Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సూరజ్ తో జ్యోత్స్న మాట్లాడుతుంది. తన గురించి చెప్పే నిజాలను వినమంటుంది. ఆస్తి కోసమే తనతో పెళ్లి ఒప్పుకొన్నావా? అని సూరజ్ అడిగితే.. నిజమేనని జ్యోత్స్న అంటుంది. ఈ కథ మొదలైందే ఒక అబద్ధంతో అని సూరజ్ ఫీల్ అవుతాడు.
అప్పుడు ఇష్టం లేదు

మా గ్రానీ చెప్పింది నిజాలే. కానీ నిజం అనే తెరవెనుక అబద్ధాలు కూడా ఉన్నాయి. నేనేం చేశానో చెప్పాలి. నువ్వంటే అప్పుడు నాకు ఇష్టం లేదు. నీ మీద పగతోనే ఫుడ్ స్టాల్ కూడా తీసేయించా. అప్పుడే నువ్వు ఆఫీసులోకి, ఇంట్లోకి వచ్చావ్. అలాంటిది నీతో పెళ్లి అంటే అప్పుడు ఎలా ఒప్పుకొంటానని సూరజ్ ను జ్యోత్స్న తిరిగి ప్రశ్నిస్తుంది.
నీతో ప్రేమలో పడిపోయా
సూరజ్ ను పెళ్లి చేసుకుంటేనే ఆస్తి దక్కుతుందని వీలునామా రాశారని గతం గురించి చెప్తుంది జ్యోత్స్న. సూరజ్ ను పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కుతుందని గ్రానీ చెప్పింది. అందుకే ఆస్తి కోసమే నీతో పెళ్లికి ఒప్పుకొన్నా. కానీ ఆ తర్వాత నువ్వు రిజెక్ట్ చేశావ్. కండీషన్లు పెట్టావ్. నీతో గొడవలు పడుతూ ప్రేమలో పడ్డా. నీతోనే బతకాలనుకున్నా. ఆస్తి ఉంటే చాలని అనుకొనే జ్యోత్స్న.. సూరజ్ ఉంటే చాలు అనే స్థాయికి వచ్చేసిందని జ్యో చెప్తుంది.
ప్రేమ మోసం కాదన్న జ్యోత్స్న
నువ్వు యాక్సెప్ట్ చేశావ్. కానీ పెళ్లి పీటల మీద వదిలేసి మోసం చేశావ్. నేను మోసాలు చేశా. కానీ నా ప్రేమ మోసం కాదు. నీ కోసమే బతుకున్నది నిజం. ఈ ప్రయాణంలో నీ ప్రేమను కోల్పోలేదు. నీ ప్రేమను వదిలేసుకోలేదు. నీ కోసం ఏడ్చా. సూరజ్ మోసగాడని మర్చిపొమ్మనే మాటలు వింటూనే ఉన్నా. నువ్వు పగ తీర్చుకోవడానికి ప్రేమించావేమో కానీ నేను జీవితాన్ని పంచుకోవడానికే ప్రేమించా. అలా అని నువ్వు ప్రేమించాల్సిన అవసరం లేదని జ్యో అంటుంది.
మా గ్రానీ చేసిన పని
నువ్వు ప్రేమించినా లేకపోయినా నేను ప్రేమిస్తూనే ఉంటా. నా ప్రేమ నాతోనే ఉంటుంది. నాతోనే చస్తుంది. నన్ను ఎలా మర్చాలో తెలియక గ్రానీ చేసిన పని ఇది అని రూ.2 కోట్ల గురించి జ్యో చెప్తుంది. దీంట్లో నా తప్పేమీ లేదు. నువ్వు కోటీశ్వరుడివి అని కాదు, అనాథవి అని తెలిసినప్పుడే నీ మీద ప్రేమ కలిగింది. నీ నుంచి ప్రేమ మాత్రమే ఆశించానని జ్యో ఎమోషనల్ అవుతుంది.
నమ్మని సూరజ్
{{/usCountry}}నువ్వు ప్రేమించినా లేకపోయినా నేను ప్రేమిస్తూనే ఉంటా. నా ప్రేమ నాతోనే ఉంటుంది. నాతోనే చస్తుంది. నన్ను ఎలా మర్చాలో తెలియక గ్రానీ చేసిన పని ఇది అని రూ.2 కోట్ల గురించి జ్యో చెప్తుంది. దీంట్లో నా తప్పేమీ లేదు. నువ్వు కోటీశ్వరుడివి అని కాదు, అనాథవి అని తెలిసినప్పుడే నీ మీద ప్రేమ కలిగింది. నీ నుంచి ప్రేమ మాత్రమే ఆశించానని జ్యో ఎమోషనల్ అవుతుంది.
