...
...
Next Story

Karthika Deepam 2 Today Episode:చెప్పు తెగుతుంది-నిజం చెప్పేస్తానని జ్యోకు దీప వార్నింగ్-సీఈఓ కానివ్వను-కార్తీక్ ఛాలెంజ్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే మే 6 ఎపిసోడ్ లో జ్యోత్స్నపై దీప సీరియస్ అవుతుంది. వైరాతో కలిసిపోయావనే నిజం తాతయ్యకు చెప్తానని భయపెడుతుంది. సీఈఓ కాదు కదా ఆఫీస్ క్లర్క్ కూడా కాలేవని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. బోర్డు మెంబర్స్ ను రప్పించిన జ్యో తన గేమ్ స్టార్ట్ చేస్తుంది.

Published on: May 6, 2026, 07:03:48 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో అగ్రిమెంట్ కు, పెళ్లికి లింక్ పెట్టిన జ్యోత్స్న ట్విస్ట్ ఇస్తుంది. కార్తీక్ ను తన ఇంట్లోనే ఉంచుకోవాలని అనుకుంటుంది. శ్రీధర్ తప్పుకోవడంతో సీఈఓ పోస్టు ఖాళీ అవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 6 ఎపిసోడ్ లో చూద్దాం.

జ్యో పెళ్లి

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

నేను మాట తప్పను కాబట్టి తన పెళ్లి అయ్యేంతవరకూ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయనని జ్యోత్స్న చెప్తుంది. అంటే జ్యో పెళ్లికి ఒప్పుకున్నట్లే. ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో సీఈఓ, మరొకటి జ్యో పెళ్లి అని దీపతో కార్తీక్ అంటాడు. జ్యో మనసు దుర్మార్గమైంది. అనుకున్నది చేయడానికి ఏమైనా చేస్తుందని దీప అంటుంది.

శ్రీధర్ వర్సెస్ కాంచన

మరోవైపు కాంచన, శ్రీధర్ వాదులాడుకుంటారు. జ్యోత్స్న చేసింది, చేస్తుంది 100 పర్సెంట్ కరెక్ట్ అని శ్రీధర్ అంటాడు. తప్పు కార్తీక్ దే. జరిగే కథకు మనం ప్రేక్షకులం. మన కొడుకు చేసిన తప్పునకు ఎవరిని నిందించలేమని శ్రీధర్ అంటాడు. జ్యో మెడలో తాళి పడితే కానీ నా కొడుక్కి విముక్తి ఉండదని కాంచన సీరియస్ అవుతుంది. జ్యోత్స్న సంధించిన పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమాన్యుడిలా నా కొడుకు మారిపోయాడని కాంచన ఫీల్ అవుతుంది.

జ్యో స్వార్థపరురాలే. కానీ మనోడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు. నువ్వు గీసిన గీతలో నిలబడలేనని బయటకు రావొచ్చు కదా. జ్యో మాటలకు కార్తీక్ కట్టుబడటం వెనుక దీప ఉంది. అది ఎందుకో నాకు తెలియదు. నువ్వు ఒకసారి గట్టిగా అడిగి చూడమని కాంచనను శ్రీధర్ అడుగుతాడు.

దీప ఫైర్

అగ్రిమెంట్ ఉన్నంతవరకూ బావ నాకు బానిసే దీప. నా మెడలో తాళి పడితే రెండు సమస్యలు తీరుతాయి. నువ్వు వారసురాలివని తేలడం, బావ సీఈఓ అవడం. అలా జరగాలంటే బావ నా మెడలో తాళి కట్టాలని జ్యో మళ్లీ పాత పాటే పాడుతుంది. కొడితే చెప్పు తెగుతుందని దీప సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. అసలు నువ్వెవరు మాకు ఆఫర్లు ఇవ్వడానికి. అగ్రిమెంట్ దాటడానికి మా బావకు క్షణం పట్టదని దీప చిటికెలు వేస్తుంది.

