...
...
Next Story

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-జ్యోను చంపేందుకు ప్లాన్ చేశావ్ పిన్ని-కేసుతో మాలినిని వణికించిన కార్తీక్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 26 ఎపిసోడ్ లో జ్యోత్స్నను చంపాలనుకుంది మాలినే అని కార్తీక్ అంటాడు. పోలీసులు అరెస్టు చేస్తారని చెప్పడంతో మాలిని వణికిపోతుంది. ఇక సూరజ్ నే ప్రేమిస్తున్నానని జ్యోత్స్న మరోసారి చెప్తుంది. శివ నారాయణ ఫ్యామిలీని మాలిని అవమానిస్తుంది.

Published on: Nov 26, 2026, 06:54:23 IST
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. సూరజ్ ది తాను కాపాడిన ప్రాణమని, అది తనకే సొంతమని మాలినికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి సూరజ్ ను చూసేందుకు జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. ఇటు బయట ఏమో జ్యోత్స్నను చంపేందుకు ప్లాన్ చేసింది నువ్వే పిన్ని అని మాలినికి కార్తీక్ షాకిస్తాడు.

జ్యోత్స్నను చంపడానికి మాలిని ప్లాన్

కార్తీక దీపం 2-జ్యోను చంపేందుకు ప్లాన్ చేశావ్ పిన్ని-కేసుతో మాలినిని వణికించిన కార్తీక్ (jiohotstar)
కార్తీక దీపం 2-జ్యోను చంపేందుకు ప్లాన్ చేశావ్ పిన్ని-కేసుతో మాలినిని వణికించిన కార్తీక్ (jiohotstar)

మాలినినే జ్యోత్స్నను చంపడానికి ప్లాన్ చేశావని పోలీస్ ఆఫీసర్ ఆదిత్య జ్యోత్స్నను వివరాలు అడిగేటప్పుడు అన్నారని కార్తీక్ మాట మారుస్తాడు. జ్యోత్స్న ఎందుకు మాయమైందో తెలీదు. ఆ విషయంలో మాలినిపైనే అనుమానం ఉందని జ్యో అన్నది కదా.. అదే పగతో నువ్వు ఈ పని చేయించే అవకాశం ఉందని పోలీసు వాళ్లు అనుమానంతో అడిగారని కార్తీక్ చెప్తాడు.

మాలినేని షూట్ చేయించిందన్న దీప

మాలినినే షూట్ చేయించిందని దీప కూడా అంటుంది. బుల్లెట్ తగిలింది తన కొడుక్కని మాలిని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. తగలాల్సింది జ్యోత్స్నకు కదా అని దీప అంటుంది. అది నా కొడుక్కి తగిలింది కదా. కొడుక్కి గాయమైతే తల్లి బాధపడదా అని మాలిని అడుగుతుంది. నీ బాధ టార్గెట్ మిస్ అయినందుకు కాదు కదా అని కార్తీక్ అంటాడు.

అరెస్టు చేయొచ్చు పిన్ని

కార్తీక్ నువ్వు పెద్ద అలిగేషన్ వేస్తున్నావ్. ఆలోచించి మాట్లాడమని మాలిని కోప్పడుతుంది. జ్యోత్స్న కనిపించకుండా పోయిన కేసుతో పాటు ఈ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఫైల్ అయిందని కార్తీక్ చెప్పగానే మాలిని మైండ్ బ్లాక్ అవుతుంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏ క్షణమైనా వాళ్లు దొరకచ్చు. చిన్న క్లూ దొరికితే చాలు పోలీసులు ఎప్పుడైనా గుమ్మం తలుపు తట్టొచ్చు. అరెస్టు చేయొచ్చని కార్తీక్ చెప్పగానే మాలిని వణికిపోతుంది.

ప్రేమ అబద్ధం కాదు సూరజ్

బయట దక్షిణామూర్తితో శివ నారాయణ మాట్లాడుతుంటాడు. దక్షిణామూర్తి కన్నీరు పెట్టుకుంటాడు. అనవసరంగా ఎవరి ఉసురు పోసుకోకూడదని నీ కోడలికి చెప్పు. పాపాలు మూటగట్టుకుంటుంది. పెద్దలు చేసిన పాపాలే పిల్లలను వెంటాడుతాయని శివ నారాయణ చెప్తాడు. మనవడిని పోగొట్టుకుంటే బతకలేకపోయేవాడినని దక్షిణామూర్తి ఎమోషనల్ అవుతాడు.

