కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 28 ఎపిసోడ్ లో గ్రానీ, మనకు లైఫ్ లో రెండే దారులుంటాయి. ఒకటి గెలవడం, మరొకటి ఓడిపోవడం. ఓడిపోవాలంటే నీలా చూస్తూ ఉంటే సరిపోతుందని జ్యోత్స్న అంటుంది. మరి నువ్వేం చేశావ్? ఆస్తి మీద కార్తీక్ మీద తప్ప నీకు ఎవరి మీద ప్రేమ లేదు. నువ్వు ఎప్పుడైతే ఫామ్ లోకి వచ్చావో అప్పుడే అటు ఇటు కాకుండా అయిపోయానని పారు అంటుంది. మమ్మీ ఎక్కడుందో బావకు తెలుసని నా డౌట్ అని జ్యో అంటుంది.
దీప ఇంటి దేవత

మమ్మీ గురించి చెప్పకుండా ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమోనని జ్యోత్స్న అనుమానపడుతుంది. నువ్వు అనుకున్నది సాధించాలంటే సుమిత్ర, దశరథ కలిసి ఉండాలి. కార్తీక్, దీప వాళ్లిద్దరు కలుపుతారని పారు అంటుంది. బావ సీఈఓ అవుతాడు, దీప ఇంటి దేవత అవుతుంది. ఆ క్రెడిట్ ఎవరికి దక్కకూడదు. నా మీద ఉన్న చెడ్డ పేరు పోవాలంటే మమ్మీని నేనే తీసుకురావాలని జ్యో అంటుంది.
అగ్రిమెంట్
ఇంట్లో పనివాళ్లకు, డ్రైవర్ కు ఉన్న విలువ సొంత వాళ్లకు లేదని మార్నింగ్ శివన్నారాయణ ముందు పారుతో అంటుంది జ్యోత్స్న. విలువ అనేది తెచ్చి పెట్టుకోవాలని శివన్నారాయణ చెప్తాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు. మీ ఆవిడ ఎక్కడ? అని పారు అడుగుతుంది. దీప రావడం లేదు. అగ్రిమెంట్ మీద సైన్ చేసింది నేను. మీ మాట నేను వింటా. నా మాట భార్య వింటుందని కార్తీక్ అంటాడు. అప్పుడే దశరథ బయటకు వెళ్తానని అంటాడు.
శివన్నారాయణ ఫైర్
నువ్వు కూడా సుమిత్ర లాగా బయటకు వెళ్లిపోతున్నావా ఏంటీ? అని పారు అడిగే సరికి శివన్నారాయణ ఫైర్ అవుతాడు. మేమిద్దరం కలిసి భోజనం చేస్తాం కదా. నా గురించి వెయిట్ చేయకుండా భోజనం చేసేయండని దాని అర్థమని సీరియస్ అవుతాడు. పోయిన వాళ్ల కోసం మనం పోవాల్సిన అవసరం లేదని శివన్నారాయణ అంటాడు. అంటే మా మమ్మీని మీరు వెతకరా? అని జ్యో ప్రశ్నిస్తుంది. అందరూ అదే పనిలో ఉన్నారు. నేను నా కొడుకునే వదులుకోలేనని శివన్నారాయణ అంటాడు.
కార్తీక్, శివన్నారాయణ సైగ చేసుకోవడం పారు చూస్తుంది. అదే విషయాన్ని అడుగుతుంది. మరి సుమిత్ర వెళ్లిపోతుంటే కనిపించలేదు కానీ సైగ కనిపించిందా? అంటే సుమిత్ర కూడా కనిపించే ఉంటుంది. అయితే అబద్ధం చెప్పావా? అని శివన్నారాయణ గద్దించి అడుగుతాడు. మమ్మీని తీసుకొస్తానని జ్యోత్స్న బయటకు వెళ్తుంది.
కాళ్లు పట్టుకున్న కాశీ
{{/usCountry}}కార్తీక్, శివన్నారాయణ సైగ చేసుకోవడం పారు చూస్తుంది. అదే విషయాన్ని అడుగుతుంది. మరి సుమిత్ర వెళ్లిపోతుంటే కనిపించలేదు కానీ సైగ కనిపించిందా? అంటే సుమిత్ర కూడా కనిపించే ఉంటుంది. అయితే అబద్ధం చెప్పావా? అని శివన్నారాయణ గద్దించి అడుగుతాడు. మమ్మీని తీసుకొస్తానని జ్యోత్స్న బయటకు వెళ్తుంది.