క్లర్క్ కూడా కాలేదు

నాకు తిక్క రేగిందంటే హాల్ లోకి వెళ్లి వైరాతో నువ్వు కలిసిపోయావని తాతయ్యకు నిజం చెప్తానని దీప అనగానే జ్యో నోరు పడిపోతుంది. ఏమే, నువ్వు చెప్పకపోతే నేను ఈ ఇంటి వారసురాలిని కాదా? ఊరికే ఏది పడితే అది వాగావంటే ఈ సారి బడితెపూజే అని దీప వార్నింగ్ ఇస్తుంది. నీ పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతామని జ్యోత్స్నకు కార్తీక్ కౌంటర్ వేస్తాడు. జాగ్రత్తగా ఉతికి, మంచిదానిలా మార్చేద్దాం. ఇది ఆఫీస్ క్లర్క్ కూడా అవలేదు. సీఈఓకు సంబంధించి తాతతో మాట్లాడాల్సింది వేరే ఉందిలే అని కార్తీక్ అంటాడు.

కార్తీక్ ఐడియా

దశరథ, శివ నారాయణ తో సీఈఓ, జ్యోత్స్నకు కాబోయే భర్త గురించి కార్తీక్ మాట్లాడతాడు. ఒక యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడిని చూసి కంపెనీ బాధ్యతలు అప్పగించాలి. ఆ కుర్రాడే మీ మనవరాలి మొగుడైతే ఇల్లు, కంపెనీ బాధ్యతలు ఒకడిపైనే ఉంటుందని కార్తీక్ చెప్తాడు. ఈ ఐడియా సూపర్ గా ఉంది మనవడా అని పారిజాతం వస్తుంది. ఆలోచన మంచిదే, సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని ప్రకటన ఇవ్వండని శివ నారాయణ చెప్తాడు.

బోర్డు మెంటర్స్ ఎంట్రీ

సీఈఓను సెలెక్ట్ చేసే టీమ్ లో ఉన్నవాని జ్యోకు చెప్పాలని కార్తీక్ అంటాడు. అందరూ ఓకే అంటారు. మరోవైపు అత్తకు ఫోన్ చేసి సారీ చెప్పమని జ్యోకు సుమిత్ర చెప్తుంది. అప్పుడే బోర్డు మెంబర్స్ వస్తారు. జ్యో లీక్ చేసి వాళ్లను రప్పిస్తుంది. కొత్తవాళ్లను చూద్దామని శివ నారాయణ అంటాడు. కానీ మీ ఫ్యామిలీలో ఎవరికీ సీఈఓ పోస్టులో ఉండే అర్హత లేక, బయటవాళ్లను తెచ్చారని అనుకుంటారని బోర్డు మెంబర్స్ చెప్తారు.

మీతో ఎవరైనా మాట్లాడనిస్తున్నారా? అని కార్తీక్ అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇది పూర్తిగా మా అభిప్రాయమేనని బోర్డు మెంబర్స్ అంటారు. బయట వాళ్లే సీఈఓగా అనుకుంటే, మేం ఉండాలో లేదో నిర్ణయం తీసుకుంటామని బోర్డు మెంటర్ ధరణి షాకిస్తాడు. మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తానని శివ నారాయణ వాళ్లను పంపిస్తాడు.

గేమ్ ఇంట్రెస్టింగ్ గా

ఇప్పుడు గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బావ. బోర్డు మీటింగ్ లో చాలా అద్భుతాలు జరుగుతాయని కార్తీక్ తో జ్యో అంటుంది. నువ్వు అనుకున్నది ఏదీ జరగదని కార్తీక్ అంటాడు. మరోవైపు రాత్రి వేళ క్యాబ్ క్యాన్సిల్ అవుతుండటంతో సూరజ్ చిరాకు పడతాడు. అతణ్ని చూసి జ్యో కారు ఆపుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks