తీసేదానివి. నీ కొడుకు తాయిత్తు గార్డెన్ లో కనిపించింది. నీకేమో వాకిట్లో కనిపించడు. ఆ రోజు దాసు మామయ్యను నేను కూడా చూశానని కార్తీక్ ట్విస్ట్ ఇస్తాడు.
జ్యోత్స్నను అనుమానించాలి. దాసు మామయ్యను కిడ్నాప్, అంటే మామయ్య కనిపించకుండా పోవడానికి జ్యోత్స్నకు ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. మనవరాలి దగ్గరకు వెళ్లి నేను చెప్పినట్లు చెప్పమని పారు చెవిలో ఏదో చెప్తాడు కార్తీక్. ఈ మాట అని చూడు ముఖంలో ఎన్ని రంగులు కనబడతాయోనని కార్తీక్ అంటాడు. సరేనని పారు వెళ్లి పోలీస్ స్టేషన్ కు వెళ్దామని జ్యోతో అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.