Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. జ్యోత్స్న అంటే తనకు స్పెషల్ అని సూరజ్ చెప్తాడు. ఆ మాటలతో జ్యోత్స్న పొంగిపోతుంది. మళ్లీ మళ్లీ అడిగి అదే మాట చెప్పించుకుంటుంది. నువ్వు అందరికంటే స్పెషలే జ్యోత్స్న అని సూరజ్ మళ్లీ చెప్తాడు.
అంత సహనం ఎక్కడిది?

ఆ మహి మాటలతో, చేతలతో బాధపెడుతుంటే డీల్ పోతుందని భరించావ్. అంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది? అని జ్యోత్స్నను సూరజ్ అడుగుతాడు. కొందరి మీద ఉన్న ఇష్టమే భరించేలా చేస్తుంది. ఈ సంఘటన వల్ల గుణపాఠం నేర్చుకున్నా. ఇది నేను ఇష్టపడే మనిషిని మరింత గొప్పగా చూపించింది. ఆ మనిషి నువ్వే అని సూరజ్ గురించి గొప్పగా చెప్తుంది జ్యోత్స్న.
తోడుగా ఉంటా జ్యోత్స్న
నీకు మంచి గుణాన్ని ఇచ్చిన దేవుడు మంచి బుద్ధి ఇస్తే బాగుండని జ్యోత్స్న కౌంటర్ వేస్తుంది. ఎప్పుడూ ఇలాగే ఉంటా. నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి ఎవరున్నా లేకపోయినా నేనుంటా. ఈ మాట మర్చిపోకు అని సూరజ్ చెప్పడంతో జ్యో మళ్లీ పొంగిపోతుంది. నువ్వు కన్ ఫ్యూజన్ లో ఉన్నావ్. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏం చేయాలో నీ మనసు చెప్తుందని చెప్పి జ్యో వెళ్లిపోతుంది.
మరోవైపు సుమిత్ర తన ఓనర్ ఇంట్లో వంట చేస్తుంటుంది. ఆ ఓనర్ కు వస్తువులు ఎక్కడ పడితే అక్కడే పెట్టి మర్చిపోయే అలవాటు ఉంటుంది. అలా చెవి కమ్మలను టేబుల్ మీద పెడుతుంది.
నువ్వు వదిలేసిన తాళి సూరజ్
ఇక జ్యోత్స్న చేయిని మహి పట్టుకున్నాడనే విషయాన్ని సూరజ్ గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంటాడు. అప్పుడే కార్తీక్, దీప వచ్చి సూరజ్ తో పర్సనల్ గా మాట్లాడతారు. నువ్వు వదిలేసిన దగ్గరే ఈ కథ ఆగిపోయిందని కార్తీక్ అంటాడు. అప్పుడే దీప తాళి చూపించి, ఇది నువ్వు వదిలేసిన తాళే. దీన్ని జ్యోత్స్న జాగ్రత్తగా దాచింది. ఇదే కాదు నువ్విచ్చిన గులాబీ, తిరిగిచ్చిన ఉంగరం ఇలా నువ్వు ఇచ్చినవన్నీ భద్రంగా దాచుకుందని దీప చెప్తుంది.
మీ పెళ్లితోనే ముగింపు
{{/usCountry}}ఇక జ్యోత్స్న చేయిని మహి పట్టుకున్నాడనే విషయాన్ని సూరజ్ గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంటాడు. అప్పుడే కార్తీక్, దీప వచ్చి సూరజ్ తో పర్సనల్ గా మాట్లాడతారు. నువ్వు వదిలేసిన దగ్గరే ఈ కథ ఆగిపోయిందని కార్తీక్ అంటాడు. అప్పుడే దీప తాళి చూపించి, ఇది నువ్వు వదిలేసిన తాళే. దీన్ని జ్యోత్స్న జాగ్రత్తగా దాచింది. ఇదే కాదు నువ్విచ్చిన గులాబీ, తిరిగిచ్చిన ఉంగరం ఇలా నువ్వు ఇచ్చినవన్నీ భద్రంగా దాచుకుందని దీప చెప్తుంది.
మీ పెళ్లితోనే ముగింపు
{{/usCountry}}నువ్వంటే జ్యోత్స్నకు చాలా ఇష్టమని సూరజ్ కు దీప చెప్తుంది. నీకు కూడా జ్యోత్స్న అంటే ఇష్టం ఉంది. ప్రేమ లేకపోతే డీల్ క్యాన్సిల్ చేసేవాడివే కాదు. జ్యోత్స్న నా మనిషి అని అందరి ముందు చెప్పేవాడివే కాదు. నువ్వు కంట్రోల్ తప్పి ఆవేశంలో నిజం చెప్పావ్. నీ మనసులో ఏముందో మాకు అర్థమైంది. నిన్ను నమ్మిన ఓ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్లావ్. కానీ అది సరిదిద్దుకోలేని తప్పు కాదు. ఈ కథకు అందమైన ముగింపు మీ పెళ్లి అని తాళిని టేబుల్ మీద పెడతాడు కార్తీక్.
జ్యో నిన్ను ప్రేమించింది
ఈ తాళి జ్యోత్స్నకు ఇచ్చేయండని సూరజ్ అంటాడు. మేం కాదు నువ్వే ఇవ్వాలి. ఈ సారి తాళి చేతికి ఇవ్వడం కాదు మెడలో కట్టాలని కార్తీక్ చెప్తాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న చెప్పిందా అని సూరజ్ అడుగుతాడు. కొన్ని అర్థమవుతాయి సూరజ్. జ్యో ప్రేమ నీకు అర్థం కావడం లేదా? నిన్ను ప్రేమించింది, నీ కోసమే బతుకుతోంది కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోవడం లేదని దీప వివరిస్తుంది.
మాలినికి మైండ్ బ్లాక్
నువ్వు వేసే మూడు ముళ్లు మూడు కుటుంబాలను కలుపుతాయి. నిన్ను శత్రువు అని ఎలా అనుకుంటాం? ఇప్పటికీ నువ్వు నా తమ్ముడివే. విడిగా ఉండి బాధపడదామా? కలిసిపోయి ఆనందాలు పంచుకుందామా? అని సూరజ్ ను కార్తీక్ సూటిగా అడుగుతాడు. నువ్వు వచ్చి క్షమించమని అడిగితే పెద్దవాళ్ల కోపాలు పోతాయని దీప చెప్తుంది. తాళిని అక్కడే వదిలేసి కార్తీక్, దీప వెళ్లిపోతారు. సూరజ్ ఆ తాళిని తీసుకుంటాడు. ఇదంతా దొంగచాటుగా చూసిన మాలినికి మైండ్ బ్లాక్ అవుతుంది.
ప్రేమను దాస్తున్నావా?
రాత్రి ఇంట్లో కూర్చుని ఆ తాళినే పట్టుకొని జ్యోత్స్న మాటలను, జరిగిన విషయాలను సూరజ్ గుర్తు చేసుకుంటాడు. తాతను చూసి తాళి జేబులో పెట్టుకుంటాడు. నా మనవడు వాడి ప్రేమను దాస్తున్నాడు. నీకు మీ అమ్మంటే ఎంత ఇష్టమో, జ్యోత్స్నంటే కూడా అంతే ఇష్టం. జ్యోత్స్నను నువ్వు నిజంగానే ప్రేమించావని దక్షిణామూర్తి అంటాడు. అలాంటిదేమీ లేదని సూరజ్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు.
జ్యోత్స్నను పెళ్లి చేసుకో
నువ్వు ప్రేమించిన అమ్మాయిని కోల్పోయావు. జ్యోత్స్న నీ కోసం బతుకుతోంది. దూరం చేసుకోకు. జ్యోత్స్నను పెళ్లి చేసుకో. మూడు ముళ్లతో నీ ప్రేమను ముందుకు తీసుకెళ్లు. నా కూతురి పెళ్లి చూడలేకపోయా. నా మనవరాలి పెళ్లిని చూడాలనుకుంటున్నా. మరోసారి ఇలా మాట్లాడటానికి ఈ తాత నీ ముందు ఉండకపోవచ్చేమోనని దక్షిణామూర్తి ఎమోషనల్ గా మాట్లాడతాడు.
పెళ్లి జరిగితే గొడవలు ఆగిపోతాయి. నీ ప్రేమ గురించి ఓ నిర్ణయం తీసుకో. దానికి ఇంతకంటే మంచి టైమ్ రాదని చెప్పి దక్షిణామూర్తి వెళ్లిపోతాడు. ఈ మాటలను కూడా మాలిని రహస్యంగా వింటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.