...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కాశీ మోసంతో స్వ‌ప్న క‌న్నీళ్లు-శివన్నారాయ‌ణ ఇంట్లో హోమం-కావేరీని పిల‌వ‌డంపై పారు, జ్యో రచ్చ

కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 17 ఎపిసోడ్ లో కాశీ మోసం చేశాడని స్వప్న బాధ పడుతుంది. శివన్నారాయణ బంధువులతో హోమం చేయించాలని గురువు చెప్తాడు. హోమానికి కావేరీ, స్వప్నను కూడా పిలవాలంటాడు. దీనిపై పారు, జ్యో రచ్చ రచ్చ చేస్తారు.

Published on: Nov 17, 2025, 06:45:59 IST
Advertisement

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 17 ఎపిసోడ్ లో ఆఫీస్ కు వెళ్లాలని హడావుడి చేస్తాడు కాశీ. నేను నీతో పాటు మీ ఆఫీస్ కు వస్తానని స్వప్న అంటుంది. జాబ్ చేసేవాళ్లకు కదా ప్రెషర్ ఉండాల్సింది నీకెందుకు ప్రెషర్? అని స్వప్న షాక్ ఇస్తుంది. విష్ణు కాల్ చేశాడా? ఆన్ లైన్ లో చూసి మీ ఆఫీస్ కు కాల్ చేశా. నీది విలువైన పోస్ట్ అంట కదా అని స్వప్న వెటకారంగా మాట్లాడుతుంది.

ఐ హేట్ యూ

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

నిజం చెప్పమని తనపై ఒట్టు వేయించుకుంటుంది స్వప్న. జాబ్ వచ్చిందని చెప్పడం అబద్దమే అని కాశీ అనగానే స్వప్న ఎమోషనల్ అవుతుంది. ఈ విషయం నిన్న సాయంత్రమే తెలిసింది. నువ్వు చెప్తావేమోనని వెయిట్ చేశా. ఐ హేట్ యూ, నాతో మాట్లాడకు అని లోపలికి వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు గురువు గారికి జాతకాలు చూపిస్తాడు శివన్నారాయణ.

హోమం జరిపించాలని

మీ కుటుంబానికి ఒక మంచి ఉంది. ఒక చెడు కూడా ఉంది. దోషం ఉంది అని శివన్నారాయణతో చెప్తూ గురువు బాంబ్ పేలుస్తాడు. ఒక మనిషి అని చెప్పలేను, ఈ ఇంటి మనుషులకు దోషం ఉందని గురువు అంటాడు. అలాగే ఈ ఇంటి వారసురాలికి ఓ మంచి జరుగుతుంది. కానీ ఈ ఇంటికి ఓ విపత్తు ఉంది. చాలా పెద్ద ప్రమాదమే రాబోతుంది. ఈ ఇంట్లో హోమం జరిపించాలి. మీ కుటుంబంలోని ముత్తైదువులందరూ ఈ హోమానికి రావాలి. ఈ ఇంటి రక్తంతో ముడిపడిన ప్రతి బంధం హోమానికి రావాలని గురువు చెప్తాడు.

దీపకు మంచి

స్వప్న ఏడుస్తుంటే కాశీ ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. ఏమైంది అని కావేరీ వస్తుంది. స్వప్న ఎందుకు ఏడుస్తుందని కావేరీ అడుగుతుంది. నీ కూతురిని మోసం చేశానని, అందుకే ఏడుస్తున్నానని చెప్పు కాశీ. అమ్మ, మీ అల్లుడికి జాబ్ వచ్చిందని చెప్పడం అంతా అబద్దం. జాబ్ కు వెళ్తున్నట్లు మోసం చేశాడు. ఇన్ని అబద్దాలు ఎవరి కోసం? నాకు అబద్దాలు చెప్పేవాళ్లంటే అసహ్యం. మోసం చేసేవాళ్లను పురుగుల కంటే హీనంగా చూస్తా. అమ్మ, నాన్నకు ఫోన్ చేయ్. ఈ అబద్దం గురించి నాన్న దగ్గరే తేలుస్తానని స్వప్న అంటుంది.