కాళ్లు పట్టుకున్న కాశీ
{{/usCountry}}అల్లుడి విషయం ఏం చేయాలో అర్థం కావడం లేదే అని ఆలోచిస్తుంటాడు శ్రీధర్. అప్పుడే కాశీ వస్తాడు. సిన్సియర్ గానే జాబ్ కోసం ట్రై చేశానని కాశీ అంటే, జాబ్ కూడా వచ్చింది కదా. రోడ్డు పక్కన బాగానే చేస్తున్నావని శ్రీధర్ అంటాడు. 9 టు 5 అంటే బాగానే మేనేజ్ చేశావు. మరి శాలరీ ఎలా? దొంగతనాలు చేస్తున్నావా? అని అడుగుతాడు శ్రీధర్.
జాబ్ లేకపోవడం భరించలేకపోయా. ఒకరేమో రెస్టారెంట్లో పని చేయమని, ఇంకొకరు బిజినెస్ చేయమని సలహాలిస్తున్నారు. అందుకే జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి బయటకు వెళ్లి ఏదో ఒకటి ట్రై చేద్దామనిపించిందని కాశీ అంటాడు. మోసం చేసేవాళ్లు, అబద్దం చెప్పేవాళ్లంటే స్వప్నకు పరమ చిరాకు. అందుకే స్వప్నకు నిజం చెప్పేస్తానని శ్రీధర్ అంటాడు. నిజం చెప్పకండని మామయ్య కాళ్లు పట్టుకుంటాడు కాశీ. అది స్వప్న చూస్తుంది.
గుడికి దశరథ
దశరథ, కార్తీక్ గుడికి వెళ్తారు. మనశ్శాంతి గురించి కార్తీక్ ఏవో మాటలంటాడు. నీకు, మీ తాతకు ఏమైందిరా? కొత్తగా కనిపిస్తున్నారు. ఏవేవో మాట్లాడుతున్నారని దశరథ అంటాడు. కార్తీక్ ఏమో మామయ్యతో వెటకారంగా మాట్లాడతాడు. దీపకు ఫోన్ చేసి అత్తను శివాలయానికి తీసుకొని రా అని చెప్తాడు. గుడి దగ్గర మొబైల్ ఫోన్స్ కు అనుమతి లేదనే బోర్డు చూసి కార్లో పెడతాడు కార్తీక్.
కనిపించని సుమిత్ర
బావ ఫోన్ చేశాడని కాంచనకు చెప్తుంది దీప. కానీ వదిన గుడికి రాదు కదా. ఈ రోజు వాళ్ల పెళ్లి రోజు. అది తెలిసే గుడికి రానని అంటుందని కాంచన చెప్తుంది. అయితే అబద్ధం చెప్పి తీసుకెళ్తానని దీప అంటుంది. కానీ గదిలోకి వెళ్లి చూస్తే సుమిత్ర కనిపించదు. ఇళ్లంత వెతికినా జాడ దొరకదు. అత్తయ్య, సుమిత్రమ్మ అని చెప్తూ జ్యోత్స్నను చూసి దీప ఆగిపోతుంది.
పోలీసులతో జ్యో
మాట పూర్తి చేయ్. సుమిత్రమ్మ అన్నావు కదా. మా మమ్మీ మాట నీ నోటి వెంట ఎందుకు వచ్చింది? మా మమ్మీ ఈ ఇంట్లోనే ఉన్నట్లు, మీరే దాచి పెట్టినట్లు అనిపిస్తోందని జ్యో అంటుంది. మీ మమ్మీ ఈ ఇంట్లో ఉండటం ఏంటీ? అని కాంచన అడుగుతుంది. అప్పుడే పోలీసులను లోపలికి రమ్మంటుంది జ్యోత్స్న. మా మమ్మీ రెండు రోజుల నుంచి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా. మమ్మీకి ఓ శత్రువు ఉందని ఇక్కడికి తీసుకొచ్చానని జ్యో అంటుంది.
ఎస్ఐ మీరు అరెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. నేను లోపలికి వెళ్లి మమ్మీని తీసుకొస్తానని జ్యోత్స్న వెళ్తుంది. మమ్మీ అని పిలుస్తూ వెతుకుతుంది. కానీ సుమిత్ర కనిపించదు. దీప మా మమ్మీ ఎక్కడ? ఎక్కడ దాచారు? అని జ్యో ప్రశ్నిస్తుంది. చెప్పు దీప, మా మమ్మీని ఏం చేశావని అడుగుతుంది. మరోవైపు సుమిత్ర కూడా గుడికి వెళ్తుంది. అక్కడ దశరథను చూస్తుంది. దీంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.