నమ్మని సూరజ్
{{/usCountry}}కానీ సూరజ్ మాత్రం కన్విన్స్ అవడు. జ్యోత్స్న ప్రేమను అబద్ధమంటాడు. ఇదంతా మోసమనే అంటాడు. నన్ను ప్రేమించి పగ తీర్చుకోవనే గ్యారెంటీ ఏంటీ? అందుకే మీ గ్రానీని పంపించి డబ్బు తీసుకున్నావ్. నీ ప్రేమను అమ్మేసుకున్నావ్ అని సూరజ్ అరుస్తాడు. ఏదైనా అబద్ధమను, కానీ నా ప్రేమను అబద్ధం అనకు. మోసం చేసింది నువ్వేనని జ్యోత్స్న కన్నీళ్లు పెట్టుకుంటుంది.
తాళి ఇచ్చేసిన సూరజ్
నీ వస్తువు నా దగ్గర ఉంది. ఇక దాని అవసరం లేదని తాళిని చూపిస్తాడు సూరజ్. ఆ తాళిని జ్యోత్స్న చేతిలో పెడతాడు. అన్ని తిరిగి ఇచ్చేశానని సూరజ్ అంటాడు. మరోవైపు జ్యోత్స్నను చంపేందుకు ఛాన్స్ కోసం రౌడీలు చూస్తుంటారు. సూరజ్ అడ్డుగా ఉన్నాడని లేపేద్దామని అనుకుంటారు.
సూరజ్ కు బుల్లెట్
మనం కలవడం ఇదే ఆఖరిసారి కావాలని కోరుకుంటున్నానని జ్యోత్స్నతో సూరజ్ అంటాడు. గట్టిగా కోరుకో. కానీ నేను నీ కోసమే బతుకుతున్నా. చచ్చినా నీ కోసమే చస్తానని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే జ్యోను కాల్చేందుకు వచ్చిన రౌడీని సూరజ్ చూస్తాడు. జ్యోను పక్కకు నెట్టేస్తాడు. ఆ బుల్లెట్ సూరజ్ కు తగులుతుంది. జ్యోను చంపాలని మాలిని వేసిన కుట్ర ఇలా సూరజ్ పాలిటి శాపంగా మారుతుంది.
సూరజ్ కింద పడిపోతాడు. తన ప్రాణం పోసైనా సూరజ్ ను బతికించుకుంటానని జ్యోత్స్న ఏడుస్తుంది. మీరు చెప్పిన అమ్మాయిని షూట్ చేయబోతే బుల్లెట్ వేరేవాళ్లకు తగిలిందని మాలిని బాడీగార్డు విజయ్ కు ఆ రౌడీ కాల్ చేసి చెప్తాడు. ఇటు సూరజ్ ను హాస్పిటల్ కు తీసుకెళ్తుంది సూరజ్. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండని డాక్టర్ అడుగుతాడు.
సూరజ్ బతకడం కష్టం
అవన్నీ తాను చూసుకుంటానని పరిగెత్తుకుంటూ వచ్చిన కార్తీక్ చెప్తాడు. సూరజ్ ను లోపలికి తీసుకెళ్తారు. జరిగిన విషయాన్ని కార్తీక్, దీపకు జ్యోత్స్న చెప్తుంది. సూరజ్ బతకడం కష్టం. బుల్లెట్ గుండె కింద తగిలింది. ఆపరేషన్ చేయాలి. ఏ నెగెటివ్ లేదా ఓ నెగెటివ్ బ్లడ్ కావాలి. కానీ మా హాస్పిటల్లో అందుబాటులో లేదని డాక్టర్ చెప్పేసరికి జ్యో షాక్ అవుతుంది.
వీలైనంత త్వరగా డోనర్ తీసుకురమ్మని డాక్టర్ చెప్తాడు. 20 నిమిషాలు దాటితే సూరజ్ బతకడం కష్టమంటాడు. ప్లీజ్ డాక్టర్ తనను కాపాడండని జ్యోత్స్న ఏడ్చేస్తుంది. మాలినికి కార్తీక్ ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుంది. దక్షిణామూర్తి కూడా లిఫ్ట్ చేయడు. ఇక అందరూ బ్లడ్ కోసం తెలిసినవాళ్లకు కాల్ చేస్తుంటారు. కానీ డోనర్ దొరకడు.
డాక్టర్ వచ్చి సిట్యువేషన్ సీరియస్ గా ఉంది. పేషెంట్ ఊపిరి తీసుకోలేకపోతున్నాడని చెప్తాడు. అప్పుడే ఓ వ్యక్తి కాల్ చేసి బ్లడ్ ఇస్తానని వస్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.