నాకు జాబ్ లేదని మామయ్యకు తెలుసని కాశీ అంటాడు. ఆ రోజు నాన్న కాళ్లు పట్టుకుంది అందుకేనా అని స్వప్న అంటుంది. మీ మామయ్య వచ్చాక మాట్లాడుదాం మీరు వెళ్లి హాల్ లో కూర్చోండని కావేరీ చెప్తుంది. కాశీ నన్ను మోసం చేశాడమ్మా. అంతా తెలిసిన నాన్న కూడా నాకు మాట వరసకైనా చెప్పలేదు. నేను నిజం అని నమ్మిన మనిషి అబద్దంగా మిగిలిపోయాడు అని ఏడుస్తుంది స్వప్న.

హోమానికి కావేరీ

శ్రీధర్ మళ్లీ శివన్నారాయణ ఇంటికి వస్తాడు. అందరి మంచి కోసం హోమం నిర్వహిస్తున్నానని శివన్నారాయణ చెప్తాడు. శివన్నారాయణ చెబుతుంటే ఫ్యామిలీ మెంబర్స్ పేర్లను కార్తీక్ రాస్తాడు. శ్రీధర్, కావేరీ అనగానే అందరూ షాక్ అవుతారు. రావాల్సిన వాళ్ల లిస్ట్ చెప్తానని, రాకూడని వాళ్ల పేర్లు చెెప్తారేంటీ అని పారిజాతం అంటుంది. కావేరీ, స్వప్న, కాశీ, దాసు అని మళ్లీ చెప్తాడు పారు. చివరి రెండు పేర్లు ఓకే కానీ, ముందు రెండు పేర్లను ఏ లిస్ట్ లో రాశారో చెప్పండని పారు, జ్యో అడుగుతుంది.

రేపటి హోమానికి శివన్నారాయణ బంధువులందరూ వస్తారు. శివన్నారాయణ బంధువులు అంటే నా కుటుంబం, నా కొడుకు కుటుంబం, నా కూతురు కుటుంబం, దాసు కుటుంబం, అలాగే శ్రీధర్ కుటుంబమని శివన్నారాయణ చెప్తాడు. శ్రీధర్ కుటుంబం అంటే కావేరీ, స్వప్న కదా అని ఒత్తి పలుకుతుంది పారిజాతం. మీ మామయ్య భార్య కాబట్టి మనకు బంధువులే అని జ్యోతో శివన్నారాయణ అంటాడు.

రానని శ్రీధర్

ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది. చెప్పుకోలేని సంబంధాలు పెట్టుకునే వాళ్లను ఇంటి గుమ్మం తొక్కనిస్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతారని పారిజాతం గొడం చేస్తుంది. నేను ఎవరినీ ఏం అనాలని అనుకోవడం లేదు. దయచేసి హోమానికి నా ఫ్యామిలీని మాత్రం పిలవొద్దు. ఒకవేళ కాంచనతో నన్ను రమ్మంటే నేను వస్తా. పరువు పోతుందని అనిపిస్తే నేనే కూడా రానని శ్రీధర్ చెప్తాడు. అది చెప్పడానికి నువ్వెవరు? హోమానికి నేను పిలిచిన వాళ్లందరూ రావాలని శివన్నారాయణ మరోసారి అంటాడు.

ఇది మా ఇంటి సమస్య నువ్వు మాట్లాడుకు బావ అని జ్యోత్స్న అంటుంది. ఈ ఇంటి మేనల్లుడు, ఇంటి ఆడపడుచు కొడుకును మాట్లాడొద్దని అంటావా? అని దీప సీరియస్ అవుతుంది. కావేరీ అడుగు ఈ ఇంట్లో పడటానికి వీల్లేదని పారు, జ్యోత్స్న అంటారు. తప్పు నాదే. హోమం నా కారణంగా డిస్టర్బ్ అవడం ఇష్టం లేదు. హోమానికి నా ఫ్యామిలీ రాదని బాధతో వెళ్లిపోతాడు శ్రీధర్. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe