Karthika Deepam 2 Today Episode:సీఈఓగా తప్పుకొన్న శ్రీధర్-జ్యో ట్విస్ట్-అగ్రిమెంట్‌కు, పెళ్లికి లింక్-కార్తీక్ డ్రైవర్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే మే 5 ఎపిసోడ్ లో శ్రీధర్ ను రెస్ట్ తీసుకోమ్మని కాంచన అడుగుతుంది. శివ నారాయణకు ఇదే విషయం చెప్తుంది. శ్రీధర్ ను సీఈఓగా తప్పిస్తారు. కానీ కార్తీక్ అగ్రిమెంట్ విషయంలో జ్యోత్స్న కొత్త ట్విస్ట్ ఇస్తుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో శ్రీధర్ ఆరోగ్య పరిస్థితి పట్ల కాంచన ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరోసారి హార్ట్ స్ట్రోక్ వస్తే శ్రీధర్ బతకడం కష్టమని డాక్టర్ చెప్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 5 ఎపిసోడ్ లో చూసేయండి.

శ్రీధర్ కోసం
డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడని శ్రీధర్ కు కాంచన చెప్తుంది. కానీ శ్రీధర్ ఫోన్ మోగుతూనే ఉంటుంది. నేను సీఈఓను, బాధ్యతలున్నాయని శ్రీధర్ అంటాడు. అవన్నీ తర్వాత అని కాంచన, కార్తీక్ చెప్తారు. మీ ఇంట్లో ఎవరి నుంచైనా గట్టిగా మాటొస్తే తర్వాత నేను వస్తా. మనకు ఇప్పటికే ఉన్న సమస్యలు చాలు. ఆయన్ని బతికించాల్సింది మనం. బాధ్యతలను దించుదాం. బిజినెస్ కు సంబంధించి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అని స్వప్నతో కాంచన అంటుంది.
మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం పిల్లలే. ప్రశాంతంగా ఉండేవాణ్ని తీసుకెళ్లి సీఈఓను చేశారు. మధ్యలో పోలీసు కేసు, బెయిల్. ఇంట్లో, ఆఫీస్ లో టెన్షన్. మనిషి ఏ మాత్రం భరించగలడు. ఈ సారి నేను చెప్పినట్లు వినండి. కాశీ, స్వప్న మాట్లాడుకోండని కాంచన చెప్తుంది.
అందరూ షాక్
శ్రీధర్ ను తీసుకొని కాంచన, కార్తీక్ కలిసి శివ నారాయణ ఇంటికి వెళ్తారు. ఏంటి బావ పేరెంట్స్ తో వచ్చావ్, పెళ్లి గురించి మాట్లాడేందుకా అని జ్యోత్స్న అనగానే కాంచన సీరియస్ అవుతుంది. శ్రీధర్ కు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కార్తీక్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మాతో ఒక మాట కూడా చెప్పలేదని దశరథ అడుగుతాడు. జరిగిన విషయాన్ని కాంచన చెప్తుంది.
పారు నిజం
దీప నువ్వైనా మాతో చెప్పాలి కదా అని దశరథ అడుగుతాడు. దీప చెప్పబోయింది కానీ, జ్యోత్స్ననే చెప్పనివ్వలేదని పారు చెప్తుంది. ఎందుకు గ్రానీ నాపై అంత పెద్ద నింద వేస్తున్నావని జ్యో తెగ నటించేస్తుంది. కార్తీక్ రాలేదని అడిగితే దీప ఏదో చెప్పబోతుంటే నువ్వు ఏం అన్నావ్ అని అసలు నిజం పారు చెప్తుంది. నువ్ అన్నావా లేదా? అని జ్యోత్స్నపై తాత కోప్పడతాడు. దీప, కార్తీక్, గ్రానీకి జ్యో సారీ చెప్తుంది.
బావ సీఈఓనా
మరోసారి హార్ట్ స్ట్రోక్ వస్తే బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారు. నాన్న, సమస్య తీవ్రత ఎక్కువగానే ఉంది. ఆయనకు విశ్రాంతినివ్వాలి. సీఈఓ పోస్టుకు ఆయన రిజైన్ చేస్తారు. ఇక మీదట వాళ్లింట్లో ఉంటూ రెస్ట్ తీసుకుంటారని కాంచన చెప్తుంది. మామయ్యకు రెస్ట్ ఇవ్వాలి కాబట్టి బావను సీఈఓ చేయాలంటావంటూ జ్యో అర్థం లేకుండా మాట్లాడుతుంది.
జ్యో మనోగతం
మామయ్య తరపున కొడుకు అడగాలి లేదా ఎక్కడ ఉంటున్నాడో వాళ్లు వచ్చి అడగాలి. వదిలేసుకున్న వాళ్లకు అధికారాలు ఉండవని చెప్పారు కదా అని జ్యోత్స్న పాయింట్ మాట్లాడుతుంది. దీపను పెళ్లి చేసుకున్న కార్తీక్ మీద నాకు అధికారం లేనప్పుడు, మామయ్యను వద్దనుకున్న కాంచన అత్తకు ఏం అధికారం ఉంటుందని జ్యోత్స్న మనోగతం అని పారు మండిపడుతుంది.
కార్తీక్ అగ్రిమెంట్
వాళ్లు నా తల్లిదండ్రులుగా దూరంగా లేరు. నా తండ్రికి ఆరోగ్యం బాలేకపోతే నా తల్లి ఆలోచిస్తుంది. దీన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని కార్తీక్ ఫైర్ అవుతాడు. సీఈఓ పోస్టును బావకు ఇచ్చేయండని జ్యో వెటకారంగా అంటుంది. కార్తీక్ కు కూడా విశ్రాంతి కావాలి. వాడి అగ్రిమెంట్ ను కూడా క్యాన్సిల్ చేయండి. రేపు కార్తీక్ కు కూడా అదే సమస్య రావొచ్చని కాంచన బాధ పడుతుంది.
జ్యో ట్విస్ట్
నా కొడుకును, వాళ్ల నాన్నను ఇక్కడి నుంచి తీసుకెళ్లమంటావా చెప్పు నాన్న అని శివ నారాయణను కాంచన అడుగుతుంది. శ్రీధర్ కు విశ్రాంతినివ్వడం నా చేతుల్లో ఉంది కానీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం నా చేతుల్లో లేదు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే రూ.10 కోట్లు కట్టాలి. ఆ డబ్బు నేను కడతా. కానీ నీ కొడుకు ఓకే అనాలి కదా అని శివ నారాయణ అంటాడు.
డబ్బు ఒక్కటే కాదు నా పెళ్లి అనే కండీషన్ కూడా ఉంది. నా పెళ్లి జరిగేంత వరకూ బావ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవదని జ్యో ట్విస్ట్ ఇస్తుంది.
నటించమని రిక్వెస్ట్
మరోవైపు మామయ్య మనకోసమే బాధ పడుతున్నారు. మనం విడాకులు తీసుకోవద్దని స్వప్నతో కాశీ అంటాడు. ఇప్పుడు నీ ప్రేమకు నా తండ్రి ప్రాణాలు అడ్డుపెట్టుకుంటున్నావా? అని స్వప్న అడుగుతుంది. విడాకులపై కాశీ, స్వప్న వాదులాడుకుంటారు. ప్రేమగా ఉన్నట్లు నటించమని స్వప్నను కాశీ అడుగుతాడు.
ఇక్కడే డ్రైవర్ గా
సీన్ మళ్లీ శివ నారాయణ ఇంటికి మారుతుంది. నీ పెళ్లికి, అగ్రిమెంట్ కు సంబంధం ఏంటీ అని జ్యోను శ్రీధర్ అడుగుతాడు. నా పెళ్లి బాధ్యత బావ తీసుకున్నాడు కాబట్టి నా మెడలో మూడు ముళ్లు పడ్డ మరుక్షణమే నా అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పటివరకూ బావ ఇక్కడే డ్రైవర్ గా ఉంటాడని జ్యో చెప్తుంది. ఎక్కడ నా కొడుకు సీఈఓ అవుతాడని ముందుగానే జాగ్రత్తపడ్డావే అని జ్యోపై కాంచన కోప్పడుతుంది.
నేను మాట తప్పను. నీ మెడలో మూడు ముళ్లు పడేవరకు నేను, నా భార్య ఇక్కడే ఉంటామని జ్యోతో కార్తీక్ చెప్తాడు. శ్రీధర్ ను సీఈఓగా తప్పిస్తున్నానని శివ నారాయణ చెప్తాడు. నెక్ట్స్ సీఈఓ ఎవరు? అని జ్యో అడిగితే.. బోర్డు మీటింగ్ లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని శివ నారాయణ అంటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