నీ మనవరాలిని కాపాడబోయి నా మనవడు గాయపడ్డాడు. నా మనవడిని నీ మనవరాలు కాపాడింది. ఇదే విచిత్రమంటే అని దక్షిణామూర్తి అంటాడు. తప్పులు సరిదిద్దుకునేందుకు విధి అవకాశం ఇస్తుందని దశరథ చెప్తాడు.

సూరజ్ మీద ప్రేమ

సీన్ కట్ చేస్తే కాంచన ఇంట్లో అందరూ మాట్లాడుకుంటారు. సూరజ్ ను కలిసేందుకు రాత్రి జ్యోత్స్న ఎందుకు వెళ్లిందని పారిజాతం నానా రచ్చ చేస్తుంది. నాకు సూరజ్ మీద ప్రేమ ఉంది. ఇక ఆడపిల్లను ఇంట్లోవాళ్లు అర్థం చేసుకోకపోతే ఇంకెవరూ అర్థం చేసుకుంటారు. సూరజ్ తో పెళ్లి ఎందుకు ఆగిపోయిందో అందరికీ తెలుసు. కానీ నా ప్రేమ అబద్ధం కాదు కదా అని జ్యోత్స్న స్పష్టం చేస్తుంది.

దీప కోపం

ఇది నా రాత. అది చెరుపుకోలేనంత బలంగా రాశారు. నేను బతికున్నానంటే కారణం సూరజ్ అని జ్యోత్స్న అంటుంది. సూరజ్ డిశ్ఛార్జ్ అయ్యాక చూసొద్దామని కార్తీక్ అంటాడు. దశరథ, సుమిత్ర ఏమో వెళ్తామని శివ నారాయణను ఒప్పిస్తారు. సూరజ్ ను చూసేందుకు అందరం వెళ్లేలా చేయడం ఏంటీ అని కార్తీక్ పై దీప కోప్పడుతుంది. ఆ కోపాన్ని శౌర్యపై చూపిస్తుంది దీప.

కార్తీక్ ప్లాన్

శౌర్యకు వేళ్లు చూపించి కార్తీక్ పట్టుకోమంటాడు. శౌర్య మరో వేలు పట్టుకోవడంతో దీపకు నిజం చెప్పనని కార్తీక్ అంటాడు. మన కుటుంబాల కోసం సూరజ్ కు తాళి ఇచ్చి మంచి పని చేశాం. కానీ మనం అనుకోనిది జరిగింది. ఇప్పుడు సూరజ్ మనసులో జ్యోత్న్సపై ఉన్న ప్రేమను బయటకు తీయాలి. అదెలా చేయాలో మాలిని పిన్ని ఇంటికి వెళ్లాక చెప్తానని దీపకు కార్తీక్ చెప్తాడు. దీన్ని బట్టి కార్తీక్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని అర్థమవుతుంది.

అవమానించిన మాలిని

మరోవైపు తన ఇంట్లో శివ నారాయణ ఫ్యామిలీని చూసి మాలిని షాక్ అవుతుంది. సూరజ్ ను డిశ్చార్జ్ చేశారని తెలిసి పలకరించడానికి వచ్చామని శివ నారాయణ అంటాడు. అంతేనా ఉన్నాడో పోయాడో అని చూడటానికి వచ్చారా అని మాలిని వెటకారంగా మాట్లాడుతుంది. ఒకరిపై ఒకరు మాటలు అనుకుంటారు. వాళ్లు తెచ్చిన పళ్లను పని మనిషికి ఇచ్చి శివ నారాయణను మాలిని అవమానిస్తుంది.

మాలిని పిన్ని వాళ్లు ఆకాశంలో పండించిన వాటినే తింటారని వెటకారంగా కార్తీక్ అంటాడు. ఇంటి బయటకు వెళ్లిన జ్యోత్స్నను సూరజ్ బాల్కనీలో నుంచి చూస్తాడు. జ్యోత్స్న నిజంగా వచ్చిందా? లేకపోతే భ్రమా అనుకుంటున్నావా బ్రదర్. ఇది నిజమే. జ్యోత్స్న నీ కోసం తినకుండా ఉందని సూరజ్ తో కార్తీక్ అంటాడు. ఇక్కడితో కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks