Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో.. శివ నారాయణ టిఫిన్ బండి దగ్గర దీప గిన్నెలు కడుగుతుంటుంది. అది చూసిన జ్యోత్స్న తానే ఆ పని చేస్తానంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ వి, కింద కూర్చుని గిన్నెలు కడగాలంటే ఇబ్బంది అవుతుంది. నేను కడుగుతానని జ్యోత్స్న పని చేస్తుంది.
సుమిత్ర షాక్

నీకు చేతకాదు జ్యోత్స్న అని దీప అంటుంది. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తాయి దీప. నేను చేయగలనని జ్యోత్స్న గిన్నెలు తోముతుంది. అది చూసిన కార్తీక్.. జ్యోత్స్న మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లో పాల్గొన్న రోజులను గుర్తు చేసుకుంటాడు. అప్పుడే వచ్చిన సుమిత్ర.. జ్యోత్స్నను చూసి షాక్ అవుతుంది. కానీ దశరథ ఏమో పని చేయమంటాడు.
శివ నారాయణకు కోపం
మోసం చేసిన సూరజ్ ను నేనేమైనా చేయగలిగానా? అని శివ నారాయణ అంటాడు. అప్పుడే సూరజ్ కార్లో వస్తాడు. అదే కార్లో పారిజాతం ఉంటుంది. హే జ్యోత్స్న గిన్నెలు కడగడం ఆపి దగ్గరకు రా అని సూరజ్ పిలుస్తాడు. దీంతో శివ నారాయణకు పిచ్చి కోపమొస్తుంది. కర్ర పట్టుకొని కొట్టడానికి వెళ్తాడు.
పారు డ్రామా
అయితే కార్లో వెనుకాల ఉన్న పారును చూసి అందరూ కంగారు పడతాడు. కారు కింద పడితే తీసుకొచ్చానని సూరజ్ చెప్తాడు. ఇంతకంటే ఎక్కువ నటిస్తే బాగుండదని పారు మెల్లగా కళ్లు తెరుస్తుంది. నేను మిమ్మల్ని చూసి బ్రేక్ వేశా. మీరే బానెట్ ను గుద్దుకొని పడిపోయారు. కావాలంటే అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీ చూద్దామని సూరజ్ అనడంతో పారుకు ఫ్యూజులు ఔట్ అవుతాయి.
దేవుడిలా కాపాడావని పారు అంటుంది. దేవుళ్లే కాదు దెయ్యాలు కూడా కాపాడుతాయని శివ నారాయణ కౌంటర్ వేస్తాడు. జ్యోత్స్న తిరిగి గిన్నెలు తోముతుంది. సూరజ్ అది చూసి వెళ్లిపోతాడు. నువ్వు గిన్నెలు కడుతున్నావేంటే అని జ్యోను పారు అడుగుతుంది. మరి నువ్వు కడుగు అని జ్యో సెటైర్ వేస్తుంది.
జ్యోత్స్న వీడియో
{{/usCountry}}దేవుడిలా కాపాడావని పారు అంటుంది. దేవుళ్లే కాదు దెయ్యాలు కూడా కాపాడుతాయని శివ నారాయణ కౌంటర్ వేస్తాడు. జ్యోత్స్న తిరిగి గిన్నెలు తోముతుంది. సూరజ్ అది చూసి వెళ్లిపోతాడు. నువ్వు గిన్నెలు కడుతున్నావేంటే అని జ్యోను పారు అడుగుతుంది. మరి నువ్వు కడుగు అని జ్యో సెటైర్ వేస్తుంది.
జ్యోత్స్న వీడియో
{{/usCountry}}అప్పుడే అక్కడికి వచ్చిన ఓ కుర్రాడు జ్యోత్స్నను చూసి ఆమె మిస్ హైదరాబాద్ కదా అనుకుంటాడు. ఆమె గిన్నెలు కడగడాన్ని సోషల్ మీడియాలో పెడితే ఎన్ని లైక్ లు కొడతారో అని సీక్రెట్ గా జ్యోత్స్న వీడియో తీస్తాడు. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తాడు.
నువ్వే పాపం చేశావ్
రాత్రి ఇంట్లో ఈ వీడియో చూసి సూరజ్ షాక్ అవుతాడు. ఆ వీడియోను దక్షిణామూర్తి చూసి సోఫాలో కూలబడిపోతాడు. జ్యోత్స్న నీ మరదలు అని నీకు తెలుసు కదా. నా మనవరాలికి ఇదేం కర్మరా. నువ్వే పాపం చేశావ్. నువ్వే దాని తలరాత మార్చేశావ్. మూడు ముళ్లు పడకపోవడం వల్ల నా మనవరాలి జీవితం నాశనమైపోయింది. జరిగేదేదీ నాకు నచ్చడం లేదని దక్షిణామూర్తి ఎమోషనల్ అవుతూ లోపలికి వెళ్లిపోతాడు.
లవ్ సింబల్
జ్యోత్స్న గిన్నెలు కడుతున్న ఫొటోను ఆమెకే సూరజ్ పంపిస్తాడు. శౌర్య వచ్చి ఫోన్ ఇవ్వమంటే జ్యో ఇవ్వదు. ఇద్దరు ఫోన్ పట్టుకుని లాగుతారు. ఆ క్రమంలో సూరజ్ కు లవ్ సింబల్ రిప్లేగా వెళ్తుంది. అది చూసి సూరజ్ తల పట్టుకుంటాడు. వెంటనే జ్యో డిలీట్ చేస్తుంది. సూరజ్ కాల్ చేసి మాట్లాడుతాడు. కావాలనుకునే ఫొటోలు తీయించుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నావా అని జ్యోను సూరజ్ అడుగుతాడు.
రాకాసి రాశి
మార్నింగ్ మనం మన ప్లేస్ లో కలుద్దామని సూరజ్ అడుగుతాడు. జ్యోత్స్న రానంటుంది. రాశి, నక్షత్రం అడిగితే.. రాకాసి రాశి, పిశాచి నక్షత్రం అని జ్యో చెప్తుంది. నీతో మాట్లాడాలని సూరజ్ అంటే.. ఓ ఛైర్మన్ పీఏని అడుగుతున్నట్లు అడుగుతున్నారా? లేదా ఓ అమ్మాయిని అబ్బాయి అడుగుతున్నట్లు అడుగుతున్నారా? అని జ్యోత్స్న అడుగుతుంది.
సూరజ్ అనే నేను జ్యోత్స్న అమ్మాయిని కలవాలనుకుంటున్నాడని సూరజ్ చెప్తాడు. దీనికి జ్యో ఒప్పుకుంటుంది. ఏం చెప్తాడో అని జ్యో ఆలోచిస్తుంది. ఎలా చెప్పాలో అని సూరజ్ అనుకుంటాడు.
సుమిత్ర కాళ్లుపట్టిన దశరథ
ఇక సుమిత్ర కాళ్ల నొప్పులకు కొబ్బరి నూనె రాస్తానని దశరథ అడుగుతాడు. కానీ అందుకు సుమిత్ర ఒప్పుకోదు. భార్య కాళ్లు భర్త నొక్కితే ఐశ్వర్యం అని దశరథ బలవంతం చేస్తాడు. భార్య కాళ్లకు ఆయిల్ రాసి మసాజ్ చేస్తాడు. ఇదంతా జ్యోత్స్న, దీప చూస్తారు.
పుట్టింటికి వెళ్లిపో సుమిత్ర
నువ్వు పేదరికంలో మగ్గడం నాకు ఇష్టం లేదు. నీ పుట్టింటికి నువ్వు, జ్యోత్స్న వెళ్లిపోవచ్చు కదా అని దశరథ అడుగుతాడు. ఎప్పుడు వెళ్లమంటారు? జ్యోత్స్న ఒప్పుకుంటుందా? అని సుమిత్ర షాక్ ఇస్తుంది. నేను జ్యోత్స్నను ఒప్పిస్తానని దశరథ అంటాడు. సరేనండి, కానీ ఇలా వదిలేసే అవకాశం మీకు వస్తే వెళ్లిపోతారా? మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్తా? అని రాముడి కోసం అడవిలోకి వెళ్లిన సీత కథను సుమిత్ర చెప్తుంది.
జ్యోత్స్నను పెళ్లికి ఒప్పించాలి. మన కోసం కష్టపడుతుంది. పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఈ బాధలు ఉండవు కదా అని సుమిత్రతో దశరథ చెప్తాడు. సుమిత్ర కూడా సరేనంటుంది. పెళ్లి కోసం డబ్బులు దాయాలి. బంగారం కొనలేకపోయినా మంచి చీరైనా కొనాలి కదా అని సుమిత్ర ఏడిపించేస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.